Hitex
-
వైభవంగా హైదరాబాద్ హైటెక్స్ లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్..
-
పరాభవ నామ సంవత్సరం పసందుగా అవార్డుల ప్రదానోత్సవం
తెలుగువారి సంవత్సరాది ఉగాది సినీ ప్రేమికులకు కొత్త హుషారునిచ్చింది... అవార్డులు అందుకున్న వేళ తారల మనసులు మురిసిన వేళ... అభిమానులకు ఆనంద హేల... గురువారం ఉగాది పర్వదినాన హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో నాటి తారలు సావిత్రి, శ్రీదేవి, సౌందర్యలకు నివాళిగా నేటి తార నిధీ అగర్వాల్ చేసిన డ్యాన్స్ ఓ హైలైట్... వేదికపై దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్... లవ్ సాంగ్స్ నుంచి మాస్ సాంగ్స్ వరకూ శ్రేయా ఘోషల్ పాడిన పాటలు... సింగర్ మంగ్లీ పాడిన పాటలు... ఇలా వీనుల విందుగా, తారల తళుకులతో కనువిందుగా జరిగింది ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక. ఆ విశేషాలు...అవార్డుల విషయంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉందితెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’కి మూలం అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారికి, మంత్రి జూపల్లిగారికి, అలాగే కమల్‌హాసన్ గారికి, నాగార్జునగారికి, జయసుధగారికి, నాగచైతన్య, రష్మికా మందన్నాతో పాటు ఇతర అవార్డుగ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు చెబుతున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. ఈ మాటల ఆదర్శంతో ఆగిపోయిన ఈ అవార్డుల పంపిణీకి పునరుజ్జీవం పోసిన రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్‌కి తెలంగాణ ప్రభుత్వం సినిమా వారిని ఆహ్వానించి, సినిమా అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడం, సినిమాకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతకి థ్యాంక్స్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వేవ్స్’ కార్యక్రమంలో నన్ను, కమల్‌హాసన్ వంటి వాళ్లని భాగస్వామ్యం చేయడం సంతోషం. సినిమానే కదా అనే చిన్నచూపు చూడకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవచ్చు. హాలీవుడ్ సినిమా అంటే అమెరికా గుర్తొస్తుంది. ఈరోజు ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్–తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్యోద్దేశంతో రేవంత్ రెడ్డిగారు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీవైపు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల, వాళ్లని ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజలో ఉందనుకుంటున్నాను కాబట్టి సినిమా వాళ్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు తెలంగాణ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని, మరింత ప్రోత్సహిస్తే కనుక ఎంతో మంది యంగ్‌స్టర్స్ మరిన్ని సినిమాలు చేస్తారు. రాష్ట్రానికి సినిమా రెవెన్యూ కూడా సమకూరుతుంది. సీనియర్స్‌కి గౌరవం ఇచ్చే విధంగా, యంగ్‌స్టర్స్‌కి స్ఫూర్తినిచ్చేలా ఈ అవార్డుల ఎంపిక జరిగింది. ఇందుకు జ్యూరీకి అభినందనలు.– చిరంజీవి (ఎన్టీఆర్ జాతీయ అవార్డుగ్రహీత)హద్దులు చెరిపేసినందుకు ధన్యవాదాలుమై ఫ్రెండ్ చిరంజీవిగారు... బ్రదర్ నాగార్జునగారు. నా ఫ్యామిలీ... చెన్నైలో ఎవరైతే ఉంటారో... వారందరూ ఇక్కడ ఉన్నారు. 16 సంవత్సరాల వయసులో తొలిసారి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా హైదరాబాద్‌కు వచ్చాను ఏయన్నార్‌గారి ‘శ్రీమంతుడు’ సినిమా కోసం. అందుకే నా ‘దశావతారం’ సినిమాలో ‘ఎంతో చిన్నది జీవితం’ అనే పాట వినిపిస్తుంది. అలా అప్పట్నుంచి నేను హైదరాబాద్‌లో పని చేస్తున్నాను. కొంత సమయం కిందట నేను సింగీతంగారి అవార్డు అందుకున్నాను. అప్పుడు ఆయనతో నేను చేసిన తొలి సినిమా ‘సొమ్ము ఒకడిది... సోకు ఒకడిది’ గుర్తొచ్చింది. పని మొత్తం ఆయన చేశారు. అవార్డు నేను అందుకున్నాను. సింగీతంగారితో నేను 50 సంవత్సరాలుగా కలిసి పని చేస్తున్నాను. మా నాన్నగారి పేరు శ్రీనివాసన్ కనుక... సింగీతం శ్రీనివాసరావుగారంటే నాకు ఇష్టం అని కాదు. నా సినిమా కెరీర్లో నేను కలిసిన యంగస్ట్ సీనియర్ ఆయన. సింగీతంగారికి అవార్డును అందించినందుకు ధన్యవాదాలు సార్ (ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ...). నా బ్రదర్... చిరంజీవిగారు. సినిమాల్లో నా జూనియర్. పాలిటిక్స్‌లో సీనియర్. 1970లో మేం లీడ్ రోల్స్ చేశాం. ఇప్పుడు 70స్లోనే ఉన్నాం. నీ మనసు గురించి కాదు... నీ వయసు గురించి (నవ్వుతూ). గద్దర్‌గారి లక్షల అభిమానుల్లో నేను ఒకడిని. రచయిత, విప్లవకారులు అయిన గద్దర్‌గారి పేరిట అవార్డు ఇస్తున్నందుకు ధన్యవాదాలు సార్. ఆయన అభిమానులుగా మేం థ్యాంక్స్ చెబుతున్నాం. ఇక నో మోర్ కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్.. ఒకే ఒక సినిమా... ఇండియన్ సినిమా. ఆ హద్దులను మీరు చెరిపేశారు (టీజీఎఫ్ అవార్డుల్లో తెలంగాణ ప్రభుత్వం కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్‌ని అవార్డుగ్రహీతలుగా, ప్రదానం చేసేవారుగా భాగం చేయడం). భవిష్యత్ తరాల కోసం మేం కూడా సపోర్ట్‌గా ఉంటాం. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. – కమల్‌హాసన్ (పైడి జయరాజ్ అవార్డుగ్రహీత)ఏపీలో తెలుగు చిత్రపరిశ్రమ ఉనికిని గుర్తించాలినంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు అని గత 13 ఏళ్లుగా ఇండస్ట్రీ ఎదురు చూస్తున్నా ఇవ్వలేదు. అలాంటిది హీరో కృష్ణగారి అభిమాని రేవంత్ రెడ్డిగారు గద్దర్ అవార్డులు మేము ఇస్తాం అని చెప్పి, 2025లో ప్రారంభించి అమోఘంగా ప్రదానం చేశారు. ఇప్పుడు కూడా ఆ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. తెలుగు సినిమా ఉనికిని గుర్తించి, గౌరవించి ఇంతమంది కళాకారులను సగర్వంగా గౌరవిస్తున్నందుకు ఆయనకు సెల్యూట్. గొప్ప ప్రజా వాగ్గేయకారుడు అయిన గద్దర్‌గారి పేరు మీద అవార్డు ఇస్తున్న రేవంత్గారికి సెల్యూట్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు కాంతారావుగారి అవార్డు ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్గార్ల తర్వాత మూడో హీరో కాంతారావుగారు. తెలంగాణ గడ్డ బిడ్డ ఆయన. జానపద హీరో. తెలుగు ఎంజీఆర్ ఆయన. ఎలాంటి పాత్ర వేసినా రామారావుగారి తర్వాత మెప్పించిన గొప్ప నటుడాయన. అలాంటి కాంతారావుగారి అవార్డుని నాకు ఇచ్చి, నా జన్మధన్యం చేసిన రేవంత్ రెడ్డిగారికి థ్యాంక్స్. చంద్రబాబునాయుడుగారు... మీకు దండం పెడుతున్నా. మీరు చాలా పెద్దవారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిగారు దూసుకెళ్లిపోతున్నారు చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ, గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చుకుంటూ... ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆంధ్ర రాష్ట్ర ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి, గౌరవించి మీరు కూడా దయ ఉంచి నంది అవార్డులు ఇవ్వండి సార్.. ఇండస్ట్రీని ప్రోత్సహించండి.– ఆర్. నారాయణమూర్తి (కాంతారావు అవార్డుగ్రహీత)ఏయన్నార్ అవార్డు అందుకోవడం ఆనందంముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లకు ధన్యవాదాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ‘దిల్’ రాజు, ప్రియాంక, చిరంజీవి, కమల్‌హాసన్ గార్లతో పాటు... ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా నమస్కారాలు. ఏయన్నార్‌గారి అవార్డును అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రిగారికి థ్యాంక్స్. ఏయన్నార్‌గారి గురించి చె΄్పాలంటే... ఎంతో చె΄్పాలి. మా తరంలో ఆయనతో ఎక్కువ చిత్రాల్లో నటించాను. 1976 అన్నపూర్ణ స్టూడియోస్ ఫస్ట్ ఫ్లోర్లో రామానాయుడుగారు నిర్మించిన ‘సెక్రటరీ’ సినిమాతో మా జర్నీ మొదలైంది. అక్కడ్నుంచి ఎన్నో గొప్ప చిత్రాలు... ఎన్నో గొప్ప బ్లాక్‌బస్టర్స్. ఆయన ఎంత గొప్ప నటులో నేను చె΄్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చినప్పుడు...ఆయన అన్నారు.. ‘ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా... నా స్టైల్‌ను నేను ఏమైనా మార్చుకోవాలా?, యాక్టింగ్‌లో ఏమైనా మార్పు తెచ్చుకోవాలా? నా బాడీ లాంగ్వేజ్‌లో మార్పు రావాలా?’ అని అందర్నీ అడిగేవారు. నన్ను కూడా అడిగారు. అంత గొప్ప నటులు ఆయన. అంత సింపుల్‌గా ఉంటారు. ఆయన్నుంచి మనందరం నేర్చుకోవాలి. నన్ను ఎప్పుడూ లిటిల్ ఫ్రెండ్ అంటుంటారు. నేను ఆయన లిటిల్ ఫ్రెండ్‌నే. ఆయన లెగసీ కంటిన్యూ అవుతోంది. నాగార్జునగారు, సుమంత్, సుశాంత్, అఖిల్... ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాగచైతన్య. ఏయన్నార్ లివ్స్ ఆన్ . రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్. సీయంగారు గత ఏడాది నాకు చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఏయన్నార్ అవార్డు వరించింది. నేను శాసన సభ్యురాలిగా ఫస్ట్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డైనమిక్ స్పీకర్. తెలంగాణ మూమెంట్ సమయంలో హౌస్ అడర్జ్న్డ్ అయినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, మాట్లాడేవారు. అసెంబ్లీ విధి విధానాల గురించి చెప్పేవారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందుకు గర్వంగా ఉంది. ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అయ్యారు.– ఏయన్నార్ అవార్డుగ్రహీత జయసుధఈ అవార్డు నాకో మోటివేషన్అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పదహారు సంవత్సరాల సినిమా ప్రయాణంలో ముఖ్యమైన గౌరవం... గుర్తింపు ఇది. ఎన్నో థ్యాంక్స్ చె΄్పాలి. గద్దర్‌గారు గొప్ప వ్యక్తి. నిజమైన విప్లవకారులు. కుల వివక్షపై వ్యతిరేకంగా, గౌరవం కోసం పోరాడారు. అలాంటి వ్యక్తి పేరిట ఇలాంటి గొప్ప ఇన్షియేట్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ‘దిల్’ రాజుగార్లకు ధన్యవాదాలు. ప్రతి సినిమాకు నేను వంద శాతం ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాను. కొన్ని వర్కౌట్ అయ్యాయి... మరికొన్ని కాలేదు. ‘తండేల్’ సినిమాలో నేను పోషించిన తండేల్ రాజు పాత్రను నా మనసులో పెట్టుకునేలా చేసింది. చాలా సంతోషంగా ఉంది. అలాంటి ఎఫర్ట్స్‌కు ఇలాంటి ఓ అవార్డు రావడం నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డు చూస్తుంటే ఇంకా నేర్చుకోవాలని, ఇంకా ఎదగాలని... నటుడిగా ఇంకా కథలు చె΄్పాలని మోటివేషన్ లా ఉంది. అల్లు అరవింద్‌గారికి, వాసు, చందు మొండేటి, దేవిగారు, సాయి పల్లవి, నవీన్ నూలి, కార్తీక్ ఘట్టమనేని, శేఖర్ మాస్టర్, సుప్రీమ్ మాస్టర్, కార్తీక్ తీడ... ఇలా ‘తండేల్’ సినిమాలోని అందరికీ థ్యాంక్స్. మీ అందరి ఎఫర్ట్స్ లేకుంటే ఇక్కడ అవార్డు తీసుకుని ఉండేవాడిని కాదు. నా పిల్లర్స్, నా స్ట్రెంత్... మా అమ్మా నాన్న. అలాగే శోభిత... అభిమానులందరికీ ‘ఈపాలి యేట గురి తప్పేదేలేదేస్... ఇక రాజులమ్మ జాతరే’.– నాగచైతన్య (ఉత్తమ నటుడు – ‘తండేల్’)ఈ అవార్డు మరింత నమ్మకాన్నిచ్చిందిఅందరికీ హాయ్.. హ్యాపీ ఉగాది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రేవంత్ సార్... ఈ అవార్డును మీ చేతుల మీదుగా అందుకోవడం వెరీ వెరీ స్పెషల్. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, దిల్ రాజు సార్లకు, హోల్ జ్యూరీ కమిటీకి థ్యాంక్స్. ఒకప్పుడు నా నటనపైన నేను ట్రోల్స్ ఎదుర్కొన్నాను. కానీ, ఈరోజు నా నటన నచ్చి రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే నేను చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటాననుకుంటున్నాను. ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాకి అవార్డు రావడం చాలా ప్రత్యేకం. పైగా ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించే నమ్మకాన్ని ఇచ్చింది. నన్ను భూమా పాత్రలో అద్భుతంగా చూపించిన రాహుల్ రవీంద్రన్ కి థ్యాంక్స్. దీక్షిత్, ధీరజ్ సార్, విద్య మేడం, గీతా ఆర్ట్స్‌కి థ్యాంక్స్. చాలా సంవత్సరాల క్రితం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక కూతురుగా భావించి ప్రేమ ఇచ్చారు. ఈ రోజు కోడలిగా మీ ముందు నిల్చున్నాను... ఇది చాలా గర్వంగా ఉంది. మీ ప్రేమకు ధన్యవాదాలు.. – రష్మికా మందన్నా, (ఉత్తమ నటి, ‘ది గర్ల్ ఫ్రెండ్’)అవార్డు విజేతలుఉత్తమ నటుడు – నాగ చెతన్య (తండేల్)ఉత్తమ నటి – రష్మికా మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయిఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరాఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్ షో నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వాఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్డ్స్ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాంఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్టు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్ఉత్తమ బాలల చిత్రం – అనగనగనాఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)ఉత్తమ సహాయ నటి– భూమిక (యుఫోరియా)ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె. రాబిన్ (దండోరా)ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్)ఉత్తమ బాలనటుడు – రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర)ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్) ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)ఉత్తమ కొరియోగ్రాఫర్ – గిర గిర గిర (ఛాంపియన్)ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ – తోట తరణి (ఛాంపియన్ )ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్ (అఖండ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ (చంద్రకాంత్)ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ – 23ఉత్తమ మేల్ యాక్టర్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)స్పెషల్ జ్యూరీ హీరో – రోషన్ (చాంపియన్ ) -
అక్టోబర్ 3 నుంచి హెచ్ఐసీసీలో జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్
జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జిటో) ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హెచ్ఐసీసీ హైటెక్స్‌లో జిటో కనెక్ట్–2025 ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు జీటో కనెక్ట్ చైర్మన్ రోహిత్ కొఠారి వెల్లడించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తాజ్ దక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జీటో కమిటీ సభ్యులతో కలిసి కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ది పవర్ ఆఫ్ వన్ అనే థీమ్‌తో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో పలువురు వ్యాపారవేత్తలతో పాటు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ ప్రముఖులు, ఆర్ధిక నిపుణులు, సినీ క్రీడా రంగ ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ జీటో కనెక్ట్ ప్రారంభోత్సవానికి కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు స్మతి ఇరాని, యోగా గురువు రాందేవ్ బాబా, ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్, క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, టెక్ దిగ్గజం జోహా స్థాపకుడు శ్రీధర్ వెంబు కూడా హజారవుతారని వెల్లడించారు. ఈ మహాసభలో 600లకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని సుమారు 2 లక్షల మందికి పైగా సందర్శకులు పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరి లలిత్ చొప్రా, కన్వీనర్ బిఎల్ భండారి, కో–కన్వీనర్ సుశీల్ సాంచెట్, డైరెక్టర్ గౌతమ్, ట్రెజరర్ విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
Miss World 2025: మిస్ వరల్డ్ చువాంగ్శ్రీ
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్–2025గా థాయ్‌లాండ్ భామ ఒపల్ సుచాత చువాంగ్శ్రీ(21) ఎంపికైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో ఆమె విజయం సాధించింది. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిష్టినా పిష్కోవా ఆమెకు రూ. 6.5 కోట్ల విలువైన బ్లూ క్రౌన్‌ను అలంకరించింది. ఈ విజయంతో ఆమె దాదాపు రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీతోపాటు లండన్‌లో ఏడాదిపాటు నివాసం, డిజైనర్ దుస్తులు, నగలు వంటి బహుమతులు, ఏడాదిపాటు ప్రపంచవ్యాప్తంగా ఉచిత విమాన ప్రయాణ సౌలభ్యం, స్టార్ హోటళ్లలో ఉచిత బస వసతి పొందనుంది. మొదటి రన్నరప్‌గా ఇథియోపియాకు చెందిన హాసెట్ డెరెజె అడ్మాస్సు, రెండో రన్నరప్‌గా పోలాండ్‌కు చెందిన మజా క్లాజ్డా, మూడో రన్నరప్‌గా మార్టినిక్‌కు చెందిన ఆరేలీ జోచిమ్ నిలిచింది. భారత సుందరి నందినీ గుప్తా టాప్–8 జాబితాలో కూడా చోటుదక్కించుకోలేకపోయింది. అందరూ వచ్చి.. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. సాయంత్రం ఐదున్నరకే కార్యక్రమాలు మొదలయ్యాయి. తొలుత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే 108 మంది భామలను రెడ్ కార్పెట్ మీదుగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానించారు. అనంతరం వ్యాఖ్యాత సచిన్ కుంభర్ అమెరికా–కరేబియన్, ఆసియా–ఓసియానియా, ఆఫ్రికా, యూరప్.. ఇలా నాలుగు భాగాలుగా విభజించి దేశాలవారీగా పోటీదారులను పరిచయం చేశారు. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలేలో పోటీపడే టాప్–40 మందితో కూడిన బృందాన్ని పరిచయం చేశారు. ఒక్కో ఖండం నుంచి 10 మంది చొప్పున ఇందులో చేర్చారు. గత మూడు వారాలుగా జరిగిన ఐదు చాలెంజ్‌ల విజేతలైన 16 మందితోపాటు న్యాయ నిర్ణేతలు ఇచ్చిన మార్కుల ఆధారంగా మిగతా 24 మందిని వేదికపైకి ఆహ్వానించి మొత్తం 40 మందితో కూడిన బృందాన్ని సిద్ధం చేశారు. దీంతో పోటీ నుంచి వైదొలిగిన మిగతా వారు వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన స్థానాల్లో ఆసీనులయ్యారు. పోటీదారులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రొఫైల్.. వారి చాతుర్యం.. మాటతీరు ఆధారంగా కేటాయించిన మార్పుల ఆధారంగా ఒక్కో ఖండం నుంచి ఐదుగురు చొప్పున ఉండే టాప్–20 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఆ రౌండ్లో వైదొలిగిన వారు వెళ్లి వారి స్థానాల్లో కూర్చోగా తదుపరి రౌండ్లో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున టాప్–8 మందిని (ఆఫ్రికా: నమీబియా, ఇథియోపియా, యూరప్: పోలాండ్, ఉక్రెయిన్, ఆసియా–ఓíÙయానియా: ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, అమెరికా–కరీబియన్: బ్రెజిల్, మార్టినికా) షార్ట్ లిస్ట్ చేశారు. భారత సుందరి నందిని గుప్తా ఈ దశలోకి చేరుకోలేక నిష్క్రమించింది. ‘మీరే ఎందుకు ప్రపంచ సుందరి కావాలనుకుంటున్నారు?’ టాప్–8 మంది సుందరీమణుల్లోంచి టాప్–4 భామలను ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణయితలు అడిగిన ప్రశ్నలు కీలక భూమిక పోషించాయి. గతంలో వారు పొందిన మార్కులు.. ఈ ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటికప్పుడు ఇచ్చిన మార్కులు కలిపి విజేతను ఎంపిక చేశారు. తొలుత 8 మందిని ప్రజెంటర్ సచిన్ కుంభర్ అడిగిన ‘మీరే ప్రపంచ సుందరి ఎందుకు కావాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా తుది పోరుకు థాయ్‌లాండ్, ఇథియోపియా, పోలాండ్, మార్టినిక్ సుందరీమణులను ఎంపిక చేశారు. ఉత్కంఠభరితంగా తుది పోరు... నలుగురు మాత్రమే వేదికపై ఉండి తుది పోరుకు సిద్ధమైన తరుణంలో ఆ ప్రాంగణమంతా ఉద్విగ్నత నెలకొంది. న్యాయ నిర్ణేతలైన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జూలియా మోర్లే, నటులు సోనూసూద్, రానా దగ్గుబాటి, నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని ఒక్కొక్కరికీ సంధించిన ప్రశ్నలకు పోటీదారులు ఇచ్చిన సమాధానాలు వారి స్థానాలను నిర్ణయించాయి. సోనూసూద్ అడిగిన ప్రశ్నకు అద్భుతంగా సమాధానమిచ్చిన థాయ్‌లాండ్ సుందరి ఒపల్ సుచాత చువాంగ్శ్రీ మిస్ వరల్డ్–2025గా ఎంపికైంది. సోనూసూద్‌కు మానవతావాది పురస్కారం కోవిడ్ సమయంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న నిరుపేద కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఉచిత రవాణా వసతి కల్పించిన సినీనటుడు సోనూసూద్‌కు మిస్ వరల్డ్ మానవతావాది’ పురస్కారాన్ని మిస్‌వరల్డ్ సంస్థ ప్రకటించింది. ఆయనకు రానా దగ్గుబాటి బంగారు గ్లోబ్‌ను అందించారు. -
మిస్‌వరల్డ్ 2025గా థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత
Miss World 2025 Grand Finale Updates:👉మిస్‌వరల్డ్ 2025గా థాయ్‌లాండ్ సుందరిమిస్ వరల్డ్ 2025గా థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాతవిజేత ఓపల్ సుచాతకు బ్లూక్రౌన్ అలంకరించిన క్రిస్టినామిస్ వరల్డ్ 1వ రన్నరప్‌గా ఇథియోపియా సుందరి అడ్మాస్సుమిస్ వరల్డ్ 2వ రన్నరప్‌గా పోలాండ్ సుందరి మాజా క్లాజ్డ్మిస్ వరల్డ్ 3వ రన్నరప్‌గా మార్టినిక్ భామ అరోలి జోచిమ్👉మిస్ వరల్డ్ లో ఫైనల్ రౌండ్ ప్రారంభంజడ్జీలు అడిగే ప్రశ్నలకు కంటెస్టెంట్ల సమాధానాలువాటికి మార్కుల ఆధారంగా విజేత👉మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ (మానవతావాది) అవార్డు అందుకున్న సోనూ సూద్కోవిడ్ సమయంలో ఆయన చేసిన మానవతాచర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించిన మిస్ వరల్డ్ నిర్వాహకులురానా దగ్గుబాటి చేతుల మీదుగా జ్ఞాపిక అందజేతస్టేజ్ పైన వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహ పరిచిన సోనూ సూద్తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు చెప్పిన సోనూసూద్👉టాప్-8 లో చోటు దక్కించుకోలేకపోయిన ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తా ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేసిన నిర్వాహకులు👉మిస్ వరల్డ్ టాప్ నలుగురు వీరే..అమెరికా ఖండం నుంచి మార్టినిక్ఆఫ్రికా నుంచి ఇథియోపియాయూరోప్ నుంచి పోలెండ్ఆసియా నుంచి థాయిలాండ్👉మిస్ వరల్డ్ పోటీల నుంచి నిష్క్రమించిన మిస్ ఇండియా నందిని గుప్తాఆసియా నుంచి టాప్-2లో చేరిన థాయ్లాండ్నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నతో 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశంఅభ్యర్థుల సమాధానాలకు జడ్జీల మార్కులు 👉మిస్ వరల్డ్ ఫినాలే నుంచి మిస్ ఇండియా ఎలిమినేట్ఎలిమినేటైన మిస్ ఇండియా నందిని గుప్తాటాప్-8లో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోఫియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్, థాయ్‌లాండ్‌లు 👉ఆసియా నుంచి టాప్ 5లో మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 20 లో ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తాకు చోటు👉మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్‌గా సుధా రెడ్డి నియామకంజ్ఞాపికను అందించిన మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీచాలా ఆనందంగా ఉందన్న సుధా రెడ్డిఅద్భుతమైన ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వానికి, టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపిన సుధా రెడ్డి👉జడ్జిలుగా..జూలియా మోర్లీ నటుడు సోనూ సూద్సుధా రెడ్డి రానా దగ్గుబాటిజయేష్ రంజన్ మనూషి చిల్లర్ నమ్రత శిరోద్కర్ డోనా వాళ్ష్కరినా టర్రెల్👉అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్కుటుంబ సమేతంగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్హాజరైన సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. ఫినాలేకు రాష్ట్ర టూరిజం శాఖ, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. గ్రాండ్ ఫినాలేకి 3,500 మంది గెస్ట్లుగా హాజరయ్యారు. గ్రాండ్ ఫినాలేకి టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు వచ్చారు.2016 మిస్ వరల్డ్ విన్నర్ స్టేఫినీ డెల్ వాలే, సచిన్ కుంభర్.. ఫినాలే ఈవెంట్‌ను హోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ స్పెషల్ లైవ్ షో నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ న్యాయనిర్ణేతలుగా నటుడు సోను సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కరీనా టర్రెల్ వ్యవహరించారు. 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.ఫినాలేలో మిస్ వరల్డ్ హ్యూమానిటరియన్ అవార్డును సోనుసూద్ అందుకోనున్నారు. మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ.. విన్నర్‌ను ప్రకటించనున్నారు. 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా.. విజేతకు 6.21 కోట్ల విలువ గల బ్లూ క్రౌన్ అలంకరించనున్నారు. విశ్వసుందరికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 40 మంది సుందరీమణులు ఫినాలేలో పోటీపడుతున్నారు. టాప్ 40లో ఇప్పటికే 16 బెర్త్‌లు ఖరారు కాగా, ఈ రోజు జరిగే క్వార్టర్స్ ఫైనల్స్‌లో 24 మందిని జూరీ మెంబర్లు ఎంపిక చేయనున్నారు.బ్యూటీ విత్ ఎ పర్సస్‌లో మిస్ ఇండోనేషియా, మిస్ వేల్స్, మిస్ ఉగాండ విజేతలుగా నిలిచారు. బ్యూటీ విత్ ఎ పర్సస్, టాలెంట్ ఈవెంట్ రెండింట్లోను మిస్ ఇండోనేషియా మోనిక కేజియా గెలిచారు. స్పోర్ట్స్ ఈవెంట్ లో విజేతగా మిస్ ఎస్తోనియా నిలిచారు. హెడ్-టు-హెడ్ రౌండ్లో మిస్ టర్కీ విన్ అయ్యారు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండియా నందినీ గుప్తా టాప్ మోడల్‌గా నిలిచారు. -
ఇవాళే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే
-
ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: ఎస్ఎస్ రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ క్షణం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మార్చి 22వ తేదీ జరిగే అద్భుతమైన ప్రదర్శన కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.మార్చి 22వ తేదీన హైదరాబాద్ వేదికగా సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి(MM Keeravani) మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారని రాజమౌళి వెల్లడించారు. ఆ సంగీత ప్రదర్శన చూసేందుకు తాను కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు. నా సినిమాలోని పాటలతో పాటు ఆయన చేసిన సాంగ్స్ కూడా ఈ ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. కేవలం పాటలు మాత్రమే కాకుండా.. ఓఎస్టీలు(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) కూడా ప్రదర్శించాలని ఎంఎం కీరవాణి డిమాండ్ చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వీడియోను రిలీజ్ చేశారు.కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ లోకేషన్స్ కూడా ఫిక్స్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Seeing all the singers share their playlists is making me excited for MMK’s live concert. But what makes me have an edge-of-the-seat experience is imagining him performing the OSTs of our favorite films… Remember peddanna, we are here for the #FullFeastMMK!Not just songs, we… pic.twitter.com/9dS8AeAbse— rajamouli ss (@ssrajamouli) February 28, 2025 -
ఆధునికత, హస్తకళా నైపుణ్యం మేళవింపుతో గౌరాంగ్ హోం ‘నీల్’ కలెక్షన్ ఎగ్జిబిషన్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేశారు. జాతీయ అవార్డు ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా, సాంప్రదాయ భారతీయ వస్త్రాలు , హస్తకళలు, జమ్దానీ కళను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా "గౌరంగ్ హోమ్"లోని "నీల్" పేరుతో తొలి కలెక్షన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫర్నిచర్, ఫర్నీషింగ్లు , పింగాణీ వస్తువులు ప్రదర్శనకుంటాయి. నాణ్యత, టైమ్‌లెస్ డిజైన్‌కు ప్రాధాన్యతినిస్తూ, సాంప్రదాయ హస్తకళ లేటెస్ట్ ట్రెండ్ మిళితమై ఈ వస్తువులు కొలువు దీరతాయి."గౌరంగ్ హోమ్" ద్వారా ఇంటీరియర్ డిజైన్ సేవల్లోకి ప్రవేశిస్తూ, కాన్సెప్ట్-టు-ఫినిష్ స్టైల్లో ఇంటిని అందంగా తీర్చిదిద్దు కోవడంలో పాపులర్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో “గౌరంగ్ హోమ్” కలెక్షన్ ఎగ్జిబిషన్ అక్టోబరు 4న ప్రారంభం కానుంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:00 వరకు అందుబాటులో ఉంటుంది.'నీల్' కలెక్షన్లోని ప్రతి భాగం ఆ కళ గురించి మాత్రమే కాకుండా, దానిని తయారు చేసిన శిల్పి నైపుణ్యాన్ని తెలిపుతూ,ఈ కలెక్షన్ మీ ఇంటిని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది అంటారు గౌరాంగ్. ఇండియన్ ఇంటీరియర్స్ కోసం ఇదొక కొత్త అధ్యాయమన్నారు. నీల్ కలెక్షన్స్‌లో ఫర్నిషింగ్స్, బెడ్‌స్ప్రెడ్‌లు, కంఫర్టర్లు, దిండు కవర్లు , టేబుల్ లినైన్స్ సిగ్నేచర్ స్టైల్లో ఉంటాయి. ఇందులో జమ్దానీ నేత, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికాన్, కసౌటి, సుజినీ కళాత్మకతతో ఇండిగో (నీలిరంగు)కలర్లో ఆకట్టుకుంటాయి.అందానికి, ఆరోగ్యానికి తగినట్టుగా శతాబ్దాల రాగి ,తగరంతో తయారు చేసిన శతాబ్దాల నాటి వస్తువలను సిరామిక్‌తో తయారు చేసిన క్రోకరి మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇందులో పురాతన కుండల వినియోగానికి ప్రతీకగా, చేతితో తయారు చేసిన డిన్నర్వేర్ ఉంటుంది. ప్రతీ వస్తువును ప్రపంచవ్యాప్తంగా లభించే మట్టితో తయారు చేయడం విశేషం.ఈ వెంచర్ ద్వారా, తన ప్రసిద్ధ డిజైన్ ఫిలాసఫీని జీవితానికి తీసుకురావాలనేదే గౌరంగ్ లక్ష్యం. భారతదేశ చేనేత సంప్రదాయాలను పరిరక్షించడం, పర్యావరణ అనుకూల పదార్థాలు, సహజ రంగులు, సాంప్రదాయ పద్ధతులు,కళాకారుల నైపుణ్యాన్ని మెచ్చుకునేలా పర్యావరణ స్పృహ ఉన్న ఔత్సాహిక గృహాలంకరణ వినియోగదారులను ఆకట్టుకోనుంది. -
హైటెక్స్ వేదికగా దేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్!
క్రాఫ్టాన్ (KRAFTON) ఇండియా సమర్పించు బ్యాటిల్ రాయల్ ఎస్పోర్ట్స్ ఈవెంట్ 2024 ఫినాలే (BGIS) హైదరాబాద్‌లో హైటెక్స్ వేదికగా ఈనెల (జూన్) 28, 29, 30 తేదీల్లో జరుగనుంది. భారతదేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్లలో ఒకటైన BGISలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జట్లు రిజిస్టర్ చేసుకున్నాయి. పలు దఫాల పోటీల అనంతరం టాప్ 16 జట్లు తుది పోటీలకు అర్హత సాధించాయి. ఈ ఈవెంట్లో పోటీ పడే జట్లు రూ. రెండు కోట్ల ప్రైజ్‌మనీని షేర్ చేసుకుంటాయి.KRAFTON సంస్థ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్‌మనీని కేటాయించడం భారత్‌లో ఈ-స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధికి నిదర్శనం. BGIS 2024 Finaleతో హైదరాబాద్ నగరం గేమింగ్ గమ్యస్థానంగా తమ ప్రతిష్ట మరింత పెంచుకోనుంది. ఈ ఈవెంట్‌కు ప్రవేశ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోగా.. ప్రీమియం సీటింగ్, భోజన సదుపాయం కల ఎలైట్ పాస్‌లు (పెయిడ్ టికెట్లు) అందుబాటులో ఉన్నాయి.ఎలైట్ పాస్‌ల ధర రూ. 5000గా నిర్ణయించారు. ఎలైట్ పాస్‌ల విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని సంప్రదాయ క్రీడలకు మద్దతుగా అభినవ్ బింద్రా ఫౌండేషన్‌కు అందిస్తారు. గేమింగ్ ఔత్సాహికులు, అభిమానులు ఈ ఈవెంట్‌ను KRAFTON India Esports YouTube ఛానెల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం కలిగిన KRAFTON, Inc. ఆకర్షణీయమైన ఆటలను కనుగొనే ఆన్లైన్ గేమింగ్ సంస్థ. 2007లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డెవలపర్లకు నిలయంగా ఉంది. ఇందులో PUBG స్టూడియోస్, స్ట్రైకింగ్ డిస్టెన్స్ స్టూడియోస్, వెక్టర్ నార్త్, నియాన్ జెయింట్, క్రాఫ్టాన్ మాంట్రియల్ స్టూడియో, బ్లూహోల్ స్టూడియో, రైజింగ్ వింగ్స్, 5మిన్ల్యాబ్స్, డ్రీమోషన్, రెలుగేమ్స్, ఫ్లైవేగేమ్స్ వంటి స్టూడియోలు ఉన్నాయి.ప్రతి స్టూడియో నిరంతరం కొత్త సవాళ్లను స్వీకరించడానికి, వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌లు, సేవలను విస్తృతం చేయడం ద్వారా మరింత మంది అభిమానులను గెలుచుకోవడం KRAFTON లక్ష్యం. -
14, 15 తేదీల్లో హైటెక్స్‌లో వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం
సనత్‌నగర్ (హైదరాబాద్): జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ టూరిజం, తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ 3వ ఎడిషన్, 3వ టీసీఈఐ ఎస్ఐడబ్ల్యూయుపీసీ గ్లోబల్ 2024 బియాండ్ ఇమాజినేషన్, 7వ టీసీఈఐ ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2024 వేడుకలు జరగనున్నాయి.ఈ మేరకు ఆదివారం బేగంపేట పర్యాటక భవన్‌లోని ది ప్లాజా హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, భారతీయ వివాహ పరిశ్రమలోని నిపుణులను ఇది ఒకచోట చేర్చుతుందని, ఈ ఈవెంట్ ద్వారా వివాహాలకు దక్షిణాది నుంచి ముఖ్యమైన సహకారం, పరిజ్ఞానం, ప్రత్యేక వేదికను అందించడమే లక్ష్యమన్నారు. భారతీయ వివాహ వ్యవస్థలోని వివిధ అంశాలపై జ్ఞానయుక్తమైన సెషన్లు ఉంటాయని, జాతీయ, అంతర్జాతీయ వక్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారని తెలిపారు. ఈ కన్వెన్షన్ కోసం దేశవిదేశాల్లో ఉన్న 20కి పైగా వెడ్డింగ్ ప్లానర్లు, వెడ్డింగ్ డిజైనర్లు, వెడ్డింగ్ స్టైలిస్టులు, డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఈవెంట్ ఇండస్ట్రీలోని ఇతర క్రాప్ట్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయన్నారు.ఈవెంట్‌కు సిడ్నీ నుంచి వెండీ ఈఎల్ ఖౌరీ సహా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిపుణులు హాజరవుతారన్నారు. టెడ్డీ ఇమాన్యుయేల్ (ఫిలిప్పీన్స్), మైఖేల్ రూయిజ్ (ఫిలిప్పీన్స్), బ్రయాన్ టాచీ–మెన్సన్ (ఘనా) తదితరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం దేశవిదేశాల నుంచి 700 మందికి పైగా ప్రతినిధులకు స్వాగతం పలుకుతోందన్నారు. ‘ఈవెంట్ బజార్’గా పిలవబడే ఎక్స్‌పోలో 60కి పైగా స్టాల్స్‌లో గ్రాండ్ డిస్ప్లే ఉంటుందన్నారు. ఈవెంట్ పరిశ్రమలో ఉన్న విభిన్న ఉత్పత్తులు, సేవలు, అత్యాధునిక ట్రెండ్లను ప్రదర్శిస్తుందని చెప్పారు.ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు, ఈవెంట్ సేప్టీ, టెక్నాలజీ పాత్ర తదితర కీలక అంశాలపై సమాంతర సెషన్లు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ డైరెక్టర్ రమేశ్‌నాయుడు, హైటెక్స్ హెడ్ టీజీ శ్రీకాంత్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాంబాబు, ప్ర«ధాన కార్యదర్శి రవిబురా, కోశాధికారి ఎండీ తౌఫిక్ ఖాన్, ఎస్ఐడబ్ల్యూయుపీసీ గ్లోబల్ 2024 కన్వీనర్ సాయి శ్రవణ్ మాదిరాజు, టీసీఈఐ ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2024 కన్వీనర్ రామ్ ముప్పన, కో–కన్వీనర్లు హిరీష్రెడ్డి, కుమార్‌రాజా, సుధాకర్ యారబడి, డాక్టర్ సౌరభ్ సురేఖ తదితరులు పాల్గొన్నారు. -
‘మూసీ’ని మార్చేస్తాం
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని పునరుజ్జీవింపచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) 31వ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బీఏఐ సావనీర్‌ను విడుదల చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ త్వరలోనే మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)ను ఆహ్వానిస్తామన్నారు. 55 కిలోమీటర్ల పొడవైన మూసీనది వెంట కనెక్టింగ్ కారిడార్లు, మెట్రో, ఆట, వినోద కేంద్రాలు, హోటళ్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. మూసీ అభివృద్ధికి లండన్‌లోని థేమ్స్ నది నుంచి గుజరాత్‌లోని సబర్మతి నది వరకు నదీపరీవాహక ప్రాంత రాష్ట్రాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలనేదిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కాంట్రాక్టర్లు, బిల్డర్లు భాగస్వాములేనని, రాష్ట్రంలోని మౌలిక వసతులే ఆ రాష్ట్ర అభివృద్ధికి కొలమానమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంట్రాక్టర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేశారని గుర్తు చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వాములేనని, వారి సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో 20 ఏళ్లుగా ఉన్న ఈపీసీ కాంట్రాక్టర్ల బిల్లుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి క్లస్టర్ వద్ద పాఠశాల లు, ఆస్పత్రులు, సౌరవిద్యుత్ ప్లాంట్లు, సైకిల్ ట్రాక్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించామని, అందుకు తగ్గ ప్రణాళిక ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు. -
Live Stock Expo : పశు సంపద రంగానికి తగినంత గుర్తింపు రావాలి
ఎల్డిఎఫ్ ఇండియా, పశువులు, పాడి పరిశ్రమ మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థలన్నింటిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పో గురువారం హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఆదివారం వరకు మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో సుమారు 80 స్టాల్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (AFTS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డాక్టర్ తరుణ్ శ్రీధర్, మాజీ యూనియన్ సెక్రటరీలతో పాటు పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గిన్నారు. ఈ సందర్భంగా డా. తరుణ్ శ్రీధర్ మాట్లాడుతూ.. పశుసంపద సరైన గుర్తింపుకు నోచుకోలేదని, భారత్‌లో ఇప్పటికే చాలామంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. అసలు పశువులతో సంబంధం లేకుండా ఏ రైతును చూడలేరన్నారు. భారతదేశం గణనీయమైన పశువుల జనాభాను కలిగి ఉందని, ప్రపంచ చేపల ఉత్పత్తి సహా పాల ఉత్పత్తి వినియోగంలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ఎల్‌డిఎఫ్‌పై అంకితమైన ఎక్స్పో చాలా అవసరం. ఇది త్వరలో ప్రపంచ స్థాయిలో బోస్టన్ సీఫుడ్స్‌తో సమానంగా ఎదుగుతుందనన్నారు.ఇలాంటి ఎక్స్‌పోలు మన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా విధి విధానాలను నిర్మించే ప్రభుత్వ అధికారులను మేల్కొల్పుతాయని అన్నారు డాక్టర్ తరుణ్ శ్రీధర్. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. ఇది రూ.63,960 కోట్ల సీఫుడ్ ఎగుమతులను సాధించిందని, ఇంకా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అని భారతదేశంలోని చేపలలో 68% ఆక్వాకల్చర్ రంగం నుండి వస్తుందని తెలిపారు. పశువులు శక్తి. పశువులు ఎల్లప్పుడూ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఇది చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, యువతకు ఆకర్షణీయంగా కనిపించదు. అయితే ప్రపంచం మొత్తం సహజ, సేంద్రియ, పున రుత్పత్తి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నందున మంచి రోజులు వచ్చాయి. పశుసంవర్ధక రంగం ఇప్పుడు ఆహార భద్రత నే కాక, పోషకాహార భద్రతగానూ గొప్ప సంభావ్యత కలిగిన చాలా పెద్ద రంగంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 121 స్థానాల్లో భారతదేశం 107 స్థానాల్లో ఉన్న నేపథ్యంలో పశు సంపదకు సంబంధించిన ఉత్పత్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మాంసం తినే జనాభాలో 70% కంటే ఎక్కువ భారతదేశం. 2050లో 18.1 MT తలసరి మాంసం వినియోగం 13.8 కిలోల అంచనాగా ఉందని NABARD చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. గోదావరి కట్స్‌లో 25 కిలోల ఎల్లోఫిన్ ట్యూనా అనే అరుదైన చేపలను ప్రదర్శించారు. ఎల్లోఫిన్ ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి అధిక వలసలు, పసిఫిక్, అట్లాంటిక్ -హిందూ మహాసముద్రాల అంతటా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జీవరాశి అయిన ఎల్లో ఫిష్ ట్యూనా అంతరించిపోతోంది. భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు డెవలప్మెంట్ కమీషనర్ డి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో 46 (23 మంది స్థానిక, 23 మంది స్థానికేతర) సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డబ్ల్యువిఆర్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం చిన్నతనం నుండే పశువులతో ముడిపడి ఉన్నాం. కానీ మన యువత ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదు. యువతను ఆకర్షించేందుకు వీలుగా ఈ రంగాన్ని బ్లూ కాలర్ లాంటి రంగంగా మార్చాలి. మీరు సాంకేతికతపరమైన ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచారు.దళిత బంధు లబ్ధిదారులు కూడా అవకాశాలను అన్వేషించడానికి ఎక్స్పోను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్‌పోలో కంట్రీ చికెన్ వంటి అనేక స్టాల్స్ ఉన్నాయి. దీనిని ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సాయికేష్ గౌండ్, మొహమ్మద్ సమీ ఉద్దీన్ స్థాపించారు. ఆధునిక,పరిశుభ్రమైన మాంసం దుకాణాలు అవసరమని చాలా మంది తెలియచేశారు. కూరగాయలకు మంచి, పరిశుభ్రమైన దుకాణాలు ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన మాంసం దుకాణాలు ఎక్కువగా కనిపించవు. గడ్డకట్టిన చేపలను కొనడానికి ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. అందరూ తమ వ్యాపారాలకి ప్రజలను ఆకర్షించే కొత్త దారులను వెతుకుతున్నారు. -
టీఎస్ఐపాస్ ద్వారా 24000 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం
మాదాపూర్: టీఎస్ ఐపాస్ ద్వారా గత 8.5 ఏళ్లలో 24000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించినట్లు టీఎస్ఐఐసీ ఎండీ వెంకట్ నర్సింహారెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ప్లాస్టిక్ ఎక్స్పో, హిప్లెక్స్ 2023 ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి ప్లాస్టిక్ పార్క్ పూర్తిగా అమ్ముడు పోయిందని, రెండోదాని ఏర్పాటుకు టీఎస్ఐఐసీ స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈ లకు వసతి కల్పించేందుకు వీలుగా టీఏపీఎంసీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్లాస్టిక్ పరిశ్రమకు హబ్‌గా ఉందన్నారు. ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ 60 ఎంఎస్ఎంఈలకు ఆర్ధికసాయాన్ని అందించిందన్నారు. హెచ్‌కె గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్( మార్కెటింగ్ పెట్రోకెమికల్స్) శ్రీ వాస్తవ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ప్లాస్టిక్ పరిశ్రమకు తాప్మా మార్గనిర్దేశం చేస్తుందన్నారు. నేడు యూఎస్ఏ, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద ప్లాస్టిక్ వినియోగదారుగా ఉందన్నారు. 6 శాతం నుండి 7శాతం సీఎజీఆర్ వద్ద నిరంతరం వృద్ధి చెందుతుందన్నారు. గెయిల్ అమ్మకాల్లో దక్షిణ ప్రాంతం 18శాతం వాటాను అందిస్తుందన్నారు. చైనా జనాభా పెరిగినప్పటికీ మన తలసరి ప్లాస్టిక్ వినియోగం చైనాకంటే చాలా తక్కువ అన్నారు. 11 కేటీల వద్ద చైనా తలసరి వినియోగం, 46కేజీ, యూఎస్ఏ 170 కేజీ, ప్రపంచ సగటు 28 కేజీలు వాటి కంటే మనం వెనుకబడి ఉన్నామన్నారు. ప్లాస్టిక్‌పై విధించిన 18శాతం జీఎస్టీని తగ్గించాలని ఆప్మా, తాప్స్ తరఫున ఆయన కోరారు. ఆహార ప్యాకేజింగ్ పరిశ్రమతో పాటు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్‌లపై విధించిన జీఎస్టీని తగ్గించాలన్నారు. తెలంగాణ, ఆంధ్రా ప్లాస్టిక్స్ తయారీదారుల సంఘం(టాప్మా)నాలుగురోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తాప్మా అద్యభుడు విమలేష్గుప్త తెలిపారు. దశాబ్దం క్రితం 9 మిలియన్ టన్నుల నుంచి ఇప్పుడు 18 మిలియన్ టన్నుల వినియోగం స్ఠాయికి చేరుకున్నామని ఇండియన్ ప్లాస్టిక్స్ ఇనిస్టిట్యూట్ జాతీయ అధ్యక్షుడు అనిల్‌రెడ్డి వెన్నం తెలిపారు. పర్యావరణ సంక్షోభానికి కేవలం ప్లాస్టిక్ పరిశ్రమనే నిందించలేమని సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ అవసరమన్నారు. భారతదేశంలో 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తిలో కేవలం 30శాతం మాత్రమే రీసైకిల్ చేయబడుతుందన్నారు. కీలకమైన వృద్ధి రంగంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వానికి ప్రాతినిథ్యాలను అందించాలని కోరారు. ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా 400 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. స్పెషాలిటీ కెమికల్స్, మాస్టర్బ్యాచ్లు, ప్రాసెస్ మిషనరీ, ప్రింటింగ్, ప్యాకేజింగ్, రామెటీరియల్స్, మోల్డ్స్, డై, పోస్ట్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, క్వాలిటి టెస్టింగ్ ఎక్విప్మెంట్, ఫినిస్ట్ ప్రొడెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో హెచ్ఎంఈఎల్ ఎండి ప్రభుదాస్,ఆలిండియా ఇండియా ప్లాస్టిక్ మానుప్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ పాల్గొన్నారు. -
హైటెక్స్‌లో జరిగిన స్వస్త్య ఎక్స్పో గ్లోబల్ ఆయుష్ – వెల్నెస్ ఎక్స్పో ఫోటోలు...
-
KISAN Agri Show: న్యూ హాలండ్ రెండు కొత్త ట్రాక్టర్లు
హైదరాబాద్: న్యూ హాలండ్ అగ్రికల్చర్ (సీఎన్‌హెచ్ ఇండస్ట్రియల్) రెండు నూతన ట్రాక్టర్లను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన కిసాన్ అగ్రి షోలో భాగంగా ‘బ్లూ సిరీస్ సింబా 30’, ‘5620 పవర్ కింగ్’ పేరుతో వీటిని ఆవిష్కరించింది. ఈ వ్యవసాయ సదస్సులో ఆరు ట్రాక్టర్లు, మూడు సాగు ఎకిŠవ్ప్మెంట్లను ప్రదర్శించింది. ఇందులో సింబా 30 అనేది స్ప్రేయింగ్, రోటావేషన్, కల్టివేషన్, అంతర్గత కల్టివేషన్ పనులకు అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. అధిక పవర్‌తో, ఇంధనం ఆధా సామర్థ్యాలు ఇందులోని ప్రత్యేకతలు. ఇక 5620 పవర్ కింగ్ అనేది రవాణాకు, సాగుకు సంబంధించి పనులకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. -
హైటెక్స్‌లో ఈ-మోటార్ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (ఫొటోలు)
-
Telangana: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక త్యాగాలు, పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కేసీఆర్ అన్నారు. మహాత్ముడి దేశంగానే భారత్ ఉంటుందని చెప్పారు. కొంతమంది గాంధీని కించపరచాలని చిల్లర ప్రయత్నాలు చేస్తున్నపటికీ అవి ఫలించవన్నారు. అలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడే అని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దేశ భక్తి ఉట్టిపడేలా, అత్యంత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల స్ఫూర్తిని చాటేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవంలో 75 మంది వీణ కళాకారులతో వాయిద్య ప్రదర్శన చేశారు. హైదరాబాద్‌లోని అన్ని జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. చదవండి: యూపీలో అనూహ్య పరిణామం.. బీజేపీ కార్యకర్త ఇంటిపైకి బుల్డోజర్ -
హైదరాబాద్‌లో మోదీ పర్యటన ఇలా.. షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ ఆ సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే.. ► శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి 2.55 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ► బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 3.20 గంటలకు హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. ► 3.30 గంటలకు హెచ్ఐసీసీకి వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు రిజర్వ్ సమయంగా ఉంచారు. ► సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్‌గా ఉంచారు. ► ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌గా ఉంచారు. ► సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌కు వెళతారు. ► సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు సభలో పాల్గొంటారు. ► రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి.. రాజ్‌భవన్‌కుగానీ, హోటల్కుగానీ చేరుకుని బస చేస్తారు. ► సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. ► ఉదయం 10.10 గంటలకు విజయవాడ చేరుకుని ఏపీలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
Hyderabad: హైటెక్స్‌లో రేపు 40 వేల మందికి టీకాలు
సాక్షి, హైదరాబాద్( రాయదుర్గం) : దేశంలోకెల్లా అతి పెద్ద టీకా కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఒకేరోజు ఏకంగా 40 వేల మందికి టీకాలు వేసేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూ రిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)తో కలసి మెడికవర్ ఆస్పత్రి ఈ మెగా డ్రైవ్‌ను చేపడుతోంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా టీకాల కార్యక్రమం జరుగుతుందని, ఇందుకోసం 500 కౌంటర్లను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. టీకాలకు అర్హులైన (18 ఏళ్లు నిండిన) వారు http://medicoveronline.com/vaccination వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని, కోవాగ్జిన్ టీకా వేస్తామని పేర్కొన్నారు. టీకా ధరను అన్ని చార్జీలతో కలిపి రూ.1,400గా నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలకు 040–6833 4455 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు. చదవండి: టిప్పన్ నక్ష.. రాష్ట్రంలో భూముల సర్వేకు ఈ పేరుకు సంబంధం ఏంటి? -
హై ఫ్యాషన్
-
కండల వీరులొస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో: కండలు తిరిగిన బాడీ బిల్డర్లు, విదేశాలకు చెందిన అంతర్జాతీయ బాడీ బిల్డర్లు హైటెక్స్ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. దీంతో పాటు ఫిట్నెస్ అండ్ మెడికల్ సర్వీసెస్ సైతం ప్రారంభం కానుంది. ఇటీవల ఏర్పడిన సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్ (సీపీటీఏ) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో హైటెక్స్‌లో ‘స్పోర్ట్స్ ఎక్స్పో’ పేరుతో ఈ పోటీలను నిర్వహించనున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన క్రాంతికిరణ్‌రావు నగరంలోని పలు ప్రాంతాల్లో ‘క్రాన్ ఫిట్నెస్’ను ఏర్పాటు చేశారు. ఆయన ‘సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్’ (సీపీటీఏ)కు వర్కింగ్ ప్రెసిడెంట్. ట్రెయినర్‌గా ఎందరికో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 23, 24, 25వ తేదీల్లో హైటెక్స్‌లో ‘స్పోర్ట్స్ ఎక్స్పో’ను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ‘సీపీటీఏ’ ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్’ను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహిస్తారు. పోటీలకు బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాలతో పాటు విదేశాలకు చెందిన కండల వీరులు సైతం సందడి చేయనున్నారు. 24న బాడీ బిల్డింగ్‌తో పాటు ఫిట్నెస్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్ సర్వీసెస్‌ను సైతం ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకుడు క్రాంతికిరణ్‌రావు తెలిపారు. ఫిట్‌నెస్‌పై అవగాహనకల్పిస్తారు.. ‘సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్’ (సీపీటీఏ) ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్’ పోటీలు నిర్వహిస్తున్నాం. సర్టిఫికెట్ ట్రెయిన్డ్ ట్రెయినర్స్గా ఈ పోటీలను తొలిసారిగా చేపట్టాం. ఫిట్నెస్, హెల్త్‌పై ఇన్స్ట్రక్టర్స్ అవగాహన కల్పిస్తారు. – క్రాంతికిరణ్‌రావు, క్రాన్ఫిట్నెస్అధినేత, సీపీటీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవీ కేటగిరీలు.. బాడీ బిల్డింగ్ పోటీల్లో ‘బాడీ బిల్డింగ్, క్లాసిక్ బాడీబిల్డింగ్, మాస్టర్స్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్, మెన్స్ ఫిట్నెస్ మోడల్, ఫిజికల్లీ చాలెంజ్డ్, ఉమెన్ ఫిట్నెస్ మోడల్’ వంటి కేటగిరీల్లో పోటీలు ఉంటాయి. పాల్గొనదల్చినవారు నేరుగా అదే రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. -
మేకర్ ఫెయిర్
-
26న హైదరాబాద్ హైటెక్స్‌లో డా. ఖాదర్ సదస్సులు
అటవీ కృషి, సిరిధాన్యాల సాగు– సిరిధాన్యాల ఆహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై అటవీ కృషి, ఆరోగ్య, ఆహార నిపుణులు డా. ఖాదర్ వలి ఈ నెల 26న అనేక సదస్సుల్లో ప్రసంగించనున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘సేంద్రియ ఉత్పత్తులు–చిరుధాన్యాలు– సంప్రదాయ వైద్య రీతులు’ పేరిట ఏర్పాటయ్యే మూడు రోజుల ఎగ్జిబిషన్లో భాగంగా ఈనెల 26 (ఆదివారం)న ఉ. 10 గం.–మ.12, మ.1 గం.–4 గం. మధ్య జరిగే సదస్సుల్లో డాక్టర్ ఖాదర్ ప్రసంగిస్తారని నిర్వాహకురాలు మాధవి తెలిపారు. రైతులు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఈ ఉచిత సదస్సులకు అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 89782 45673, 81066 44699. ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ ఆంగ్ల పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. 28న హైదరాబాద్ సరూర్‌నగర్‌లో డా. ఖాదర్ సదస్సు హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని కొత్తపేట బాబూ జగ్జీవన్‌రాం భవన్లో ఈ నెల 28(మంగళవారం)న మ. 3 గం. నుంచి రా. 7 గం. వరకు ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం– అటవీ కృషి ఆవశ్యకత’పై జరిగే సదస్సులో ప్రముఖ అటవీ కృషి, ఆహార, ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌వలీ ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 040–23395979 -
హైదరాబాద్‌లో 6వ క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభం
-
హైటెక్స్‌లో ‘5కే ఫన్ రన్’
-
హైటెక్స్‌లో ‘5కే ఫన్ రన్’
హైదరాబాద్: నగరంలోని హైటెక్స్‌లో శనివారం ఉదయం నిర్వహించిన ‘5కే ఫన్ రన్’ ఔత్సాహికులను విశేషంగా ఆకట్టుకుంది. ఆదివారం పీపుల్స్ ప్లాజా వద్ద జరగనున్న ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్-2017 కార్యక్రమానికి సన్నాహకంగా నిర్వహించిన ఈ ఫన్ రన్‌ను ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. హైటెక్స్ నుంచి నోవాటెల్ వరకు సాగిన ఈ రన్లో సుమారు 6 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఆదివారం ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ ఆధ్వర్యంలో వరుసగా ఏడోసారి ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్లు నిర్వహంచనున్నారు. ఆరోగ్యం-పరుగు ప్రాముఖ్యతను చాటుతూ సాగే ఈ మారథాన్‌లో నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు వెల్లడించారు. -
ట్రావెల్ టూరిజం ఫేర్‌ను ప్రారంభించిన చందులాల్
మాదాపూర్: రాష్ట్రంలో పర్యాటక రంగం 25 శాతం అభివృద్ధి చెందిందని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ట్రావెల్ టూరిజం ఫేర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అజ్మీరా చందులాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కట్టడాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. అలాగే సందర్శకులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ టూరిజం ఫేరులో 182 ఎగ్జిబిటర్లతో స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఫేర్‌లో బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్‌లో 20 శాతం, ట్రాన్స్‌పోర్టులో 10 శాతంలతో పాటు వివిధ విభాగాల్లో ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగనుంది. -
హైటెక్స్ తరహాలో మరో కన్వెన్షన్ సెంటర్
హైదరాబాద్: హైదరాబాద్‌లో హైటెక్స్ తరహా మరో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రోడ్డు భవనాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సోమవారం సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సీఎం, స్పీకర్, మండలి చైర్మన్, సీఎస్‌లకు అధునాతన నివాసాలు నిర్మించడంతో పాటు ఏడాదిలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్మించాలని ఆదేశించారు. ఈ నిర్ణయాలను ఖరారు చేసేందుకు ఆయన సీఎస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించారు. అన్ని స్ధాయిల్లో రోడ్ల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాల్లో ఒకటని కేసీఆర్ చెప్పారు. నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసే కాంట్రాక్టు సంస్థలకు 1.5 శాతం ఇన్సెంటివ్ ఇస్తామని తెలిపారు. -
'అనవసర ఔషధాలకు చెక్ పెట్టండి'
సాక్షి, హైదరాబాద్: పిల్లల ఆరోగ్యానికి చేటు తెచ్చే అనవసర మందులకు అడ్డుకట్ట వేయాలని పెడికాన్-2016 పిలుపునిచ్చింది. పిల్లల వైద్య సంరక్షణే లక్ష్యంగా 15వ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్, 53వ పెడికాన్ 2016, 5వ ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ నర్సింగ్ల సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు హైటెక్స్‌లో ఆదివారం ముగిసింది. ఈ వివరాలను నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అనవసర మందులకు అడ్డుకట్ట వేయడానికి పాలకులు చేయూతనివ్వాలని సదస్సు విజ్ఞప్తి చేసింది. శిశుమరణాలు అంతకంతకూ పెరిగిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసింది. పిల్లలకు జరిగే హానికర చికిత్స ప్రపంచానికి చేటు అని పేర్కొంది. పిల్లల వైద్య నిపుణులు తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోకపోతే.. భావి పౌరులైన బాలలు అభివృద్ధికి ఆటంకంగా మారగలరని పేర్కొంది. దీన్ని సామాజిక కోణంలో పరిగణించి పాలకులు అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని సదస్సు అభిప్రాయపడింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకొని పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉందని సదస్సు అభిప్రాయపడింది. కేవలం పిల్లల వైద్యులతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడే ఈ లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొంది. ప్రభుత్వం సూచించిన వ్యాక్సిన్లను తప్పనిసరిగా తీసుకోవాలని సదస్సు కోరింది. ఆలస్యంగానైనా వాటిని తీసుకోవడం మరువొద్దని సూచించింది. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ అంశాల మీద 700 మంది వైద్యులు తమ అనుభవాలను వెల్లడించారు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకావడంతో చర్చ ఫలప్రదమైందని సదస్సు స్పష్టంచేసింది. 30 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు. పిల్లల వైద్య సంరక్షణ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జుల్కిఫ్లీ ఇస్మాయిల్, ఇండియా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) అధ్యక్షుడు ప్రమోద్ జోగ్, పెడికాన్ నిర్వాహకులు డాక్టర్ రంగయ్య, డాక్టర్ అజయ్‌కుమార్, డాక్టర్ నిర్మల, డాక్టర్ హిమబిందు సింగ్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రవికుమార్, జగదీశ్చంద్ర, డాక్టర్ రమేష్ ధంపూరి తదితరులు పాల్గొన్నారు. -
హైటెక్స్‌లో మెడికల్ ఎక్స్పో ప్రారంభం
మాదాపూర్ : మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం 5వ ఇండియా మెడికల్ ఎక్స్పో-2015 అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. వైద్య, ఆరోగ్య రంగంలో ఉపయోగించే అత్యాధునిక పరికరాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ల్యాబ్స్, హాస్పిటల్స్‌లలో ఉపయోగించే అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 250 కంపెనీలకు చెందిన 5000 మెడికల్, సర్జికల్, మెడికల్ టెక్నాలజీ ఉత్పత్తులు ప్రదర్శనలో కొలువు దీరాయి. తైవాన్, మలేషియా, కొరియా, చైనా, హాంగ్‌కాంగ్ కు చెందిన కంపెనీల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శన ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. -
సాక్షి'లివ్ వెల్ ఎక్స్పో'ను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్: అందరికీ ఆరోగ్యం అంశంపై అవగాహన కల్పించేందుకు సాక్షి 'లివ్ వెల్ ఎక్స్పో' కార్యక్రమాన్ని చేపట్టింది. రెండురోజులపాటూ కొనసాగే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి శనివారం హైటెక్స్‌లో ప్రారంభించారు. ప్రపంచాన్ని ఇప్పుడు జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు శాసిస్తున్నాయి. వాటి నివారణ కూడా జీవనశైలిని మార్పుచేసుకోవడం అనే ప్రక్రియ ద్వారా మన చేతుల్లోనే ఉంది. శని, ఆదివారాల్లో జరిగే 'సాక్షి లివ్ వెల్ ఎక్స్పో'లో మంచి ఆరోగ్యకరమైన జీవనం కోసం అవలంబించాల్సిన విధానాలు, పోషకాలతో కూడిన ఆహారాలు, వాటివల్ల ఒనగూడే ప్రయోజనాలు, ఒత్తిడిని తొలగించుకునే మార్గాలు, సరదగా శ్రమ తెలియకుండా తేలికగా చేయగల వ్యాయామాలు, యోగభోగాలను సాధించేందుకు దారులు, మనల్ని మనం ఉత్తేజితం చేసుకుంటూ స్వయం ప్రేరణ పొందేందుకు ఉన్న మార్గాల వంటి అనేక అంశాలపై ఆయా రంగాలకు చెందిన అత్యున్నత స్థాయి నిపుణులు మాట్లాడతారు. -
స్పెషల్ ఎడిషన్ : పుడ్ బజార్ పార్ట్-1
-
స్పెషల్ ఎడిషన్ : పుడ్ బజార్ పార్ట్-2
-
హైటెక్స్‌లో ఫుడ్‌బజార్ ప్రారంభం
-
పుడ్బజార్ను ప్రారంభించిన కేటీఆర్
-
హైటెక్స్‌లో టీఎస్ఆర్ మనవడి వివాహ వేడుక
-
హైటెక్స్‌లో చిన్నారుల్ని అలరిస్తోన్న కిడ్స్‌ఫెయిర్
-
సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడి వివాహ వేడుక
-
మెట్రో'త్సాహం..
-
'ఆన్లైన్ లో ప్రాజెక్ట్‌లకు అనుమతులు'
హైదరాబాద్: రియల్ఎస్టేట్ రంగానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆన్లైన్ పద్దతిలో ప్రాజెక్ట్‌లకు అనుమతులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. రియాల్టీ ప్రాజెక్ట్‌లకు, విమాన సంస్థ అనుమతులు హైదరాబాద్‌లోనే మంజూరు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. మూడు రోజుల పాటు జరగనున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోలో రియార్టీ సంస్థలు పాల్గొంటున్నాయి.


