వెడ్డింగ్స్‌.. డెస్టినేషన్‌ | Photoshoots in Taramati and weddings in Ranimahal | Sakshi
Sakshi News home page

వెడ్డింగ్స్‌.. డెస్టినేషన్‌

Published Sun, Jun 23 2024 6:03 AM | Last Updated on Sun, Jun 23 2024 6:03 AM

Photoshoots in Taramati and weddings in Ranimahal

తారామతిలో ఫొటోషూట్స్‌... రాణిమహల్‌లో పెళ్లిళ్లు

అనంతగిరిహిల్స్‌కూ పెళ్లిళ్ల తాకిడి  

లక్నవరం, సోమశిలనూ వేదికలుగా తీర్చిదిద్దనున్న పర్యాటక శాఖ

ఆసక్తి చూపుతున్న అంతర్జాతీయ వెడ్డింగ్‌ ప్లానర్స్‌ 

పెళ్లి..చిరకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఘనంగా పెళ్లిళ్లు చేయడం దక్షిణాది ప్రత్యేకత. అయితే కొన్నేళ్లుగా డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. మొదట్లో సెలబ్రెటీలు, దిగ్గజ వ్యాపారవేత్తలు మాత్రమే డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు విదేశాలకు వెళ్లేవారు. అనంతర కాలంలో ఆ ఖర్చును భరించగలిగే ఆర్థికస్తోమత ఉన్నవారు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. విదేశాల్లోనే కాకుండా భారత్‌లోని జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, జైసల్మీర్, ముస్సోరీ, గోవా వంటి ప్రదేశాలు డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు వేదికలుగా ఆదరణ పొందాయి.

కొంతకాలంగా నగరంలోని పలు ప్రాంతాలు వీటికి కేంద్రాలుగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటకశాఖ నగరంతోపాటు, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ కోసం అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ఈ వేదికల్లో వేడుకలు ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కూడా ఆసక్తి చూపుతున్నారు. కొన్ని రోజుల క్రితం నగరం వేదికగా జరిగిన అంతర్జాతీయ వెడ్డింగ్‌ ప్లానర్స్‌ సమ్మేళనంలో ఆ దిశగా దృష్టి సారించారు. ..: సాక్షి, హైదరాబాద్‌ :.. డెస్టినేషన్‌వెడ్డింగ్‌ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు..ఖర్చెంత?

సాక్షి, హైదరాబాద్‌
వారసత్వ సంపదతోపాటు అద్భుత కట్టడాలకు కేంద్రం హైదరాబాద్‌ నగరం.ఇక్కడి చారిత్రాత్మక కట్టడం తారామతి బారాదరి వెడ్డింగ్‌ డెస్టినేషన్‌కు అడ్డాగా మారింది. ఎత్తయిన కొండపైన ఆనాటి రాజసం నింపుకున్న నిర్మాణ శైలి, వందలమంది ఒకేసారి కూర్చొని పెళ్లి వైభవం ఆస్వాదించే అవకాశం ఉండడంతో ఇక్కడ వేడుక చేసుకోవడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. తారామతిలో ఐదు గంటల ఫొటో షూట్‌కు ఉదయం అయితే   రూ.8000, సాయంత్రం నుంచి అయితే రూ. 10 వేలు చార్జ్‌ చేస్తున్నారు.

పెళ్లిళ్లు, రిసెప్షన్‌ లేదా ఇతర ఫంక్షన్లకు ఓపెన్‌ ఏరియా అయితే రూ.70 వేలు, ఇండోర్‌ బాంకెట్‌ హాల్‌ అయితే లక్ష రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఫుడ్‌ కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ ఇక్కడ ఫుడ్‌ కాకుండా బయట నుంచి తెప్పించుకోవాలనుకునేవారు అదనంగా రూ.11 వేలు చెల్లించాలి. నిర్వాహకులే స్వయంగా ఫుడ్‌ ఏర్పాటు చేసుకోవాలంటే...అదనంగా రూ.15 వేలు చెల్లించాలి. వేదిక, వసతుల అద్దె సాధారణంగానే ఉన్నా, ఆకర్షణీయమైన అలంకరణ, ఖరీదైన వంటకాలకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ పెళ్లిళ్లకు కనీసం పాతిక లక్షల పైనే ఖర్చు పెడుతున్నారు.

తారామతి బారాదరి, ఫలక్‌నుమా ప్యాలెస్‌..
నగరంలోని ‘ఫలక్‌నుమా ప్యాలెస్‌’ కూడా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయితో ఖ్యాతి గడించిన విలాసవంతమైన వేదిక. గతంలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ తన సోదరి వివాహం ఇక్కడే జరిపించిన విష యం తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్‌ స్టార్స్‌తోపాటు పలువురు వ్యాపారవేత్తలు వచ్చారు. మరెందరో ప్రముఖులు కూడా ఈ వేదికను వినియోగించుకున్నారు.

అనంతగిరి హిల్స్‌..
⇒ అటు అనంతగిరిహిల్స్‌ వేది కగా కూడా వివాహాల సంఖ్య పెరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపించి వందల మంది వేడు కల్లో పాల్గొనేలా సౌకర్యాలు అభివృద్ధి చేయడంతో పెళ్లిళ్లు, వెడ్డింగ్‌ షూట్లకు ఇక్కడ ఆదరణ పెరిగింది. ఇక్కడి ప్రకృతి పారవశ్యం నూతన జంటలకు ఆకర్షిస్తోంది. ఈ పరిసర ప్రాంతాల్లోనే పలు వెడ్డింగ్‌ షూట్‌ సెట్టింగ్‌ రిసా ర్టులూ వెలిశాయి. ఇక్కడ డెస్టినే షన్‌ వెడ్డింగ్‌లకు సాధార ణంగా 5 లక్షల పైనే ఖర్చు అవుతుందని అంచనా. అయితే, వీటిల్లో వెడ్డింగ్‌ ప్లానర్ల ఖర్చులే అత్యధికంగా ఉంటాయి. తమ అభిరుచికి తగ్గ ట్టుగా కేవలం సెట్టింగ్‌లకు లక్షల్లో ఖర్చు చేసేవారూ ఉన్నారు. కొందరైతే సెట్టింగ్‌లకే  కోటి రూపా యల దాకా ఖర్చు చేస్తున్నారని వెడ్డింగ్‌ ప్లానర్స్‌ చెబుతున్నారు.

ఫ్యూచర్‌ ప్లాన్‌.. లక్నవరం  
వరంగల్‌కు సమీపంలోని  లక్న వరం సరస్సు కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు మరో ఫేవరెట్‌ స్పాట్‌ కానుంది. ఇక్కడ 17 నుంచి 20 దాకా ఐల్యాండ్‌లు ఉన్నాయని, వాటిని కూడా ఈ దిశగా అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉందని టూరిజం శాఖ ప్రతినిధి తెలిపారు. లక్నవరంలోని కాటేజె స్‌తో పాటు దీనికి దగ్గరలోనే వరంగల్‌ టూరిజం హోటళ్లు, రిసార్ట్‌లు ఉన్నాయి. తీసుకునే కాటేజీల సంఖ్య, అవసరానికి అనుగుణంగా సమీపంలోనే హరిత హోట ళ్లలో ఏర్పాటు చేసే  సౌకర్యా లను బట్టి  రూ. 3–5 లక్షల వరకు ఖర్చు అవుతుందని పర్యా టక అధికారులు చెబుతు న్నారు. వినూత్నమైన సెట్టింగులు, పూల అలంకరణలు, భోజన ఏర్పాట్లు ఇలా అన్నీ.. చేసే స్థాయిని బట్టి ఖర్చులో హెచ్చుతగ్గులు ఉంటాయి.  

సోమశిల..
ప్రముఖ పర్యాటక ప్రదేశం సోమశిలలో జరి గిన డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కూడా అందరినీ ఆక ర్షించింది. ఇక్కడి డ్రోన్‌ షాట్‌లు ప్రకృతి పారవశ్యాన్ని చిత్రీ కరించిన విధానం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే నాగార్జునసాగర్‌వంటి పలు పర్యాటక ప్రదే శాలు ఇలాంటి వినూత్న వివాహాల వేడుకలకు అద్భు త వేదికలుగా అవతరిస్తు న్నాయి. కాగా,  ప్రస్తు తం కొద్ది మందికి మాత్రమే ఇలాంటి సౌక ర్యాలు అందు బాటులో ఉన్నా, వీటికున్న ఆదరణ దృష్ట్యా మరింత అభివృద్ధి చేస్తూ విదేశాలకు చెందిన వారిని సైతం డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌కు మన వైపు ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తున్నామని రాష్ట్ర పర్యా టక శాఖ అధికారులు చెప్పారు.

వెలుగులోకి మరిన్ని డెస్టినేషన్‌ వేదికలు
మన సంస్కృతీ సంప్ర దాయాలకు గౌరవిస్తూనే.. ఘనమైన చరిత్ర కలిగిన తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు మంచి వేదికలుగా వాడుకుంటున్నారు. ఈ మార్పు పర్యాటక ప్రాంతాలకు ఆదరణ పెంచడంతోపాటు వారి పెళ్లిని చిరకాల మధుర జ్ఞా్ఞపకంగా నిలుపుతుంది. ఈ ఆనవాయితీ ఇలానే కొనసాగితే మరి కొనేళ్లలో మరో పది వరకు డెస్టినేషన్‌ వేదికలు వెలుగులోకి వస్తాయి. అంతటి విశిష్టత కలిగిన కోటలు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు, జలపాతాలు, చారిత్రక కట్టడాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్‌ నగరానికి సమీపంగా ఉండటంతో అంతర్జాతీయ వెడ్డింగ్‌ ప్లానర్లను సైతం ఆకర్షిస్తున్నాయి  – అరవింద్, పర్యాటక నిపుణుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement