తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేది వరకు నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులను సోమవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్.వెంకయ్యచౌదరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుష్కరిణిలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పుష్కరిణి లోతు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఈ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్, ఈఈలు సుధాకర్, శ్రీనివాసరావు, డీఈ చంద్రశేఖర్, వీజీవో సురేంద్ర పాల్గొన్నారు.


