భారత్‌ అండర్‌–19 క్రికెట్‌ జట్టులో నల్గొండ కుర్రాడు.. | Telangana Player Yashveer Goud Selected For The India Under-19 Cricket Team | Sakshi
Sakshi News home page

భారత్‌ అండర్‌–19 క్రికెట్‌ జట్టులో నల్గొండ కుర్రాడు..

Jun 12 2026 1:03 PM | Updated on Jun 12 2026 1:07 PM

Telangana Player Yashveer Goud Selected For The India Under-19 Cricket Team

రాజాపేట యువకుడు యష్‌వీర్‌గౌడ్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్న కుర్రాడు

బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న యష్‌వీర్‌గౌడ్‌

యాదగిరిగుట్ట: భారత్‌ అండర్‌ –19 క్రికెట్‌ జట్టుకు రాజాపేట మండల కేంద్రానికి చెందిన యువకుడు ఉట్కూరి యష్‌వీర్‌గౌడ్‌ ఎంపికయ్యాడు. జూలై 1వ తేదీ నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్‌డేల సిరీస్‌కు భారత్‌ అండర్‌ 19 క్రికెట్‌ టీమ్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టులో యష్‌వీర్‌గౌడ్‌ ఉన్నాడు.

యష్‌వీర్‌గౌడ్‌ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి అంబర్‌పేట్‌లో ఉంటున్నాడు. రెండేళ్లుగా అండర్‌ –19 హైదరాబాద్‌ టీమ్‌లో ఆయన ఆడుతున్నాడు. ఇటీవల కాలంలో బెంగళూర్‌లో బీసీసీఐ ఇచ్చిన శిక్షణలో పాల్గొని ఆకర్షించాడు. దీంతో బీసీసీఐ యష్‌వీర్‌గౌడ్‌ను శ్రీలంకతో జరిగే మూడు వన్‌డేల సిరీస్‌కు బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేసింది.

మరో రెండు రోజుల్లో భారత్‌ అండర్‌–19 జట్టుతో కలిసి బెంగళూర్‌ నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నట్లు ఆయన తల్లిదండ్రులు ఉట్కూరి రాజ్‌కుమార్, వాణి, బాబాయ్‌ దీపక్‌కుమార్‌ గురువారం సాక్షికి తెలిపారు. భారత్‌ అండర్‌–19 జట్టుకు యష్‌వీర్‌ గౌడ్‌ ఎంపిక కావడం రాజాపేటకే కాదు, తెలంగాణకే గర్వకారణమని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement