చేతులెత్తేస్తారా..? | - | Sakshi
Sakshi News home page

చేతులెత్తేస్తారా..?

Aug 11 2026 7:21 AM | Updated on Aug 11 2026 7:21 AM

రైతులపైనే రవాణా! మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి. యూరియా బస్తాల రవాణా మరింత భారమైంది. మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

జిల్లా అంతటా విక్రయం

రైతులపైనే రవాణా! మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి. యూరియా బస్తాల రవాణా మరింత భారమైంది.
ఛేదిస్తారా..

వికారాబాద్‌: నకిలీ డీఏపీ వ్యవహారం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన డీఏపీ పంటలకు మేలు చేస్తుందా..? లేక కీడు చేస్తుందా..? అనే ఆందోళనలో ఉన్నారు. అక్రమ దందాపై నిగ్గు తేల్చాల్సిన పోలీసు, వ్యవసాయ శాఖలు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ ర్యాకెట్‌ జిల్లా వ్యాప్తంగా విస్తరించగా.. ఓ ట్రాన్స్‌ పోర్టర్‌ను మరో డీలర్‌ను రిమాండ్‌ చేసి చేతులు దులుపుకొన్నారు. టన్నుల కొద్ది నకిలీ డీఏపీని రైతులకు అంటగట్టి లక్షలు కొల్లగొట్టారు. అన్నదాతలకు అపార నష్టం కలిగించిన ఈ దందాను పోలీసులు సాధారణ కేసులా వ్యవహరించటం అనుమానాలకు తావిస్తోంది. నామమాత్రపు విచారణతో సరిపెడుతున్నారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి శాంపిళ్లు ల్యాబ్‌కు పంపి చేతులు దులుపుకున్నారు. అక్రమార్కులు రైతుల అవసరం, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకున్నారు.

కేసు విచారణలో వైఫల్యం

పెద్ద మొత్తంలో నకిలీ డీఏపీ పట్టుబడుతోంది. అయితే ఎక్కడ తయారు చేశారు..? ఇందుకు ఉపయోగించిన ఫార్ములా ఏమిటి?.. సాంకేతికత అందించింది ఎవరు. ? అంత పెద్ద మొత్తంలో ఆర్థిక వనరులు ఎవరు సమకూర్చారు..? వారి వెనుకు ఉన్నది ఎవరు ?.. కంపెనీ ఎక్కడ ఏర్పాటు చేశారు..? అనే విషయాలు బయటికి రాకపో వడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు విచారణ సజావుగా సాగడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం కొందరిని అరెస్టు చేసి చేతులు దులుపుకోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మొత్తం వ్యహారం బయటికి వస్తుందని బాధిత రైతులు అంటున్నారు. నకిలీ దందాను సీసీఎస్‌ లేదా ఇతర దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తే మూలాలు బయటపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలనే డిమాండ్‌ పెరుగుతోంది.

పదిహేను రోజులుగా నకిలీ డీఏపీ భాగోతం జిల్లా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. తరచూ ఎక్కడో ఓ చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పరిగి, చన్గోముల్‌, బంట్వారం, యాలాల్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రవాణా చేసిన వారిని, విక్రయించిన డీలర్లపై కేసులతో సరి పెట్టారనే విమర్శలు ఉన్నాయి. పరిగి మండలం బపసిరెడ్డిపల్లి, లఖ్నాపూర్‌, రంగాపూర్‌, చిగురాల్‌పల్లి, పూడూరు మండలం మంచన్‌పల్లి, పెద్దేముల్‌ తదితర చోట్ల ఈ వ్యవహారం బయట పడింది. పదుల సంఖ్యలో నకిలీ డీఏపీ బస్తాలు బయటపడుతుండటం దాందా ఏ తరహాలో జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. రాజకీయ ఒత్తిడులు, అమ్యామ్యాలకు తలొగ్గి కొందరిని రిమాండ్‌ చేయకుండా తప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement