విద్యుత్‌ షాక్‌తో మూగజీవాల మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో మూగజీవాల మృత్యువాత

Aug 20 2025 9:30 AM | Updated on Aug 20 2025 9:30 AM

విద్య

విద్యుత్‌ షాక్‌తో మూగజీవాల మృత్యువాత

బంట్వారం: విద్యుత్‌ షాక్‌తో మేకలు మృతిచెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున కోట్‌పల్లి మండలం బార్వాద్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పెంటయ్య ఎప్పటిలాగే తన మేకలను ఇంటి సమీపంలోని రేకుల షెడ్డులో ఉంచాడు. కరెంటు తీగలు రేకులకు తగలడంతో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఎనిమిది మేకలు మృతిచెందాయి. దీంతో తన రూ.లక్షకుపైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.

పాడి గేదె దుర్మరణం..

యాలాల: విద్యుదాఘాతంతో ఓ గెదే మృతి చెందింది. దేవనూరుకు చెందిన గోరేపల్లి లక్ష్మప్పకు చెందిన గెదేను పొలం శివారులోని షెడ్డులో మేతకు వదిలాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు షెడ్డులో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీని విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని బాధితుడు వాపోయాడు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో

ఇద్దరికి జైలు

మోమిన్‌పేట: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ అరవింద్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రం మోమిన్‌పేటకు చెందిన అరిగే ఉదయ్‌కుమార్‌, కుడుగుంట విజయ్‌ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వీరిని వికారాబాద్‌ మార్నింగ్‌ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చగా.. మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.3 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడుపకూడదని హెచ్చరించారు.

రహిమతున్నీసాకు

బెస్ట్‌ టీచర్‌ అవార్డు

అనంతగిరి: పూడూరు మండలం మీర్జాపూర్‌ ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న రహిమతున్నీసా బెస్ట్‌ టీచర్‌ అవార్డును అందుకున్నారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్‌ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు.

600 ఎకరాల్లో పంట నష్టం

తాండూరు రూరల్‌: వర్షాలకు దెబ్బతిన్న పంటనష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తాండూరు వ్యవసాయశాఖ ఏడీఏ కొముర య్య అన్నారు. మంగళవారం పలు గ్రామాల్లో ని పంట పొలాలను పరిశీలించారు. తాండూరు మండలంలో 600 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని తెలిపారు. ఈనివేదికను జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు పంపిస్తామన్నారు. పత్తి పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపించాలని రైతులకు సూచించారు. ఆయన వెంట ఏఈఓ, రైతులు ఉన్నారు.

చెరువు కట్టకు

తాత్కాలిక మరమ్మతులు

ధారూరు: మండల పరిధిలోని గురుదోడ్ల చెరువు కట్టకు ఇరిగేషన్‌ అధికారులు మంగళారం తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈనెల 14న అర్ధరాత్రి వేళతెగిపోయిన కట్ట ముందు భాగంలో ఇసుక బస్తాలు వేసి మట్టితో పూడ్చారు. బుధవారం పనులను పూర్తి చేస్తామని చెప్పడంతో రైతులు సంతోషం వ్యక్తంచేశారు. చెరువు నుంచి పారిన వరదతో 35 ఎకరాల మేర పంట పాడైందని తెలిపారు. రూ.2.50 లక్షలు వెచ్చించి రాజమండ్రి నుంచి చేప పిల్లలు తీసుకువచ్చి వదిలామని, కట్ట తెగిపోవడంతో తాము నష్టపోయామని పీసీఎంతండా, జీడిగడ్డతండా గిరిజనులు వాపోయారు. తమకు పరిహారం చెల్లించాలని బాధితులు కోరారు.

ఇద్దరికి జైలు

మోమిన్‌పేట: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ అరవింద్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రం మోమిన్‌పేటకు చెందిన అరిగే ఉదయ్‌కుమార్‌, కుడుగుంట విజయ్‌ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో వీరిని వికారాబాద్‌ మార్నింగ్‌ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చగా.. మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.3 వేల చొప్పున జరిమానా విధించారన్నారు.

విద్యుత్‌ షాక్‌తో  మూగజీవాల మృత్యువాత 1
1/2

విద్యుత్‌ షాక్‌తో మూగజీవాల మృత్యువాత

విద్యుత్‌ షాక్‌తో  మూగజీవాల మృత్యువాత 2
2/2

విద్యుత్‌ షాక్‌తో మూగజీవాల మృత్యువాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement