breaking news
HYDRAA
-
హైడ్రా సేవలు ఆగిపోలేదు: కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్, సాక్షి: హైడ్రా (Hyderabad Disaster Response and Action) కంట్రోల్ రూమ్ సేవలు బంద్ అయ్యాయన్న కథనాలపై కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా విధులు ఎక్కడా ఆగలేదని.. ప్రజా వాణి యధాతథంగా కొనసాగుతోందని సోమవారం మధ్యాహ్నాం స్పష్టం చేశారాయన. ఈ ఉదయం.. జీతాలు తగ్గించడంతో మార్షల్స్ విధులు బహిష్కరించారన్నది తెలిసిందే. ఆపై బైక్ ర్యాలీ చేపట్టారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో వీళ్లు అందించే ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే హైడ్రా వర్షాకాల సేవలపై ప్రభావం పడుతుందని అంతా భావించారు. ఈలోపు.. సేవలేం ఆగిపోలేదని హైడ్రా ప్రకటించడం గమనార్హం.హైదరాబాద్ నగరంలో వర్షాకాలం నేపథ్యంలో HYDRA యంత్రాంగం మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు రంగంలోకి దిగి సేవలు ప్రారంభించింది. ఈ సేవల్లో మార్షల్స్, DRF బృందాలు, ట్రాఫిక్ సపోర్ట్ టీమ్‌లు, క్లీన్-అప్ సిబ్బంది భాగంగా ఉన్నారు. మొత్తం 150 డివిజన్లలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు (METs): ఒక్కో టీమ్‌లో 4 మంది, మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.ఇందులో డీఆర్ఎఫ్ బృందాలు 51 టీమ్‌లు ఉండగా.. మొత్తం 918 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే.. స్టాటిక్ బృందాలు 368 ఉండగా.. నీటి నిలయాల వద్ద 734 మంది ఉన్నారు. 21 బైకులతో ఎమర్జెన్సీ బైక్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భధ్రత, సమన్వయం కోసం మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. వీళ్లలో మాజీ సైనికులే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా.. మాన్పవర్ 4,100 మంది ఉన్నారు. వానా కాలంలో నీరు తొలగించేందుకు పంపులు, చెట్ల కట్ మిషిన్లు, క్లీన్-అప్ టూల్స్ వీళ్లకు అందిస్తున్నారు. ప్రతి బృందానికి ఒక్కరోజులోనే సత్వర శిక్షణ ఇప్పించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ సమన్వయంతో ఈ సిబ్బంది సేవలు అందిస్తూ వస్తున్నారు. -
జీహెచ్ఎంసీ– హైడ్రా మధ్య కనిపించని ఐక్యత
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత నాలుగు రోజులుగా వానలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో కోటిమందికి పైగా ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు ఐక్యంగా సమన్వయంతో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలతో పనులు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వర్షంలో ఎక్కడ ఏ గుంత ఉందో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక, తప్పనిసరి ప్రయాణాలు చేయాల్సిన వారు వణికిపోతున్నారు.తమవైపు నుంచి చేయాల్సిన పనులు చేస్తున్నామని జీహెచ్ఎంసీ (GHMC) ఇంజినీర్లు చెబుతున్నారు. తాము హైడ్రాకు సహకరిస్తున్నప్పటికీ, వారి నుంచి ఉండాల్సిన స్పందన ఉండటం లేదని ఆరోపించారు. హైడ్రా అధికారులకు నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయో, అక్కడి నుంచి వాన నీరు ఏ నాలాలోకి వెళ్తుందో వారికి ఎన్నో పర్యాయాలు తెలియజేశామన్నారు. నగరంలో ప్రస్తుతమున్న 141 వాటర్‌లాగింగ్ ప్రాంతాల వివరాలు తెలిపామని చెప్పారు.గత శనివారం జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు కూడా హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారని, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జోనల్ కమిషనర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్ల సమావేశంలో సైతం హైడ్రా అధికారులు తగిన విధంగా స్పందించాల్సిందిగా కోరినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలతో పాటు క్యాచ్పిట్ల వద్ద, ఫుట్‌పాత్‌ల పక్కన పేరుకుపోయే సిల్ట్‌ను తొలగించాల్సి ఉండగా, ఆ పనులు జరగడం లేదని కొందరు ఈఈలు ఆరోపించారు. సిల్ట్ తొలగించకపోవడంతో క్యాచ్పిట్లలోకి నీరు వెళ్లక రోడ్లు చెరువులయ్యే ప్రమాదం ఉందన్నారు. వర్షం వెలిసిన సమయాల్లో ఈ పనులు చేయాల్సి ఉన్నప్పటికీ, అవి జరగడం లేదని ఆరోపించారు. హైడ్రా చేయాల్సిన పనులు జూన్ 9వ తేదీన జారీ అయిన మెమో ప్రకారం హైడ్రా (HYDRAA) ఏమేం పనులు చేయాలో స్పష్టంగా తెలిపారని, ఆ మేరకు మాన్సూన్ ఎమర్జెన్సీ పనుల్లో భాగంగా దిగువ పనులు చేయాల్సి ఉందని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు పేర్కొన్నారు. u క్యాచ్పిట్ల మూతలపై పేరుకుపోయిన చెత్తాచెదారాలు తొలగించాలి. u అవసరాన్ని బట్టి ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు చేపట్టాలి. u నాలా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. u వర్షాలు వెలిశాక నాలాల్లో పూడికతీత పనులు చేయాలి. u రోడ్లపై ఉండే పూడిక తొలగించాలి. u వరదనీరు నాలాల్లోకి సాఫీగా వెళ్లేందుకు ఏవైనా ఆటంకాలుంటే తొలగించాలి. u రోడ్లపై పడే విద్యుత్‌స్తంభాలు, చెట్టకొమ్మలు తొలగించాలి.గతంలో వానాకాలంలో అత్యవసర పనులు చేసేందుకు జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ (ఎంఈటీ)ను నియమించేది. వాటికి సంబంధించి అక్రమాలకు తెరలేపారని గుర్తించిన ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఈ సంవత్సరం పిలిచిన టెండర్లను రద్దు చేయడంతో పాటు, వానాకాల సమస్యల పరిష్కార బాధ్యతల్ని హైడ్రాకు బదలాయించింది. హైడ్రాతో సమన్వయంతో పనిచేయాలని, తగిన సహకారం అందించాలని జీహెచ్ఎంసీతోపాటు ఇతరత్రా విభాగాలకు కూడా సూచించినట్లు సమాచారం. చదవండి: ఒక్క వానకే.. కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై వరద! -
ఒక్క వానకే.. కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై వరద!
ఫ్లై ఓవర్‌పై వరద నీరు చేరడం కనీవినీ ఎరగం... కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ఫ్లైఓవర్‌పై భారీగా వరద చేరడంతో వాహనదారులు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.. ఫ్లై ఓవర్ కింద ఉన్న అండర్ పాస్ నీట మునగడం, మరో వైపు కొత్తగూడ జంక్షన్లో భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులకు దిక్కుతోచలేదు. హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్లై ఓవర్, అండర్ పాస్, జంక్షన్ నీట మునగడం చర్చనీయాంశంగా మారింది. దీనికి హైడ్రా మాన్సూన్, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు బాధ్యత వహించాల్సిందేనని వాహనదారులు పేర్కొంటున్నారు.. మ్యాన్‌హోల్స్ కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ నేతృత్వంలో పని చేస్తున్న మాన్సూన్ బృందాలు, శేరిలింగంపల్లి సర్కిల్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. జోనల్ కమిషనర్ అన్ని విభాగాల అధికారులతో వరద పరిస్థితులపై సమన్వయ సమావేశం నిర్వహించినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేయకపోవడంతో భారీగా వరద నీరు (Flood Water) చేరినట్లు స్పష్టమవుతోంది. ఫ్లై ఓవర్ పైన, అండర్ పాస్, జంక్షన్లో వాహనాల రాకపోకలు ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలో మీటరు ప్రయాణానికి దాదాపు 45 నిమిషాలకు పైగా పట్టిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదారిని తలపించిన ఫ్లై ఓవర్...అంజయ్యనగర్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ వరకు ఉన్న ఫ్లై ఓవర్ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై భారీగా వరద నీరు చేరింది. ప్రతి ఫ్లై ఓవర్‌పై వర్షం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వరద నీరు వెళ్లేలా ప్రతి 20 అడుగులకు ఓ రద్రం, కిందికి ఓ పైపును అమర్చుతారు. ఎంత భారీ వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని నిర్వహణ లేకపోవడంతో చెత్త, ప్లాస్టిక్ కాగితాలతో నిండి పోయాయి. దాదాపుగా అన్ని రంద్రాలు నిండటంతో వరద నీరు కిందికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో భారీ వర్షానికి ఫ్లై ఓవర్‌పై దాదాపు మూడు అడుగుల లోతు నీరు చేరింది. రాకపోకలకు వీలు లేకుండా మారడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.మోటార్లు కాలిపోవడంతో నీట మునిగిన అండర్ పాస్.. వరద నీటిని పరిగణలోకి తీసుకోకుండా సరైనా ప్లాన్ లేకుండా కొత్తగూడ జంక్షన్లో అండర్ పాస్‌ను ఏర్పాటు చేశారు. భారీ వర్షం వచ్చినప్పుడు వరద నీటితో నిండి పోవడం, వాహనాల రాకపోకలు స్తంభించడం జరుగుతూనే ఉంది. దీంతో అధికారులు కరెంట్ మోటార్లు బిగించి వచ్చిన వరద వచ్చినట్లే బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం భారీ వర్షానికి వరద నీరు చేరింది. మోటార్లు కాలిపోవడంతో వరదను తొలగించే పరిస్థితి లేకపోవడంతో అండర్ పాస్ పూర్తిగా నిండిపోయింది. డీజిల్ ఇంజన్లతో రాత్రంతా వరద నీటిని తోడారు. వరద నీటి తొలగింపు పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జంక్షన్ జామ్.. కొత్తగూడ జంక్షన్‌తో పాటు మియాపూర్ రోడ్డులో భారీగా వరద నీరు చేరింది. హర్ష టయోటా ముందు వరద పోటెత్తడంతో మియాపూర్ నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శుక్రవారం రాత్రి హైడ్రా మాన్సూన్ టీం వరదను తొలగించే ప్రయత్నాలు చేసినా గంటల తరబడి వాహనదారులు వరదనీటిలోనే ఉన్నారు. గచ్చిబౌలి నుంచి మియాపూర్, మాదాపూర్ వైపు, మాదాపూర్ నుంచి మియాపూర్ వైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.చదవండి: అమెరికా వెళ్లి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా.. -
మానవతా దృక్పథంతోనే చర్యలకు వెనుకడుగు
సాక్షి, హైదరాబాద్: ఫాతిమా కాలేజీ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. ఆ కళాశాల సూరం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న మాట వాస్తవమే అయినా, వేల మంది మైనార్టీ విద్యారి్థనుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే చర్యలకు వెనుకాడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజ్ అనేది అక్బరుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీ సంస్థ. నిరుపేద మైనార్టీ బాలికలు, యువతులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. కొన్ని కోర్సులకు మాత్రం నామమాత్రపు ఫీజు ఉంది. ఈ కాలేజీలో ఏటా 10 వేల మందికి పైగా విద్యనభ్యసిస్తుంటారు. నిరుపేద మైనార్టీ యువతులకు విద్యనందించడం ద్వారా ఈ కాలేజీ సామాజిక వెనుకబాటుతనం నుంచి వారికి విముక్తి కల్పించడానికి ప్రయత్నిస్తోంది. హైడ్రా ఎంఐఎం పట్ల ఉద్దేశపూర్వకంగా మెతకవైఖరిని అవలంబిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు చేసిన కొన్ని ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల పట్ల హైడ్రా కఠినంగా వ్యవహరించిందింది. గత ఏడాది ఆగస్టు 8న హైడ్రా చేపట్టిన మొదటి కూల్చివేత బమ్ రుక్ ఉద్ దౌలా చెరువులోని భవనాలే. ఇవి ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినవే. 25 ఎకరాల చెరువును ప్లాట్లుగా మార్చిన కింగ్స్ గ్రూపు విక్రయిస్తోంది. ఈ గ్రూపు యజమాని ఒవైసీ కుటుంబానికి చాలా కీలకమైన వ్యాపార భాగస్వామి. హైడ్రా ఇప్పుడు ఆ చెరువును అభివృద్ధి చేస్తోంది. చాంద్రాయణగుట్టలోని ప్రభుత్వ భూమిలో ఉన్న ఎంఐఎం కార్పొరేటర్లకు చెందిన అనేక వాణిజ్య దుకాణాలను తొలగించి ఆ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా ఎవరి పట్లా మెతక వైఖరిని అవలంబించదు. సామాజిక కారణాల వల్ల మాత్రమే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేసింది. అన్నింటికీ ఒకే మంత్రం అనే తీరుతో ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తే అది సామాజిక, దేశ పురోగతికి గొడ్డలి పెట్టవుతుంది’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
బతుకమ్మకుంటకు జీవం పోసిన హైడ్రా.. నాడు అలా.. నేడు ఇలా (ఫొటోలు)
-
అక్కడ ఏ ఒక్క ఇంటి జోలికి వెళ్లలేదు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
‘హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందని’ కమిషనర్ ఏవీ రంగనాథ్ పునరుద్ఘాటించారు. హైడ్రా విజన్ అండ్ ఎజెండా అనే అంశంపై ‘ఎక్స్’ వేదికగా ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఏర్పాటు చేసిన ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం వర్చువల్‌గా పాల్గొన్నారు. దేశ–విదేశాల నుంచి అనేక మంది అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రంగనాథ్ వెల్లడించిన అంశాల్లో కీలకమైనవి ఇలా... 👉హైడ్రాకు 169 పోస్టులు శాంక్షన్ చేయగా ప్రస్తుతం 45 మంది సిబ్బందే ఉన్నారు. వీరికి అదనంగా రెండు వేల మంది ఔట్ సోర్సింగ్ వాళ్లు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు 20 వేల దాటాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం సిబ్బందిని పెంచడంపై దృష్టి పెట్టింది. 👉రానున్న రోజుల్లో హైడ్రా ప్రభావం ప్రజల్లోకి బలంగా వెళుతుంది. ఇప్పటికే ప్రజలు మాపై నమ్మకం పెంచుకుంటున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి ఫిర్యాదుదారులు తెల్లవారుజాము నుంచే ఎదురుచూస్తుండటమే దీనికి నిదర్శనం. బాధితుల కోసం త్వరలోనే ప్రభుత్వం ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. 👉నిజాంపేటలో దాదాపు కిలోమీటరు పరిధిలో రోడ్డు పక్కన ఇళ్లు వేసుకున్న కొందరు ఇంటి ముందు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దీని వల్ల 30 అడుగుల రోడ్డు 10 నుంచి 15 అడుగులకు తగ్గిపోయింది. ఫలితంగా దాదాపు పది కాలనీలకు చెందిన వాళ్లు రాకపోకల కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా కాలంగా ఆ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాటిని తొలగించాం. 👉హైడ్రా ఏర్పాటైన తర్వాత ఏడాదిలో ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పించగలిగాం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, చెరువుల్లో భూములు ఉన్నట్లు అనుమానిస్తే వాళ్లు సరిచూసుకుంటున్నారు. కొనేవాళ్లు లేకపోతే అమ్మే వాళ్లు, ఆక్రమించే వాళ్లు తగ్గిపోతారు. కొన్నిసార్లు కిందిస్థాయి వాళ్లు చేసిన చిన్నచిన్న పొరపాట్లను భూతద్దంలో చూపిస్తూ వ్యవస్థ పైన బురదజల్లే ప్రయత్నాలు జరిగాయి. మూసీలో జరిగే కూలి్చవేతల్నీ హైడ్రాకు ఆపాదించారు. 👉నగరంలో నీళ్లు నిలిచే ప్రాంతాల్లో చెరువుల చుట్టూ ఉన్నవి ఎక్కువగా ఉంటున్నాయి. ఇన్లెట్ నాలాలు పూడ్చివేయడమే దీనికి కారణం. ఫలితంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. సాంకేతికంగా నగరంలో ఉన్న అన్ని చెరువుల పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నాం. ప్రతి దానికీ పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నాం. 👉ఎన్నారైలు ఎవరైనా ఇక్కడ భూమిపై పెట్టుబడులు పెట్టాలని భావిస్తే హెచ్ఎండీఏ వెబ్సైట్ ద్వారా ఎఫ్టీఎల్, బఫర్లు ప్రస్తుతం తెలుసుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ఈ అంశాలను సాధారణ భాషలో అందుబాటులోకి తీసుకువచ్చారు. హైడ్రా కూడా ఆయా చెరువుల ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ కోసం ప్రయత్నిస్తోంది. దీనికోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో కలిసి పని చేస్తున్నాం. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ల్ని క్రోడీకరించి, శాటిలైట్ డేటాతో పాటు 2006 నాటి మ్యాప్‌లు సేకరించి ‘3డీ’ మోడల్లో తయారు చేస్తున్నాం. ఇది 15 సెంటీమీటర్ల రిజల్యూషన్‌లో అందుబాటులోకి వస్తుంది. 👉ప్రస్తుతం నగరంలో ఆరు చెరువులను పునరుద్ధరించనున్నాం. వీటిలో ఉన్న ఏ ఒక్క ఇంటి జోలికి వెళ్లలేదు. వాణిజ్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన షెడ్డులు మాత్రమే తొలగిస్తున్నాం. ఇటీవల సున్నం చెరువులోనూ అక్రమ బోర్ల పైనే చర్యలు తీసుకున్నాం. 👉హైడ్రా ఏర్పాటుకు ముందు నాటి కట్టడాల్లో నివాసాల జోలికి వెళ్లం. ఇవి అనుమతి తీసుకుని కట్టినా.. అనుమతి తీసుకోకుండా కట్టినా వాటిని కూల్చం. ఇదే విషయాన్ని పదేపదే స్పష్టం చేస్తున్నాం. చెరువులకు గతంలో ఫెన్సింగ్స్ వేసినా కూలగొట్టి ఆక్రమించారు. ఈ నేపథ్యంలోనే ప్రజ ల్లో అవగాహన కల్పించడానికే ప్రాధాన్యం ఇస్తున్నాం. పార్కుల్లో ఆక్రమణలు తొలగించినప్పుడు ఫెన్సింగ్ వేసి, బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. -
హైడ్రా మరో కీలక నిర్ణయం..
సాక్షి, సిటీబ్యూరో: వరద ముంపును సాధ్యమైనంత వరకు తగ్గించడంపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. వీటిలో భాగంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు (ఎంఈటీ) కల్వర్టుల బాధ్యత అప్పగించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఏర్పాటైన ఈ బృందాలను డిజాస్టర్ రెస్పాన్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సహకరించేలా ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టు విధానంలో 150 బృందాలు.. విపత్తు సమయంలో స్పందించడం, సహాయక చర్యలు అందించడం హైడ్రా అధీనంలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) ప్రధాన విధి. తొలిసారిగా ఎంఈటీల నిర్వహణను సైతం ప్రభుత్వం హైడ్రాకు అప్పగించింది. ఈ నేపథ్యంలో గతానికి భిన్నంగా ముందుకు వెళ్తున్న హైడ్రా అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే కాంట్రాక్టు ప్రాతిపదికన 150 మాన్సూన్ బృందాల ఎంపిక పూర్తి చేశారు. ఒక్కో మాన్సూన్ టీమ్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఒక్కో టీమ్ ఎనిమిది గంటల చొప్పున.. రోజుకు మూడు బృందాలు సిద్ధంగా ఉంటాయి. ఈ బృందాలకు హైడ్రా అదీనంలోని దాదాపు 50 డీఆర్ఎఫ్ జట్లు సహకరిస్తాయి. ఈ ఎంఈటీలను 30 మంది మాజీ సైనికోద్యోగులు పర్యవేక్షిస్తున్నారు.నాలా పరిస్థితి గమనించిన కమిషనర్.. ఈ ఎంఈటీల ఏర్పాటు ప్రతి ఏడాదీ జరుగుతుంటుంది. ఇప్పటి వరకు ఈ బృందాలకు కేవలం వర్షం కురిసినప్పుడు మాత్రమే పని ఉండేది. మిగిలిన సమయంలో నిర్దేశిత ప్రాంతాల్లో వేచి ఉంటుండేవి. మరోపక్క ఇటీవల వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నాలాల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో అవి కబ్జా కావడంతో పాటు కల్వర్టుల వద్ద చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకు పోవడం కూడా నీటి ప్రవాహం తగ్గిపోతోంది. ఈ కారణంగా అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతున్నట్లు గుర్తించారు. కేవలం వర్షం కురిసినప్పుడే కాకుండా ఈ అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగించే బాధ్యతల్ని ఎంఈటీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 940 కల్వర్టుల వద్ద ఎంఈటీల పని తీరును సాంకేతికంగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు.చదవండి: హైదరాబాద్ వెస్ట్ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్టులుఎస్ఎన్డీపీ పనులూ పూర్తయ్యేలా... ఈ ఎంఈటీలు, డీఆర్ఎఫ్ బృందాలు తమ పరిధిలో ఉన్న నాలాలతో ప్రధాన ఇంకుడు కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తుంటాయి. అవసరమైన వాటిలో పూడిక, పైన పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుంటాయి. ఎంఈటీల పని తీరును ప్రతి వారం హైడ్రా కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. వర్షాలు జోరందుకోకుండానే వీలున్నంత వరకు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్డీపీ) పనులు పూర్తయ్యేలా చూడటం పైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానూ శుక్రవారం శేరిలింగంపల్లి జోన్ పరిధిలో కొన్ని కూల్చివేతల్ని చేపట్టింది. నాలా విస్తరణకు అడ్డుగా ఉన్న కొన్ని భవనాలను కూల్చేసింది. ఈ తరహాలో అడ్డుగా ఉన్న ఇతర అక్రమ కట్టడాల వ్యవహారాన్నీ ఆరా తీస్తోంది. వీటిలో వాణిజ్య భవనాలపై తక్షణం చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎంఈటీ, డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం యూసుఫ్‌గూడ, మధురానగర్, కృష్ణానగర్‌లలోని వరద కాలువలో, గచ్చిబౌలిలోని జనార్దన్ రెడ్డి నగర్‌లోని నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాయి. కాప్రా సర్కిల్ వార్డు నెం.2 మార్కండేయ కాలనీలో నాలా క్యాచ్‌పిట్ ఏరియాను శుభ్రం చేశాయి. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో ఆర్సీఐ రోడ్డు, మిథిలానగర్ సమీపంలోని మంత్రాల చెరువు నుంచి జిల్లెలగూడ చెరువుకు వెళ్లే నాలాలోని పూడికను జేసీబీతో తొలగించాయి.03.07.25 గురువారం నగరంలోని పలు ప్రధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాలను పర్యటించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు.#HYDRAA pic.twitter.com/hnl9TCZ5M2— HYDRAA (@Comm_HYDRAA) July 4, 2025 -
హైడ్రాపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
హైడ్రాపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తోందని.. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.హైదరాబాద్, సాక్షి: మాదాపూర్ సున్నం చెరువు దగ్గర హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సోమవారం గరం అయ్యారు. చెరువును బఫర్ జోన్ చేయకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ హైడ్రా అధికారులపై మండిపడ్డారాయన. ‘‘చెరువులు కబ్జాకు గురికాకుండా అభివృద్ధి చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన. కానీ, హైడ్రా తీరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సున్నం చెరువు బఫర్ జోన్ చేయకుండా కూల్చివేతలు చేపట్టారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌ను కలుస్తా’’ అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఇదిలా ఉంటే.. సున్నం చెరువు హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పలువురు ప్రొక్లెయిన్‌కు అడ్డం పడి హైడ్రా డౌన్ డౌన్.. హైడ్రా కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించారు. -
కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా సున్నం చెరువు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని సున్నం చెరువు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అందులోని నీరు మరిగించినా తొలగిపోని కారకాలతో నిండిపోయింది. ఈ చెరువు చుట్టూ అక్రమ బోర్లు వేసిన కొందరు నీటిని తోడి అమ్మేస్తు న్నారు. ఈ నీరు వినియోగిస్తున్న సమీప ప్రాంతాల వాసులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గుర్తించింది. నమూనాలు సేకరించి, కాలుష్య నియంత్రణ మండలితో (పీసీబీ) పరీక్షలు చేయించి మరీ నిర్థారించింది. పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన... సున్నం చెరువు శేరిలింగంపల్లి–కూకట్పల్లి మండలాల సరిహద్దులో ఉన్న గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య 32.60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రస్తుతం కాలుష్య కాసారంలా మారిన ఈ చెరువు సమీపంలోకి వెళ్లినా భరించ లేని దుర్వాసన ఉంటోంది. ఈ ప్రాంతంలో బోర్లు వేసి దరు ఆ నీటిని తాగునీటిగా పేర్కొంటూ ట్యాంకర్ల ద్వారా పరిసరాల్లోని విక్రయిస్తున్నారు. పునరుద్ధరణ చర్యల్లో భాగంగా పరీక్షలు... నగరంలోని తమ్మిడికుంట, బతుకమ్మకుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్లచెరువు, బుమ్రకుద్దీన్ దౌలా చెరువులతో పాటు సున్నం చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. సున్నం చెరువులో మంచి నీరు నిలువ ఉండేలా చేయడానికి దాదాపు రూ.10 కోట్లు వెచ్చిస్తూ అభివృద్ధి చేస్తోంది. ఆ చర్యల్లో భాగంగా హైడ్రా అధికారులు అక్కడి భూగర్భ జలాల నమూనాలు సేకరించి, పీసీబీ ద్వారా పరీక్షలు చేయించింది. తాగునీరుగా ట్యాంకర్లు సరఫరా చేస్తున్న నీటి నమూనాలకూ పరీక్షలు చేయించింది. ఈ నేపథ్యంలోనే ఆ నీటిలో నికెల్, కాడ్మియం. సీసం లోహాల మోతాదు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు బయటపడింది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ లోహాలు ఉండాల్సిన మోతాదులో కాకుండా.. 2 నుంచి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు పీసీబీ నివేదిక రూపొందించింది.ప్రమాదకర స్థాయిలో సీసం... అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక లీటరు నీటిలో సీసం 0.01 మిల్లీ గ్రాముల వరకు ఉండచ్చు. సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో ఇది 0.073 నుంచి 0.122 వరకు ఉన్నట్టు పీసీబీ తేల్చింది. ఇలాంటి నీరు పిల్లల మెదడు చురుకుదనంపై ప్రభావం చూపి, వారి జ్ఞాపిక శక్తిని తగ్గిస్తుందని, రక్తహీనతకు కారణం అవుతుందని హైడ్రా స్పష్టం చేసింది. లీటరు నీటిలో కాడ్మియం 0.003 మిల్లీ గ్రాముల వరకు ఉండచ్చు. సున్నం చెరువు పరిసరాల్లోని బోర్ల నీటిలో ఇది 0.007 నుంచి 0.010 మిల్లీ గ్రాముల వరకు ఉన్నట్టు వెల్లడైంది. ఇలా అధిక మొత్తంలో ఉన్న కాడ్మియం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.చదవండి: బిల్డ్‌నౌతో వేగం పెరిగినా.. తగ్గని పైరవీలు లీటరు నీటిలో 0.02 మిల్లీగ్రాముల వరకు నికెల్ ఉండొచ్చు. ఈ నీటిలో ఇది 0.038 నుంచి 0.046 మిల్లీ గ్రాముల వరకు ఉంది. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. మరగబెట్టినా ఫలితం ఉండదు... సాధారణంగా నీటిని మరగబెట్టి, చల్లార్చి తాగితే అందులో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియాలతో పాటు కొన్ని కాలుష్య కారకాలు పోతాయి. అయితే సున్నం చెరువు చుట్టూ ఉన్న బోర్ల నుంచి వచ్చే నీటిని మరగబెట్టి వినియోగించినా ప్రమాదమే అని వైద్యులు చెప్తున్నారు. మరగటం వల్ల అందులోని సూక్ష్మక్రిములు పోయినా... సీసం, కాడ్మియం, నికెల్ లోహాలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్న హైడ్రా సున్నం చెరువు వద్ద బోర్ల ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించింది. -
సికింద్రాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా కూల్చివేతలు జరిగాయి. శుక్రవారం వేకువజాము నుంచే బేగంపేట ప్యాట్నీ పరిధిలోని నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగించారు. కంట్మోనెంట్ బోర్డు పరిధిలో తొలిసారి హైడ్రా కూల్చివేతలు జరగడం ఇక్కడ విశేషం.హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్ గురువారమే రసూల్‌పురా నాలాను పరిశీలించారు. ఆపై కూల్చివేతలకు వారు ఆదేశించడంతో సిబ్బంది రంగంలోకి దిగారు. హైడ్రా (Hydra) అధికారులు కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి అక్రమ కట్టడాలను కూల్చివేశారు.. తాజా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) మీడియాతో మాట్లాడారు. నగరంలోని నాలాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారాయన. వచ్చే 4 నెలల పాటు ఈ అంశంపైనే దృష్టి పెడుతున్నట్లు, వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను తొలగిస్తామని.. పేదల నిర్మాణాల అంశాన్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ చెప్పారు. హైడ్రా (HYDRA) అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ 🚜💥అనే ప్రత్యేక సంస్థ. ఇది హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం, చెరువులను రక్షించడం, నగరాన్ని వరదల నుంచి కాపాడడం వంటి పనులు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల నుంచి కాపాడేందుకు ఇప్పటికే వందల సంఖ్యలో కట్టడాలను కూల్చేసింది. మరోవైపు ఇది రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది. -
సీఐపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్లాట్లను కబ్జా చేశారని పలువురు బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా కోహెడలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. భూమిలో మారణాయుధాలు చూసి ఆగ్రహానికి లోనయ్యారు.ఈ సందర్భంగా..బాధితులపై దాడి జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సూచించారు. వారికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. బాధితుల నుంచి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తున్నారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.అయితే,ప్రజా వాణిలో కోహెడలో తమ భూమి కబ్జాకు గురైందని, ఫిర్యాదు చేసినా హయత్ నగర్ సీఐ పట్టించుకోవడం లేదంటూ ఏవీ రంగనాథ్ ఎదుట ఏకరవు పెట్టుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఏవీ రంగనాథ్ స్వయంగా వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. -
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పోలీసుస్టేషన్ కార్యకలాపాలకు సంబంధించి కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దురుద్దేశాలతో కూడిన, తప్పుడు ఫిర్యాదులకు చెక్ చెప్పడానికి ప్రాథమిక విచారణ (పీఈ) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఈ విచారణ పూర్తి చేసి, నేరానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాతే హైడ్రా ఠాణాలో కేసు నమోదవుతుంది. ప్రతి ఫిర్యాదును కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి, సిఫార్సు చేసిన తర్వాతే పోలీసుస్టేషన్‌కు చేరుతుంది. హైడ్రా పోలీసుస్టేషన్ డిజిగ్నేటెడ్ కోర్టుకు సంబంధించి న్యాయశాఖ ఉత్తర్వులు జారీ తర్వాత అధికారికంగా పని చేయడం ప్రారంభించనుంది. కొన్ని ఫిర్యాదుల వెనుక అనేక ఉద్దేశాలు..ప్రభుత్వ భూములు, లే అవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పార్కులు, చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలకు సంబంధించిన కేసుల్ని హైడ్రా ఠాణా నమోదు చేయనుంది. వీటితో పాటు నిర్మాణాల కోసం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వంటి వాటిని ధ్వంసం చేసినా పరిగణనలోకి తీసుకుంటోంది. ఇప్పటి వరకు తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ముందుకు వెళ్తున్న హైడ్రా (Hydraa) అధికారులు తీవ్రమైన అంశాలు, నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ వంటివి గుర్తిస్తున్నారు. ఆయా ఆక్రమణల్ని తొలగించడంతో పాటు బాధ్యులపై స్థానిక ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా.. హైడ్రాకు వస్తున్న ఫిర్యాదుల్లో కొన్ని వ్యక్తిగత విభేదాలు, కక్షసాధింపు చర్యలు, బెదిరింపుల దందాలతో ముడిపడి ఉంటున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ రంగనాథ్ హైడ్రా ఠాణాలో కేసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే సుమోటో కేసులు.. కబ్జాలు, ప్రజా ఆస్తుల ధ్వంసానికి సంబంధించి ఫిర్యాదు చేయాలని భావించిన వారు నేరుగా హైడ్రా ఠాణాకు వెళ్లినా వెంటనే కేసు నమోదు కాదు. ఆ ఫిర్యాదును జనరల్ డైరీలో (జీడీ) ఎంట్రీ చేసే సిబ్బంది కమిషనర్ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. కమిషనర్ సిఫార్సు మేరకు సిబ్బంది విచారణ చేపడతారు. ఫిర్యాదుతో జత చేసిన పత్రాలు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులతో పాటు ఆయా శాఖలు, విభాగాలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తారు. ఈ వివరాలతో పీఈ పూర్తి చేసి.. నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు జోడించి కమిషనర్‌కు నివేదిక ఇస్తారు. ఆపై ఆయన ఆమోదంతో కేసు నమోదవుతుంది. నేరం ఏ సంవత్సరంలో జరిగిందో పరిగణనలోకి తీసుకునే ఎస్హెచ్ఓ ఆరోపణలు జోడిస్తారు. ఇప్పటికే వేర్వేరు ఠాణాల్లో నమోదైన కేసుల్ని విడతల వారీగా హైడ్రా స్టేషన్‌కు బదిలీ చేయనున్నారు.చదవండి: పాకిస్థాన్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు -
Hydra: సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ కూల్చివేత
గచ్చిబౌలి(హైదరాబాద్): సంధ్యా కన్వెన్షన్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. అనుమతులు లేని కట్టడాలను నేలమట్టం చేసింది. మంగళవారం ఉదయం నుంచి అధికారులు భారీ బందోబస్తు మధ్య రోజంతా కూల్చివేతలు జరిపారు. గచ్చిబౌలిలో సరనాల శ్రీధర్ రావు ఐదెకరాల విస్తీర్ణంలో 17 వేల చదరపు మీటర్ల అనుమతితో సంధ్యా కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు. దీనిని ఆనుకొని ఉన్న ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని కొన్ని ప్లాట్లను కొనుగోలు చేశారు. స్థలంలో కన్వెన్షన్‌ను ఆనుకొని రెండు షెడ్లను నిర్మించి కమర్షియల్‌గా వాడుకుంటున్నారు. రోడ్లను ఆక్రమించి ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారని ఫరి్టలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని ప్లాట్ల యజమానులు కొద్ది రోజులుగా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తమ ప్లాట్లు కనిపించడం లేదని, అనుమతులు లేకుండా విచ్చలవిడిగా శ్రీధర్ రావు నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పారు. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. సదరు నిర్మాణాలను కూలి్చవేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సంధ్యా కనెవన్షన్కు కొనసాగింపుగా ఉన్నా బ్రైడల్ రూమ్‌లు, మినీ హాల్, రెస్ట్ రూమ్‌లను కూల్చి వేశారు.మరో రెండు షెడ్లు సైతం.. గచ్చిబౌలి సర్వే నంబర్ 124, 125లలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట లేఅవుట్ చేశారు. దాదాపు 162 ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు కొన్నింటిని సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు అమ్ముకున్నారు. మిగిలిన ప్లాట్లకు హద్దులు, రోడ్లు లేకపోవడంతో ఆ యజమానులు హైడ్రాను ఆశ్రయించారు. ఈ క్రమంలోను ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్లో రెండు భారీ షెడ్లను నేలమట్టం చేశారు. సంధ్యా కన్వెన్షన్, మ్యాంగో ఫుడ్ పేరిట ఉన్న ఆర్చ్‌లను కూల్చివేశారు. కొన్ని ప్లాట్లను వేసిన సిమెంట్ రోడ్డును ధ్వంసం చేశారు. సొసైటీలోని యజమానుల నుంచి దాదాపు 100కు పైగా ప్లాట్లను సరనాల శ్రీధర్ రావు కొనుగోలు చేశారు. ప్లాట్లు కనిపించకుండా మట్టి, బండరాళ్లు వేసి, నిర్మాణాలు చేపట్టి, ఆ తర్వాత సదరు ప్లాట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. శ్రీధర్ రావుపై గచ్చిబౌలిపోలీస్ స్టేషన్లో కబ్జా యత్నం కేసులు నమోదై ఉన్నాయి. మరిన్ని నిర్మాణాలపై ఆరా నిర్మాణంలో ఉన్న రెండు షెడ్లను మాత్రమే అక్రమ నిర్మాణాలుగా తేల్చిన హైడ్రా అధికారులు మిగిలిన నిర్మాణాలు, యునాక్స్ అనే డ్రైవ్ ఇన్ వివరాలను సేకరిస్తున్నారు. సంధ్యా కన్వెన్షన్ ద్వారం వద్ద ఉన్న హోటల్, వెనక భాగంలో ఉన్న హార్ట్ కప్ అనుమతులను పరిశీలిస్తున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. కాగా.. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు శ్రీధర్ రావుకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేని నిర్మాణాలకు శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి సహకారం అందించినట్లు విమర్శలున్నాయి. 15 ఎకరాల ప్రభుత్వ భూమికి విముక్తి సుభా‹Ùనగర్: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో కబ్జాకు గురైన 15 ఎవరాల భూమిని హైడ్రా స్వా«దీనం చేసుకుంది. సర్వే నం.354లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమణల్ని మంగళవారం తొలగించింది. ఇందులో కేఎల్ యూనివర్సిటీ ఆక్రమించిన ఐదు ఎకరాల భూమి కూడా ఉంది. ఈ భూమిని 2009లో ప్రభుత్వం రాజీవ్‌స్వగృహ నిర్మాణాలకు కేటాయించింది. ఆ నిర్మాణాల కార్యరూపం దాల్చకపోవడంతో స్థానికంగా నాయకులుగా చలామణి అవుతున్న కొందరి కన్ను ఈ భూమిపై పడింది. స్థలం చుట్టూ ప్రహరీలు నిర్మించిన వాళ్లు షెడ్లు వేసి ఆక్రమించారు. దీనిపై స్థానికుల నుంచి హైడ్రాకు ప్రజావాణి ద్వారా ఫిర్యాదులందడంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారంచారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు నివేదిక సమర్పించారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆక్రమణలు తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆక్రమణలను మంగళవారం కూల్చేసిన అధికారులు అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేశారు. కాటేదాన్లోనూ హైడ్రా మంగళవారం కూలి్చవేతలు చేపట్టింది. ఇందిరా సొసైటీ కాలనీలోని రహదారులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించింది. రహదారులను ఆక్రమించి లేఔట్లలోని ప్లాట్లను కబ్జా చేసిన వారి ప్రయత్నాలను అడ్డుకుంది.శ్రీధర్‌రావుపై ఫిర్యాదుల వెల్లువ..శ్రీధర్ రావుపై పలు పోలీసుస్టేషన్లలో 30 కేసులు నమోదైనట్లు సమాచారం. కాగా.. హైడ్రా కూల్చివేతల అనంతరం శ్రీధర్ రావు బాధితులు వివిధ మార్గాల్లో ఆయనపై ఫిర్యాదు చేస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది. లేఅవుట్లోకి రాకుండా అడ్డుకున్నారని విదేశాల్లో ఉన్నవారు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొంది. కొందరు బాధితులు వీడియోల రూపంతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. లేఅవుట్లో ప్లాట్ లేదని చెప్పడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని ఢిల్లీ నుంచి ఓ మహిళ ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలపై పలువురు శ్రీధర్ రావుపై ఫిర్యాదులు చేస్తున్నారు. -
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
సాక్షి, హైదరాబాద్: ఏపీ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ తగిలింది. కొండాపూర్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలను శనివారం ఉదయం అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నెంబర్ 79లో 39 ఎకరాల స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకున్న హైడ్రా.. వసంత కృష్ణ ప్రసాద్ కబ్జాల పర్వాన్ని గుర్తించింది. ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తోపాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించింది. ఈ క్రమంలో వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్‌తో పాటు భారీ షెడ్లను తొలగించారు. హఫీజ్‌పేటలో రూ.2000 కోట్ల విలువగల వివాదాస్పద భూమిలో ఆయన కబ్జా పెట్టినట్లు తేలింది. అలాగే.. మాదాపూర్‌లోని 20 ఎకరాల భూమిని వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ వ్యవహారంపై ఆయన అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
HYDRAA : ‘అప్పుడే మీకు అసలైన సార్థకత’.. హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్..
సాక్షి,హైదరాబాద్ : హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్ పేద,మధ్య తరగతి మాత్రమేనా అని ప్రశ్నించింది. పేదల ఇళ్లే కాకుండా అక్రమ నిర్మాణలకు పాల్పడ్డ పెద్దల నిర్మాణాలకు కూల్చివేసినప్పుడే సార్థకత చేకూరుతుందని సూచించింది.ప్రభుత్వ భూములను కాపాడాలంటే పేదల నిర్మాణాలే కాదు. పెద్దల నిర్మాణాలు కూడా కూల్చాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. కేవలం పేదల నిర్మాణాలను తొలగిస్తే సరిపోదని హైకోర్టు తేల్చి చెప్పింది. మిర్ అలం ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో నివసించే గృహ యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ జారీ చేసిన నోటీసులపై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా, దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది.చెరువులను రక్షించడం ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పిన హైకోర్టు.. అందరికీ సమాన న్యాయం జరిగేలా చూడాలని సూచించింది. మిర్ అలం ట్యాంక్ చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. -
నిజాంపేట రూట్ క్లియర్!
అసలే రద్దీ రహదారులు.. ఆపై ఆక్రమణలు.. వాహనచోదకుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అంతే సంగతులు. అయితే హైడ్రాకు ఫిర్యాదు చేయగా ఏళ్లనాటి ఆక్రమణలు మాయమయ్యాయి. వాహనచోదకుల కష్టాలు తీరాయి. మొత్తానికి నిజాంపేట (Nizampet)రూట్ క్లియర్ అయింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) మంగళవారం నిజాంపేటలోని బాలాజీ హిల్స్, ఇందిరమ్మ కాలనీ (Indiramma Colony) ప్రధాన రహదారుల ఆక్రమణలను తొలగించింది. రోడ్లను ఆక్రమిస్తూ నిర్మించిన అపార్ట్మెంట్ ర్యాంపులు, మొక్కల కోసం నిర్మాణాలు, ఫెన్సింగ్లతోపాటు పైఅంతస్తులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ఇనుప మెట్లతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాహనదారులు, ఆయా కాలనీవాసులు చేసిన ఫిర్యాదులకు హైడ్రా స్పందించింది.ఇందిరమ్మ కాలనీలో రహదారిని పలువురు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు గదులు నిర్మించుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ కారణంగా వెంకటరాయనగర్, బాలాజీ కాలనీ, కేఎన్ఆర్ కాలనీ, కొలను తులసిరెడ్డి (కేటీఆర్) కాలనీసహా ఎనిమిది కాలనీలకు రాకపోకలు సాగించే వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీనిపై విచారణ చేసిన హైడ్రా అధికారులు ఆయా ఆక్రమణలను తొలగించాలని యజమానులకు రెండు నెలలు గడువు ఇచ్చారు. అయినప్పటికీ పరిస్థితి మారకపోవడంతో మంగళవారం నిజాంపేట మున్సిపల్ అధికారులతో కలిసి కూల్చివేతలు చేపట్టారు. పలుచోట్ల రహదారి ఆక్రమణల్ని తొలగించారు. దాదాపు కిలోమీటరుకుపైగా ఉన్న ఆక్రమణలు కూల్చేశారు. కూల్చివేతలతో ఉద్రిక్తత నిజాంపేట్ ఇందిరమ్మ ఫేజ్ –2 కాలనీలో మంగళవారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తంగా మారాయి. పలువురు స్థానికులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తమ ఇళ్ల ముందున్న నిర్మాణాలను ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. చిన్న, చిన్న నివాసాలతోపాటు, వ్యాపారాలు చేసుకునే తమ నిర్మాణాల్లో ఉన్న సామాన్లు సైతం తరలించేందుకు సమయం ఇవ్వలేదని ఆరోపించారు. లక్షలాది రూపాయల సామాన్లు పాడయ్యాయని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తమపై ఎందుకు కక్ష కట్టిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తుందని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తమ కుటుంబాలనే ఛిన్నాభిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.రెండున్నరేళ్లుగా పోరాడుతున్నాంఈ రహదారుల ఆక్రమణలపై దాదాపు రెండున్నర ఏళ్లుగా పోరాడుతున్నాం. ఆక్రమణలను తొలగించాలని కోర్టు తీర్పు కూడా ఉంది. మున్సిపాలిటీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. అయినా ప్రయోజనం లేకపోయింది. హైడ్రాను ఆశ్రయించిన వెంటనే విచారణ చేపట్టి రెండు నెలల క్రితం సంబంధీకులకు నోటీసులు ఇచ్చారు. ఎవరూ స్పందించకపోవడంతో హైడ్రా కూల్చేసింది. – చిరంజీవి, బాలాజీ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం ఈ ఆక్రమణల కారణంగా చాలా ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం. వాటర్ ట్యాంకర్లు కూడా ఈ మార్గంలో వచ్చే పరిస్థితి లేదు. స్కూల్ వ్యాన్లు వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో పిల్లలు నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్తున్నారు. హైడ్రా అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించారు. – విజయ్, బాలాజీ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చదవండి: ఇక RRR వరకు హైదరాబాద్ నగరమే! -
TG: మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే కుదరదు
హైదరాబాద్, సాక్షి: మహానగరంలో విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్(హైడ్రా)పై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం కూల్చివేతలు చేపడతారా? అంటూ మండిపడింది. ఈ క్రమంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై (HYDRAA Demolitions)పై దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ కే.లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ‘‘మీ ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు చేపడతారా? సెలవు దినాల్లో కూల్చివేతలు చట్టవిరుద్ధమని చెప్పినా నిబంధనలు పాటించరా? న్యాయస్థానం ఆదేశాలంటే లెక్కలేకుండా వ్యవహరిస్తే.. అది తెలిసేలా చేస్తాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలతో హై కోర్టుకు హాజరైన హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్(HYDRAA Inspector Rajasekar) పైనా ధర్మాసనం మండిపడింది. పోలీస్ శాఖను నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినంత మాత్రాన అక్కడ వ్యవహరించినట్లు ఇక్కడ ఉంటామంటే కుదరదు అని మందలించారు. మరోసారి ఇలాగే జరిగితే మీపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.ఆక్రమణల స్వాధీనానికి, అక్రమ భవనాల కూల్చివేతకు మేం వ్యతిరేకం కాదన్న జస్టిస్ కే లక్ష్మణ్.. ఏది చేసిన చట్టపరంగా ఉండాలని సూచించారు. అలాగని ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం విచారణను వాయిదా వేశారు. -
శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్, సాక్షి: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నట్లు సమాచారం.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే క్రమంలో హైడ్రా సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. -
చెరువుల కబ్జాపై కన్నెర్ర!
