మండలంలోని ప్రధాన రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాక టెండర్లు కాలేదు. ఉన్నతాధికారులతో చర్చించి రోడ్లు పనులు ప్రారంభమయ్యేలా చూస్తాం. ఆర్కతల చౌరాస్తా నుంచి చిట్టిగిద్ద రైల్వేస్టేషన్ వరకు బీటీ రోడ్డు కోసం రూ.70 లక్షలు, ఎల్లకొండ నుంచి లింగంపల్లి మీదగా పులమామిడి వరకు రూ.3.80 కోట్లు, నారేగడ నుంచి కౌకుంట్ల గేట్ వరకు రూ.3 కోట్లు, చిట్టిగిద్ద – పెండ్లీ మడుగు వరకు రూ.3 కోట్లు, ఎల్లకొండ గేట్ నుంచి పూలపల్లి గేట్ వరకు రూ.7 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చూస్తాం.
– కాలె యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల
నవాబుపేట: మండల కేంద్రంలోని బీటీ రోడ్లు దారుణంగా తయారయ్యాయి. మరమ్మతులకు నిధులు మంజూరైనా కాంట్రాక్టర్లు ముందకు రావడం లేదు. చాలా కాలంగా రోడ్లు దెబ్బతినడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. లింగంపల్లి – పులుమామిడి బీటీ రోడ్డు దారుణంగా మారింది. ఈ మార్గంలో పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. ఆర్కతల చౌరస్తా నుంచి చిట్టిగిద్ద మీదగా రైల్వేస్టేషన్ వరకు ఉన్న మూడు కిలోమీటర్ల బీటీ గుంతల మయంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వేలమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది. గొల్లగూడ రైల్వేస్షేషన్‌కు సైతం మండలంలోని చాలా గ్రామాల ప్రజలను వస్తుంటారు. ఈ రోడ్డు పూర్తిగా పాడైంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లకొండ నుంచి గొల్లగూడ, గంగ్యాడ నారేగూడ, పూలపల్లి వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు, నారెగూడ – కౌకుంట్ల గేట్ రోడ్లు అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు మరింత దెబ్బతిన్నాయి.
అధ్వానంగా గ్రామీణ రోడ్లు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రజలు
పట్టించుకోని అఽఽధికారులు


