మావోయిస్ట్‌ కరపత్రాల కలకలం.. వాటిలో ఏం రాసుందో తెలిస్తే షాక్‌..! | Pamphlets Printed In The Name Of Maoist Party | Sakshi
Sakshi News home page

మావోయిస్ట్‌ కరపత్రాల కలకలం.. వాటిలో ఏం రాసుందో తెలిస్తే షాక్‌..!

Published Sun, Nov 5 2023 8:28 AM | Last Updated on Sun, Nov 5 2023 8:28 AM

Pamphlets Printed In The Name Of Maoist Party - Sakshi

సాక్షి, వరంగల్‌\మహబూబబాద్‌: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం మావోయిస్ట్‌ పార్టీ పేరుతో ముద్రించిన కరపత్రాలు కలకలం రేపాయి. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని ముద్రించిన కరపత్రాలు మండలకేంద్రంలోని దుకాణాల ఎదురుగా, పొగుళ్లపల్లి, సాదిరెడ్డిపల్లి గ్రామాల్లో రోడ్డుపై వేసి వాటిమీద రాళ్లు ఉంచారు. మతతత్వ బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను తరిమి కొట్టాలని కరపత్రాల్లో పేర్కొన్నారు.

మావోయిస్ట్‌ అగ్ర నాయకుడు యాప నారాయణ అలియాస్‌ హరిభూషన్‌ మృతిచెందడం, ఆయన భార్య సమ్మక్క జన జీవన స్రవంతిలో కలవడంతో కొత్తగూడ, గంగారం మండలాల్లో మావోయిస్ట్‌ పార్టీతో సంబంధాలు ఉండవని భావించారు. ఏకంగా మండలకేంద్రంలో కరపత్రాలు తమ ఉనికిని చాటుకున్నారని చర్చ సాగుతోంది. కరపత్రాల నేపథ్యంతో అప్రమత్తమైన పోలీసులు కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మండలంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఇవి చదవండి: సీఎం కేసీఆర్‌ మలి విడత ప్రచార షెడ్యూల్‌.. ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement