ముద్రగడ పద్మనాభంకు సజ్జల పరామర్శ | Sajjala Consoles Hospitalised Mudragada Padmanabham | Sakshi
Sakshi News home page

ముద్రగడ పద్మనాభంకు సజ్జల పరామర్శ

Jun 25 2026 8:23 PM | Updated on Jun 25 2026 8:30 PM

Sajjala Consoles Hospitalised Mudragada Padmanabham

హైదరాబాద్‌ : గత కొం‍తకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఆసుపత్రిలో చికిత్స పొం‍దుతున్న ముద్రగడను  సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. 

ముద్రగడ ఆరోగ్యం గురించి ఆరా తీశారు సజ్జల. అదే సమయంలో డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు రామకృష్ణారెడ్డి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే ముద్రగడ కోలుకుని ప్రజా జీవితంలోకి వస్తారని ఆకాంక్షించారు. 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement