పొలంలో నీరు ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

పొలంలో నీరు ఉండొద్దు

Aug 20 2025 9:36 AM | Updated on Aug 20 2025 9:36 AM

పొలంలో నీరు ఉండొద్దు

పొలంలో నీరు ఉండొద్దు

● జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం ● ధారూరులో నీట మునిగినపత్తి చేను పరిశీలన

ధారూరు: మండల కేంద్రంలో నీట మునిగిన పత్తి పంటను జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం పరిశీలించారు. మంగళవారం ధారూరు రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధిక వర్షాలు కరుస్తునందున పంట పొలాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలన్నారు. కాల్వలు తీసి నీటిని బయటకు పంపాలని సూచించారు. వేరుకుళ్లు తెగు లు రాకుండా కాపర్‌ ఆక్సి క్లోరైడ్‌ 3 గ్రాముల ముందును లీటరు నీటిలో కలిపి మొక్క మొదళ్ల వద్ద పోయాలన్నారు. ప్రస్తుతం కంది పంట కొమ్మలు ఏర్పడే దశలో ఉందని, వేరుకుళ్లు తెగులు నివారణకు 2 గ్రాముల మెటలాగ్జిన్‌ను లీటరు నీటిలో కలిపి మొదళ్లు తడిసెలా పోయాలన్నారు. నానో యూరియా వాడాలని రైతులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement