
భారీ వర్షాలకు కూలిన ఇళ్లు
తాండూరు టౌన్: మల్‌రెడ్డిపల్లిలో కూలిన ఇంటి పైకప్పు
మర్పల్లి: గుర్రంగట్టు తండాలో ఇల్లు కూలడంతో ఆదుకోవాలని కోరుతున్న బాధితులు
పరిగిలో వర్షానికి కూలిన ఇల్లు
పరిగి/తాండూరు టౌన్/మర్పల్లి/దోమ: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు మండలాల్లో మంగళవారం ఇళ్లు కూలిపోయాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మర్పల్లి మండలం బూచన్‌పల్లి, గుర్రం గట్టుతండా, కొత్లాపూర్ గ్రామాల్లో మూడు ఇళ్లు పడిపోయాయి. తమను ఆదుకోవాలని బాధితులు నూతి లలితమ్మ, మెగావత్ సీతీబాయి, బేగరి పద్మమ్మ ప్రభుత్వాన్ని కోరారు. దోమ మండలం ఐనాపూర్‌లో నర్సమ్మకు చెందిన పెంకుటిల్ల్లు కూలిపోయింది. ఇంట్లోని సామగ్రి పూర్తిగా దెబ్బతింది. పరిగి పట్టణ పరిధిలోని బోయవాడ కాలనీకి చెందిన కుమ్మరి నర్సింహులు ఇల్లు పడిపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు. తాండూరు పట్టణం మల్‌రెడ్డిపల్లిలోని ఓ ఇల్లు కూలిపోయింది. మిట్టి చంద్రమ్మ భర్త మృతి చెందడంతో ఇద్దరు కుమారులతో నాపరాతి కప్పు గల ఇంటిలో జీవనం సాగిస్తోంది. ఇద్దరు కుమారులు పనుల కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. మంగళవారం ఇంటి పైకప్పు ఓ పక్క కూలిపోయింది. ఆ సమయంలో చంద్రమ్మ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తనకు ఇళ్లు తప్ప ఏ దిక్కూ లేదని, ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఆర్థిక సాయం అందించాలని వేడుకుంది.

భారీ వర్షాలకు కూలిన ఇళ్లు

భారీ వర్షాలకు కూలిన ఇళ్లు