
పుష్ప క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా మేనరిజానికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది.

పుష్పరాజ్‌కు ఉన్న క్రేజ్‌తో తాజాగా వినాయక చవితికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తమిళనాడులోని హోసూరుకు చెందిన ఫ్యాన్స్ పుష్ప మూవీ సెట్ తరహాలో ఏర్పాటు చేశారు.

ఎర్రచందనం దుంగల సెటప్‌తో అచ్చం పుష్ప స్టైల్లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

ఈ పుష్ప స్టైల్లో ఉన్న వినాయక విగ్రహాలను చూసేందుకు అభిమానులే కాదు.. భక్తులు కూడా పెద్దఎత్తున తరలివస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశారు.

ఇది చూసిన పుష్పరాజ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.









