హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి లేఖ రాశారు. వరంగల్ కోట భూములు, అక్రమ కట్టడాలపై సీఎంకు లేఖ రాశారు కిషన్‌రెడ్డి. కోట భూముల్లో ఆక్రమణలు గుర్తించి తొలగించాలని విన్నవించారు. అక్రమ కట్టడాలను తొలగించి ఆ భూములను పురావస్తు శాఖ (ASI )కి అప్పగించాలన్నారు. వారసత్వ సంపద ను కాపాడటంలో పురావస్తు శాఖకు సహకరించాలని బహిరంగ లేఖ ద్వారా సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు కిషన్‌రెడ్డి.


