
జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జిటో) ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హెచ్‌ఐసీసీ హైటెక్స్‌లో జిటో కనెక్ట్–2025 ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు జీటో కనెక్ట్ చైర్మన్ రోహిత్ కొఠారి వెల్లడించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తాజ్ దక్కన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జీటో కమిటీ సభ్యులతో కలిసి కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ది పవర్ ఆఫ్ వన్ అనే థీమ్‌తో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌లో పలువురు వ్యాపారవేత్తలతో పాటు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ ప్రముఖులు, ఆర్ధిక నిపుణులు, సినీ క్రీడా రంగ ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు.
ఈ జీటో కనెక్ట్ ప్రారంభోత్సవానికి కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు స్మతి ఇరాని, యోగా గురువు రాందేవ్ బాబా, ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్, క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, టెక్ దిగ్గజం జోహా స్థాపకుడు శ్రీధర్ వెంబు కూడా హజారవుతారని వెల్లడించారు. ఈ మహాసభలో 600లకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని సుమారు 2 లక్షల మందికి పైగా సందర్శకులు పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరి లలిత్ చొప్రా, కన్వీనర్ బిఎల్ భండారి, కో–కన్వీనర్ సుశీల్ సాంచెట్, డైరెక్టర్ గౌతమ్, ట్రెజరర్ విశాల్ తదితరులు పాల్గొన్నారు.