
ప్రమాదకర వాగులు దాటొద్దు
మోమిన్‌పేట: వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కు పలు మార్గాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని వాటిని దాటే ప్రయత్నం చేయరాదని ఎస్పీ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వాగు దాటాల్సి వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రమాదం జరగదని తేలిన తర్వాతే దాటే ప్ర యత్నం చేయాలన్నారు. మంగళవారం మండలంలోని నందివాగు ప్రాజెక్టు అలుగు, కల్వర్టును పరిశీలించారు. ఇలాంటి వాటిని దాటరాదన్నారు. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాలు తగ్గు ముఖం పట్టేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత వర కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. అత్యవసరం అయితే సుర క్షిత మార్గాల్లో మాత్రమే వెళ్లాలని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు లేదా డయల్ 100కు కాలే చేయాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ వెంకట్, ఎస్‌ఐ అరవింద్ తదితరులు ఉన్నారు.