గాంధీ ఆసుపత్రిలో మహిళా జూనియర్‌ డాక్టర్‌పై దాడి | Patient Helper Attack On Junior Doctor At Gandhi Hospital | Sakshi
Sakshi News home page

గాంధీ ఆసుపత్రిలో మహిళా జూనియర్‌ డాక్టర్‌పై దాడి

Sep 11 2024 7:44 PM | Updated on Sep 11 2024 8:51 PM

Patient Helper Attack On Junior Doctor At Gandhi Hospital

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌పై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో విధి నిర్వహణలో ఉన్న సమయంలో మహిళా జూనియర్‌ డాక్టర్‌పై రోగి బంధువుల్లో ఒకరు దాడికి పాల్పడ్డాడు. వైద్యురాలి అప్రాన్‌ లాగి దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అతడి బారి నుంచి ఇతర సిబ్బంది.. వైద్యురాలిని కాపాడారు.

డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అయితే రోగి బంధవులు దాడికి పాల్పడటానికి గల  కారణాలు తెలియాల్సి ఉంది.
చదవండి: RG Kar Case: చర్చల లైవ్‌ టెలికాస్ట్‌ డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement