గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: జైవీర్‌రెడ్డి

Kunduru Jana Reddy In Election campaign in nidamanoor - Sakshi

నిడమనూరు: తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని నాగార్జునసాగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జైవీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాన్‌ఆయకట్టు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని ఊట్కూర్‌లో ఉదయం మొదలైన ప్రచారం రాత్రి వెంగన్నగూడెంలో ముగిసింది.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ముప్పారం, ఊట్కూర్, బంటువారిగూడెం, ఎర్రబెల్లి గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గర్భిణులు డెలవరీ కోసం వాహనాల్లో వెళ్తే ఈ రోడ్లపైనే పరుడు అవుతుందనే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

నందికొండవారిగూడెంలో గోవు పిచ్చమ్మ అనే వృద్ధురాలు జైవీర్‌రెడ్డి ప్రచారం రథం వద్దకు వచ్చి జానారెడ్డి కొడుకు ఏడయ్యా అంటూ అడిగింది. అక్కడ ఉన్న వారు ఆమెను తీసుకెళ్లి జానారెడ్డి కొడుకు జైవీర్‌రెడ్డి అంటూ చూపించారు. తనను వెతుకుంటూ వచ్చిన వృద్ధురాలిని ఆయన ఆప్యాయంగా పలకరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, రంగశాయిరెడ్డి, రఘువీర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్లయ్య, మాజీ ఎంపీపీ వెంకటరమణ, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ వెంకటరెడ్డి, మండల పార్టీ అద్యక్షుడు సత్యం, శివమారయ్య, పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే పేదలు, రైతులకు మేలు 
పెద్దవూర : కాంగ్రెస్‌ పార్టీతో నిరుపేదలకు, రైతులకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని జయరాంతండాకు చెందిన బీజేపీ ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు రమావత్‌ దేవ్‌సింగ్‌తో పాటు పలువురు మాజీ మంత్రి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.  పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలను కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ లింగారెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్, శ్రీనునాయక్, సోమ్లా, భీమా పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top