breaking news
Jito
-
ప్రపంచ ఫ్యాక్టరీగా భారత్
సాక్షి, హైదరాబాద్: బొమ్మల నుంచి యుద్ధ ట్యాంకుల వరకు అన్నీ భారత్‌లోనే తయారవుతున్నాయని, మన దేశం ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైన ‘జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) కనెక్ట్ 2025’మూడు రోజుల సదస్సును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో జైన సముదాయ వాటా అసాధారణమన్నారు.దేశ జనాభాలో జైన సముదాయం కేవలం 0.5 శాతం ఉన్నా, మొత్తం పన్ను సేకరణలో వారి సహకారం 24 శాతంగా ఉందని చెప్పారు. కఠిన శ్రమ, సంపన్నతకు ప్రపంచవ్యాప్తంగా జైన సమాజం గుర్తింపు పొందిందని ప్రశంసించారు. జైన సముదాయ తాత్వికత భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయి ఉందని, దాని చరిత్ర భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రయాణంలో అమూల్యమైన పాఠమని పేర్కొన్నారు. ఫార్మా, ఏవియేషన్, విద్యా రంగాల్లో జైన సముదాయం ముందంజలో ఉందని తెలిపారు. ‘పురాతన తీర్థంకరుల నుంచి ఆధునిక కాల నాయకుల వరకు, జైన సిద్ధాంతం భారతదేశ నైతిక, ధార్మిక ఆకృతిని రూపొందించింది. జైన సముదాయ ముద్ర ప్రతిచోటావిలువలతో కూడిన వృద్ధికి చిరునామా: శ్రీధర్బాబుతెలంగాణ విలువలతో కూడిన వృద్ధికి చిరునామాగా నిలుస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందని చెప్పారు.జైన సమాజం సేవా స్ఫూర్తిని, తెలంగాణలో ఆవిష్కరణల వాతావరణంతో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతం అవుతుందని చెప్పారు.రెండేళ్లకో మారు రొటేషన్ ప్రాతిపదికన జరిగే జిటో సదస్సు ఈసారి హైదరాబాద్‌లో జరుగుతుండగా, ప్రపంచ నలుమూలల నుంచి 50 వేలకుపైగా ప్రతినిధులు హాజరవుతారని నిర్వా హకులు తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, యోగాగురువు రాందేవ్ బాబా, జిటో హైదరాబాద్ చాప్టర్ ప్రతినిధులు రోహిత్ కొఠారి, లలిత్ చోప్రా, విశాల్ అంచాలియా, జిటో కన్వీనర్ బీఎల్ భండారీ, సుశీల్ తదితరులు పాల్గొన్నారు. కాగా జిటో సదస్సుకు వచ్చిన రాజ్‌నాథ్ సింగ్‌కు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఉన్నారు. -
అక్టోబర్ 3 నుంచి హెచ్ఐసీసీలో జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్
జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జిటో) ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హెచ్ఐసీసీ హైటెక్స్‌లో జిటో కనెక్ట్–2025 ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు జీటో కనెక్ట్ చైర్మన్ రోహిత్ కొఠారి వెల్లడించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తాజ్ దక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జీటో కమిటీ సభ్యులతో కలిసి కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ది పవర్ ఆఫ్ వన్ అనే థీమ్‌తో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో పలువురు వ్యాపారవేత్తలతో పాటు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ ప్రముఖులు, ఆర్ధిక నిపుణులు, సినీ క్రీడా రంగ ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ జీటో కనెక్ట్ ప్రారంభోత్సవానికి కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు స్మతి ఇరాని, యోగా గురువు రాందేవ్ బాబా, ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్, క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, టెక్ దిగ్గజం జోహా స్థాపకుడు శ్రీధర్ వెంబు కూడా హజారవుతారని వెల్లడించారు. ఈ మహాసభలో 600లకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని సుమారు 2 లక్షల మందికి పైగా సందర్శకులు పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరి లలిత్ చొప్రా, కన్వీనర్ బిఎల్ భండారి, కో–కన్వీనర్ సుశీల్ సాంచెట్, డైరెక్టర్ గౌతమ్, ట్రెజరర్ విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
మహీంద్రా మినీ ట్రక్ ‘జీతో’
♦ 8 రకాల వేరియంట్లలో తయారీ ♦ ధర రూ.2.32-2.77 లక్షలు ♦ జహీరాబాద్ ప్లాంటులో అభివృద్ధి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో/సంగారెడ్డి టౌన్ : వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ‘జీతో’ పేరుతో చిన్న ట్రక్‌ను మెదక్ జిల్లా జహీరాబాద్ ప్లాంటులో మంగళవారం ఆవిష్కరించింది. ఎం-డ్యూరా డీజిల్ ఇంజన్‌ను దీనికి పొందుపరిచారు. 600, 700 కిలోల బరువు మోయగల సామర్థ్యం ఉంది. మొత్తం 8 రకాల వేరియంట్లను రూపొందించారు. ఇన్ని వేరియంట్లతో భారత్‌లో వచ్చిన చిన్న వాణిజ్య వాహనం ఇదే. కావాల్సిన రీతిలో బాడీని మలిచే వీలుండడం ప్రత్యేకత. మైలేజీ లీటరుకు 27.8-37.6 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. వేరియంట్‌ని బట్టి ధర తెలంగాణలోని ఎక్స్‌షోరూంలో రూ.2.32 లక్షల నుంచి రూ.2.77 లక్షల వరకు ఉంది. జహీరాబాద్ ప్లాంటు విస్తరణకు కంపెనీ రూ.250 కోట్లు వెచ్చించింది. జీతో అభివృద్ధికి రూ.50 కోట్లు ఖర్చు చేశారు. ప్లాంటులో ఏటా 1.5 లక్షల యూనిట్ల వరకు జీతో మోడళ్లను తయారు చేసే వీలుంది. బీఎస్ 3, బీఎస్ 4 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్యాసింజర్ వెహికిల్ కూడా.. జీతో ప్లాట్‌ఫామ్‌పై ప్యాసింజర్ వాహనాన్ని ఏడాదిలో ప్రవేశపెడతామని మహీంద్రా ఈడీ పవన్ గోయెంకా వెల్లడించారు. కంపెనీ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ ప్రవీణ్ షాతో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చిన్న వాణిజ్య వాహన రంగంలో జీతో సంచలనం సృష్టిస్తుందన్నారు. అయిదేళ్ల తర్వాత కొత్త ప్లాట్‌ఫాంపై వచ్చిన వాహనం జీతో అని తెలిపారు. ఏటా ఒక కొత్త ట్రాక్టర్ మోడల్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు. ఈ ఏడాదే ఏడు కొత్త ప్లాట్‌ఫామ్స్ ఆవిష్కరిస్తామన్నారు. ‘చిన్న వాణిజ్య వాహనాల విపణిలో ఈ ఏడాది 5-7 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. మొత్తంగా వాహన పరిశ్రమలో తిరోగమన వృద్ధి కాలం పూర్తి అయింది. ఇక పరిశ్రమ వృద్ధి బాటన పడుతుంది. దేశీయంగా పెట్టుబడి సెంటిమెంటు బలపడుతోంది. అటు రుతుపవనాలు సైతం అనుకూలంగా ఉంటాయి’ అని తెలిపారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లకు జీతో వాహనాలను కంపెనీ ఎగుమతి చేయనుంది.