
అమ్మ మందలించిందని..
ఇబ్రహీంపట్నం: తల్లి మందలించడంతో అలిగి ఇంట్లో నుంచి వెళ్లిన బాలున్ని ఇబ్రహీంపట్నం పోలీసులు క్షేమంగా అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దేవరకొండకు చెందిన విజయకుమారి, హరిష్ దంపతులు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరి కొడుకు తుర్కయంజాల్ కాకతీయ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. చిన్న విషయంలో అమ్మ మందలించిందనే కారణంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తుర్కయంజాల్ నుంచి ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసుల కంటపడ్డాడు. అతన్ని ఆరా తీసి, పీఎస్‌కు తీసుకెళ్లి తల్లిదండ్రులను పిలిచి అప్పగించారు.
● ఇంట్లోనుంచి వెళ్లిన బాలుడు
● తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు