అనంతగిరి: రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ పట్టణ పరిధిలోని శివారెడ్డిపేట పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. క్యూలో నిలబడి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అన్నదాతలు పొలం పనులు వదిలేసి యూరియా కోసం తిరగాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి.. కేంద్రం వాటా అందకపోవడం వల్లే యూరియా కొరత వస్తోందని చెబుతుంటే సీఎం మాత్రం కొరతే లేదని చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.కేసీఆర్ పాలనలో ఏ రోజూ యూరి యా కొరత రాలేదన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడాల ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అద్యక్షుడు గోపాల్, మండల పార్టీ అద్యక్షుడు మైపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు మేక శేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుభాన్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, కిశోర్ గయాజ్ పాల్గొన్నారు.