
డెంగీ నివారణకు చర్యలు
తాండూరు: మున్సిపల్ పరిధిలో డెంగీ నివారణకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీంద్రయాదవ్ ఆధ్వర్యంలో ఇందిరానగర్, మల్‌రెడ్డిపల్లి, పాత తాండూరు ప్రాంతాల్లో దోమలు, లార్వాల నివారణకు మందు పిచికారీ చేశారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్లకు వెళ్లి ఫీవర్ సర్వే చేశారు. పరిసరాలు, ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ మాలశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
అనంతగిరి: అపోలో హోం హెల్త్ కెర్ ప్రైవేట్ లిమిటెడ్ నందు హోం కేర్ నర్సస్ ఉద్యోగాల భర్తీ కోసం గురువారం వికారాబాద్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి సుభాన్ మంగళవారంఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటలకు పట్టణంలోని ఐటీఐ కళాశాల ఆవరణలో జాబ్‌మేళా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9676047444లో సంప్రదించాలన్నారు.
ప్రవీణ్‌కుమార్‌ను
కలిసిన నర్మద
కొడంగల్: బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఆ పార్టీ కొడంగల్ నాయకురాలు నర్మద మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. కొడంగల్‌లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని ఆయన సూచించారని తెలిపారు.
హిందీ ఉపాధ్యాయురాలికి పీహెచ్‌డీ పట్టా
దుద్యాల్: మండలంలోని పోలేపల్లికి చెందిన నర్సమ్మ హిందీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన 84వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని చెట్టుపల్లి తండా కేజీబీవీలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ దళిత సాహిత్యంపై హిందీలో పరిశోధనలు చేసినట్లు తెలిపారు. తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆమెను అభినందించారు.
సాదియా బేగంకు
బంగారు పతకం
పరిగి: పరిగి పట్టణానికి చెందిన నజీరుద్దీన్ కూతురు సాదియా బేగం బంగారు పతకం అందుకుంది. ఉస్మానియ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లిష్ 2023 – 24లో టాపర్‌గా నిలవడంతో బంగారు పతకం అందజేశారు. మంగళవారం నగరంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పతకాన్ని అందుకున్నారు.

డెంగీ నివారణకు చర్యలు

డెంగీ నివారణకు చర్యలు

డెంగీ నివారణకు చర్యలు