
ఫిజిక్స్‌లో విద్యారాణికి పీహెచ్‌డీ పట్టా
షాద్‌నగర్‌రూరల్: ఫిజిక్స్‌లో ‘వేరియబుల్ అపోడైజేషన్ రీసెర్చ్ గైడ్ ఆప్టికల్ ఇమేజింగ్ సిస్టం’పై చేసిన పరిశోధనకు గాను షాద్‌నగర్ పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీకి చెందిన ఎస్.విద్యారాణికి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది. విద్యారాణి ప్రొఫెసర్ కరుణసాగర్ నేతృత్వంలో పరిశోధన చేసి గ్రంధాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ నారాయణన్, వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాలలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
డాక్టరేట్ అందుకున్న సంధ్యారాణి
సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ షాద్‌నగర్ డివిజన్‌లో సూపర్ వైజర్‌గా పని చేస్తున్న సంధ్యారాణి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గంగపుత్ర కమ్యూనిటీలో మహిళా సాధికారత అంశంపై అసోసియేటెడ్ ప్రొఫెసర్ ధీరజ్ పర్యవేక్షణలో ఆమె పరిశోధన చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్, యూనివర్సిటీ వీసీ కుమార్ మొలుగారం చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు.
ఐదుగురు అధ్యాపకులకు డాక్టరేట్
హయత్‌నగర్: హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న లెక్చరర్లు అవేష్ మోహియుద్దీన్, మధు, మక్ల, యాదగిరిరెడ్డి, నాగరాజు డాక్టరేట్ అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్‌బాబు తెలిపారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, వీసీ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేసినందుకు గాను అవేష్ మోహియుద్దీన్, మధుకు, రాజనీతి శాస్త్రంలో పరిశోధనలకు యాదగిరిరెడ్డి, నాగరాజులక, ఇంగ్లిష్‌లో పరిశోధనలకు మక్లకు దక్కాయి.

ఫిజిక్స్‌లో విద్యారాణికి పీహెచ్‌డీ పట్టా