నేటి నుంచి కోటి దీపోత్సవం | Koti Deepotsavam 2024 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కోటి దీపోత్సవం

Nov 9 2024 11:41 AM | Updated on Nov 9 2024 11:41 AM

Koti Deepotsavam 2024

లక్డీకాపూల్‌: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తి టీవీ ఆధ్వర్యంలో శనివారం నుంచి కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే ఈ దీపోత్సవం ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో భాగంగా ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, దేశంలోని పలువురు ముఖ్యులు పాల్గొంటారు.

ప్రతిరోజు భక్తులు స్వయంగా విశేష పూజలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము లేదని, ఎవరైనా రావచ్చని రచన టెలివిజన్‌ సంస్థ డైరెక్టర్‌ రఘు ఏలూరి తెలిపారు. దీపారాధన నిమిత్తం వత్తులు, నూనె, ప్రమిదలు వంటి పూజాద్రవ్యాలతో పాటూ ప్రసాదాలను కూడా ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. కుటుంబ సమేతంగా కోటి దీపోత్సవంలో పాల్గొనాలని ఆయన కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement