
నాగేశ్వరి (ఫైల్), విజయ్ (ఫైల్)
ఖమ్మం: వేర్వేరు గ్రామాలకు చెందిన డిగ్రీ విద్యార్థులు ఇద్దరు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లాడ మండలం మంగాపురానికి చెందిన కుంచం నాగేశ్వరి(18) ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అలాగే, నారాయణపురం గ్రామానికి చెందిన సంగసాని విజయ్(18) సైతం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వీరిలో నాగేశ్వరి రెడ్డిగూడెంలోని క్రీస్తుజ్యోతి డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరంలో చేరి అక్కడి నుంచి వైరాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు మారింది. ఇక విజయ్ క్రీస్తుజ్యోతి డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సమీప గ్రామాలకు చెందిన వీరిద్దరు తొలుత ఒకే కళాశాలలో చేరగా.. ఒకేరోజు ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తుండగా, రెండు గ్రామాల్లో విషాదాన్ని నింపింది. కాగా, ఘటనలపై తమకు ఫిర్యాదు అందలేదని తల్లాడ ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com