ఆస్పత్రికి తీసుకెళ్తూ.. అమ్మను రోడ్డుపైనే వదిలేశాడు | Sons Left Their Mother on Road | Sakshi
Sakshi News home page

ఆస్పత్రికి తీసుకెళ్తూ.. అమ్మను రోడ్డుపైనే వదిలేశాడు

Jul 30 2024 7:53 AM | Updated on Jul 30 2024 1:34 PM

Sons Left Their Mother on Road

ఆకలితో అలమటించి కన్నుమూత

ఓ కొడుకు అమానుషం   

కంటోన్మెంట్‌: అనారోగ్యానికి గురైన అమ్మను ఓ కొడుకు ఆస్పత్రికి తీసుకెళ్తూ మార్గమధ్యంలో నడిరోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయాడు. కొడుకు కోసం రెండురోజులు ఎదురుచూసింది. ఆకలితో అలమటించింది. చివరికి ఆ తల్లి గుండె పగిలి కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. 

ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ రెడ్డి వెల్లడించిన వివరాలు... ఈ నెల 5న మేడ్చల్‌ నివాసి అయిన అరవింద్‌ అనారోగ్యంతో ఉన్న తల్లి శ్యామల(60)ను తీసుకొని ఆసుపత్రికని బయలుదేరాడు. బోయిన్‌పల్లి చెక్‌పోస్ట్‌ సమీపంలోని ఎంఎంఆర్‌ గార్డెన్‌ వద్ద ఆమెను ఫుట్‌పాత్‌పైనే వదిలి ఎటో వెళ్లిపోయాడు. రెండు రోజులైనా తిరిగి రాలేదు. ఆకలితో అలమటించిన తల్లి అనారోగ్యంతో çస్పృహ తప్పి పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు బోయిన్‌పల్లి పోలీసులు వచ్చి 108 అంబులెన్స్‌ సహాయంతో శ్యామలను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 మూడురోజుల క్రితం కోలుకున్న శ్యామల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. కుమారుడిని చూడాలని శ్యామల కోరడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం చికిత్స పొందుతూ శ్యామల మృతి చెందింది. ఆమె కొడుకు అరవింద్‌ కోసం మేడ్చల్‌లో ఆరా తీసిన ఆచూకీ దొరకలేదు. దీంతో కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, ఎవరైనా తెలిసినవారు ఉంటే బోయిన్‌పల్లి పోలీసులను సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement