బుడ్డోడి స‌ర‌దా.. లగ్జరీ కారు గోవిందా! | Rajendranagar police booked Tolichowki businessman for son driving | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌పై లగ్జరీ కారు నడిపిన బాలుడు

Jun 19 2026 4:52 PM | Updated on Jun 19 2026 4:54 PM

Rajendranagar police booked Tolichowki businessman for son driving

వాహనంతో యజమాని, ట్రాఫిక్‌ పోలీసులు

వీడియో తీసిన మరో వాహనదారు

తండ్రిపై కేసు.. కారు జప్తు

హైద‌రాబాద్‌: కేవలం నాలుగు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే లగ్జరీ కారు అది. దానిని ఐదవ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల బాలుడు ఓఆర్‌ఆర్‌ పై నడుపుతూ దూసుకెళ్లాడు. విచిత్రమేమంటే తండ్రి బాలుడి పక్కనే కూర్చున్నాడు. ఈ దృశ్యాన్ని అటుగా వెళుతున్న మరో వాహనదారుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌ ను రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రాజు చూసి సీసీ కెమెరాల ఆధారంగా కారు యజమానిని గుర్తించారు.

కారు టోలీచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్‌ హాదీది అని నిర్ధారించారు. అతను  ఎంజీ సైబర్‌ స్టార్‌ లగ్జరీ కారును ఇటీవల కొనుగోలు చేశాడు. ఈనెల 11న తన 11 ఏళ్ల కుమారుడితో కారులో వచ్చాడు. కారు కుమారుడికి చేతికిచ్చి ఔటర్‌పై శంషాబాద్‌ వైపు వెళ్ళాడు. చివరకు వాహనాన్ని జప్తు చేశారని  రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రాజు. రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

చ‌ద‌వండి: అయ్యో శ్వేతా.. ఆదుకునేవారే లేరా?

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement