Telangana Crime News: ప్రేమ వేధింపులకు విసిగి.. బాలిక తీవ్ర నిర్ణయం..
Sakshi News home page

ప్రేమ వేధింపులకు విసిగి.. బాలిక తీవ్ర నిర్ణయం..

Aug 20 2023 6:14 AM | Updated on Aug 20 2023 2:28 PM

- - Sakshi

వికారాబాద్‌: ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యాలాల మండల పరిధిలోని హాజీపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ అరవింద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్జుకాడి వెంకటమ్మ, రాములు దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వీరిలో పెద్ద కూతురు ప్రవలిక (17) పదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన కమాలి రాజు కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు.

ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ప్రవలికను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజు వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement