హైదరాబాద్: హైడ్రాలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు భారీగా తరలి రావడంలో సరూర్ నగర్ స్టేడియం శనివారం కిక్కిరిసిపోయింది. హైడ్రాలో 150 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారని తెలిసి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టులకు ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ ఉంటాయన్న హైడ్రా ప్రకటనతో సరూర్‌నగర్ స్టేడియానికి నిరుద్యోగులు పోటెత్తారు. వీరిని నియంత్రించడం పోలీసులకు సవాల్‌గా మారింది. అభ్యర్థులు దూసుకురావడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?: హరీశ్‌రావు
హైడ్రాలో ఉద్యోగాల కోసం వచ్చిన వారికి సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించారని, ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించడం నేర్చుకోవాలంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఏకంగా విద్యార్థులపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ''మీ పాలనలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో నిరాశ పెరుగుతోంది. నోటిఫికేషన్లు సక్రమంగా రాకపోవడంతో పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్య చదివిన యువత కూడా చిన్నచిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం'' అంటూ దుయ్యబట్టారు.
పాపం! డాక్టర్ ప్రియాంక.. ఇంత దారుణమా?
విద్యార్థులు, నిరుద్యోగులు అంటే మీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి?
అధికారం కోసం ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నారు. ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వారి పట్ల ఇంత కర్కశంగా… pic.twitter.com/pqY61bPPsI— Harish Rao Thanneeru (@BRSHarish) August 8, 2026


