
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగం నుంచి రిటైరయ్యాక కూడా పలు హోదాల్లో కొనసాగుతున్న అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వారి గురించి ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో వారికి వివిధ శాఖల్లో కొనసాగింపు ఉంటుందా? లేదా? అనే సస్పెన్స్ మొదలైంది.
వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం రిటైరయ్యాక కూడా పలు హోదాల్లో కొనసాగుతున్న అధికారులపై ఆరా తీస్తోంది. ఈ మేరకు రేపు(బుధవారం) సాయంత్రం ఐదు గంటలలోపు వారి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో ఉన్న వారి కొనసాగింపు ఉంటుందా? ఉండదా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్రస్తుతం కొత్త సర్కార్ ఫోకస్‌లో ఐదుగురు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఐదుగురు అధికారులు వీరే..
► MCRHRDITలో సలహాదారుగా ఉన్న రిటైర్డ్ IFS తిరుపతయ్య
► ఆర్కియాలజీలో బుద్ధభవన్ ప్రాజెక్ట్ చూస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ శివనాగిరెడ్డి
► ప్రోటోకాల్ అధికారిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అరవింద సింగ్
► ఎండోమెంట్స్‌లో ఉన్న రిటైర్డ్ అధికారి అనిల్ కుమార్
► రెండేళ్ల ఎక్స్ టెన్షన్‌తో పనిచేస్తున్న ఐఏఎస్ రాణి కుముదిని.