సాక్షి, హైదరాబాద్: ఆక్రమణదారుల చెర పడకుండా చెరువులను కాపాడేందుకు కంకణం కట్టుకున్న హైడ్రా (Hydraa) వాటి పరిరక్షణే లక్ష్యంగా దృష్టి సారిస్తోంది. ఇటీవల హైడ్రా బృందం శివారుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి చెరువుల పరిస్థితితోపాటు ప్రభుత్వ భూముల కబ్జాల సంగతి తేల్చేందుకు పర్యవేక్షణలు చేపట్టింది. ఈ సందర్భంగా స్థానికులు, బస్తీవాసులు, ప్రజలు తమ చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని, భవనాలు, బహుళ అంతస్తులు వెలుస్తున్నాయని వినతులు సమర్పించారు. హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో కూడా చాలామంది చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రాత పూర్వక ఫిర్యాదులను అందజేశారు. ఈ మేరకు హైడ్రా రాజధానికి సమీపంలోని చాలా చెరువులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.ఆక్రమణదారులు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 200 చెరువులను, చెరువు శిఖం భూములను, బఫర్జోన్లలో పెద్ద ఎత్తున వెంచర్లు వేసి, రూ.వందల కోట్లు ఆర్జించారు. అసలు విషయం తెలియక స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకొన్న సామాన్య, మధ్యతరగతి (Middle Class) ప్రజలు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారు. వర్షాకాలంలో ఈ కాలనీలు, అపార్ట్మెంట్లు జలాశయాలుగా మారుతున్నాయి. హబ్సిగూడ, రామంతాపూర్ చెరువును ఆనుకొని ఏర్పడిన మూడు కాలనీలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మునకేస్తున్నాయి. కూకట్పల్లి, (Kukatpally) కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, గాజుల రామారం, సరూర్‌నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, వెంకటాపూర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, టోలిచౌకి, గుండ్లపోచంపల్లి, జల్పల్లి, బడంగ్పేట్, నాచారం, ఉప్పల్, చెంగిచర్ల, మల్కాజిగిరి, ఘట్కేసర్, పోచారం తదితర ప్రాంతాల్లో చెరువులు అదృశ్యమై కాలనీలు పుట్టుకొచ్చాయి. ఆక్రమణలో.. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ‘రా’చెరువు, చింతల చెరువులోని బఫర్ జోన్లను దర్జాగా కబ్జా చేసి, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. చెంగిచర్ల బస్సు డిపో సమీపంలో ఉన్న చెరువు కట్టను ధ్వంసం చేసి.. బహుళ అంతస్తుల భవనాలను నిర్మించటం వల్ల సమీపంలోని కాలనీలు జలమ యం కాగా, రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. పోచారం పురపాలక సంఘం పరిధిలోని వెంకటాపూర్ నాడెం చెరువు ఆక్రమణకు గురికావటంతో బహుళ అంతస్తులు వెలిశాయి. దమ్మాయిగూడ, నాగారం, (Nagaram) బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్ పురపాలక సంఘాల పరిధిలోని చెరువు భూముల్లో కూడా అక్రమంగా భవనాలు వెలిశాయి. రెవెన్యూ, నీటి పారుదల, పురపాలక శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే ఈ కబ్జాల పర్వం మూడు పూవ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్పల్లి, ఉప్పల్ సర్కిళ్లలో వరదలతో కాలనీలన్నీ జలమయంగా మారినప్పుడల్లా.. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధితో ఉన్న పలు అక్రమ కట్టడాలను మొక్కబడిగా కూల్చివేస్తున్నారు. వీరి అలసత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్న కబ్జారులు కోర్టు కెళ్లుతుండటంతో వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.అంతంతే.. శివారుల్లో చెరువులు, కుంటల ఆక్రమణలు ,ప్రభుత్వ భూముల కబ్జాలపై ఫిర్యాదులు చేసినప్పుడు , కథనాలు వచ్చినపుడు లేదా ఉన్నతస్థాయి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం కదలి తూతూ మాత్రంగా కూల్చివేతలకు శ్రీకారం చుట్టి .. రాజకీయ పెద్దల జోక్యంతో చేతులు దులుపేసుకుంటున్నారు. కొన్ని చోట్ల కూల్చివేతలకు చేపట్టినా కొంత కాలం తర్వాత తిరిగి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం కబ్జాదారులకు అనువుగా మారుతోంది. హైడ్రా ఏర్పడిన తర్వాత కబ్జాదారులు, భూఅక్రమణ దారుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ బండారం బయట పడి అక్రమ కట్టడాలు నేలమట్టమవుతాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. చదవండి: చెట్టు చెట్టుకో కథ.. తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ.. -
వాళ్లు ఇచ్చిన ఫిర్యాదుతోనే అక్కడికి వెళ్లాం
సాక్షి, హైదరాబాద్: ఖాజాగూడ– నానక్‌రామ్‌గూడ ప్రధాన రహదారిలోని భగీరథమ్మ కుంట, తౌతానికుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో మంగళవారం చేపట్టిన కూల్చివేతలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి బుధవారం ప్రకటన విడుదల చేశారు. అందులోకి అంశాలివి... ఆ రెండు జలవనరుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురికావడంతో పరిసర ప్రాంతాల్లో తరచు నీరు నిలిచిపోతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా హైడ్రా అధికారులు, స్థానిక మున్సిపల్, రెవెన్యూ విభాగాలతో కలిసి రెండుసార్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎనిమిదేళ్ల క్రితమే తౌతానికుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు (Buffer Zone) సంబంధించిన తుది నోటిఫికేషన్, భగీరథమ్మ కుంటకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడ్డాయి.శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైడ్రా (Hydraa) ప్రధాన కార్యాలయంలో అక్కడి దుకాణాలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, శిఖం పట్టాదారులతో సమావేశం జరిగింది. ఆక్రమణల్ని గూగుల్ ఎర్త్ ద్వారా ప్రదర్శించారు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏసీఈ కార్ప్ గ్రూప్ ఇటీవలే శిఖం పట్టాదారు మేకల అంజయ్య తదితరుల నుంచి ఏడు ఎకరాలకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. హైడ్రా ఇక్కడ కూల్చివేతలను పూర్తి చేసిన తర్వాత, ఆ కంపెనీనే శిఖం పట్టాదారుల పేరుతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. శనివారం నాటి సమావేశానికి ఏసీఈ కార్ప్ గ్రూప్ యజమానులు కూడా హాజరయ్యారు’ అని తెలిపారు.నిర్మాణ సామగ్రిని డంప్ చేస్తున్న కంపెనీలు ‘భగీరథమ్మ కుంట శిఖం పట్టాదారులు బఫర్ జోన్లో దుకాణాలు నడుపుతూ చెరువును నిర్మాణ శిథిలాలతో నింపుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో అక్కడ నిర్మాణ సామగ్రిని డంప్ చేస్తున్న కొన్ని టిప్పర్లను హైడ్రా బృందాలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. భగీరథమ్మ చెరువును ఆక్రమించినందుకు రాయదుర్గం(Rayadurgam) పోలీసుస్టేషన్లో సంధ్యా కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు దాని యజమాని శ్రీధర్ రావు, టిప్పర్ ఆపరేటర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హైడ్రా గతవారం ఆక్రమణదారులతో సమావేశాలు నిర్వహించి, ఖాళీ చేయాలని, ఆక్రమణలు కూల్చివేస్తామని స్పష్టం చేసి, మూడు నాలుగు రోజుల గడువు ఇచ్చింది. అయినా ఎవరూ స్థలాలను, ఆక్రమణలను ఖాళీ చేయకపోవడంతో సోమవారం 24 గంటల సమయం ఇస్తూ నోటీసులు జారీ చేసింది. అయిన్పటికీ ఖాళీ చేయకపోవడంతో మంగళవారం కూల్చివేతలు చేపట్టింది’ అని రంగనాథ్ పేర్కొన్నారు.చదవండి: డ్రంకన్ డ్రైవ్ కేసులో యువకుడు, యువతికి విభిన్నమైన బెయిల్ వైన్‌షాప్ కూల్చకపోవడంపై వివరణ ఖాజాగూడలోని చెరువు బఫర్ జోన్లో ఉన్న వైన్‌షాప్‌ను కూల్చకపోవడంపైనా రంగనాథ్ వివరణ ఇచ్చారు. అది ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ప్రాంగణమని, కొన్ని రోజుల్లో దాన్ని మరోచోటుకు మార్చేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖను కోరామని పేర్కొన్నారు. ఆ షాప్‌నకు అనుబంధంగా ఉన్న సిట్టింగ్, డైనింగ్ ఏరియా, రెస్టారెంట్, పాన్‌షాప్‌లను కూల్చేశామని తెలిపారు. -
కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన
హైదరాబాద్, సాక్షి: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న ఆయన.. అయితే హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని స్పష్టత ఇచ్చారు. మంగళవారం కాముని చెరువు, మైసమ్మ చెరువులను ఆయన పరిశీలించి.. మీడియాతో మాట్లాడారు.హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం. జులై తర్వాత.. అంటే హైడ్రా ఏర్పాటు తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్నవాటి వైపు కూడా వెళ్లం. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదు అని ప్రకటించారాయన. అలాగే..కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుందని, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందని స్పష్టత ఇచ్చారు. హైడ్రా ఎప్పుడూ పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి పోదు. ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన నమ్మొద్దు అని ప్రజలకు రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. -
ప్రకృతిని కాపాడితే అదే మనల్ని ఆదుకుంటుంది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని ఆదుకుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ప్రకృతి మనకు వెంటనే ప్రతిఫలాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని ఆదుకుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఇది రైతు విజ్ఞత. గత కొన్ని నెలలుగా మన నీటి వనరులు, మన పర్యావరణ సంపదను మన భవిష్యత్తు కోసం మన వారసత్వం కోసం రక్షిస్తున్నాం. ప్రకృతి మనకు వెంటనే ప్రతిఫలాన్ని ఇస్తుంది. హైడ్రా ద్వారా పునరుద్ధరించబడిన అమీన్పూర్ సరస్సులో కనిపించిన 12-సెంటీమీటర్ల రెడ్ బ్రెస్ట్ ఫ్లైక్యాచర్ చూస్తే మనం చేసేది సరైనదే అని తెలుస్తుంది.. ఇది దేవుడి ఆశీస్సులాంటిది’ అంటూ కామెంట్స్ చేశారు. I always believed that if we take care of nature, nature will take care of us. It is farmer’s wisdom.We stopped lake encroachments after years of constant depletion and destruction of our water bodies, our ecological wealth, our legacy for our future in the last few months.… pic.twitter.com/GgFCj64wYG— Revanth Reddy (@revanth_anumula) December 2, 2024 -
మూసీ ప్రక్షాళన జరగాల్సిందే... మానవీయంగా!
మహా నగరాలకు ఒక ప్పుడు త్రాగు నీటిని అందించిన స్వచ్ఛమైన జల ప్రవాహాలు ప్రస్తుతం కనీసం పుక్కిలించడానికి కూడా వీలులేని కాలుష్య జలాలుగా కదులు తున్నాయి. ఉద్యోగ, ఉపాధి తదితర బతుకు తెరువు కోసం అసంఖ్యాక జనావళి నగరాలకు తరలి రావడంతో మహానగరాలు ఉక్కిరిబిక్కిరి అవు తున్నాయి. పారిశ్రామిక కాలుష్యం, జన జీవనం అందించే దైనందిన కాలుష్యం... నదీ, నదాలలో కలుస్తున్నాయి. పల్లెల నుంచి నగరాల వరకు జనం నీటి శుద్ధి కేంద్రాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నిరుపేద జనసామాన్యం నివాస స్థలాలు, త్రాగు నీరు వంటి కనీస సౌకర్యాల కోసం తపిస్తూ మురికివాడల కాలుష్య కూపాలలో మృత్యుసంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనం ఆరోగ్యం, సంక్షేమం గురించి కార్యాచరణ దృష్ట్యా మురుగునీటి పారుదలపై దృష్టి సారించవలసి వస్తోంది.ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దుర్గంధపూరిత కాలుష్య ప్రవాహం కలిగిన మూసీ పునరుజ్జీవం తెరపైకి తెచ్చింది. ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)... అక్రమ కట్టడాలనే వంకతో పేదలు కష్టించి నిర్మించుకొన్న మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లు కూల్చడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు ఆగ్రహంతో ప్రభుత్వ అమానవీయతపై విరుచు కుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ కొరియా సియోల్ నగరం నమూనాలో పథకం అమలుకు ఆలోచిస్తోంది. మూసీ జలాల ప్రక్షాళనను పర్యాటక ఆదాయాభివృద్ధికి ముడి పెట్టడం ప్రతిపక్షాల విమర్శలకు దారి తీస్తోంది.గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి ఆను కొని ఉన్న సబర్మతి నది... నగరానికి ఒకప్పుడు త్రాగునీటిని అందించి క్రమేపీ మురికి కాలువగా మారింది. అయితే నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ దృఢ దీక్షా సంకల్పంతో మళ్లీ కాలుష్యరహిత జలవాహినిగా రూపొందింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు సాగాలి.రెండు దశాబ్దాల క్రితం సబర్మతీ ప్రక్షాళన ప్రాజెక్ట్ చేపట్టక ముందే... గుజరాత్ ప్రభుత్వం, పది వేల కుటుంబాలకు పునరావాసం కల్పించింది. అహ్మదాబాద్‌లో 11.5 కి.మీ. పరిధిలో క్రమేపీ చేపట్టిన అభివృద్ధి పథకాలు సబర్మతీ నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దాయి. 1917 నాటి సబర్మతీ ఆశ్రమం, మహాత్ముని స్మృతి చిహ్నంగా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందింది.తెలుగు రాష్ట్రాలు గోదావరి, కృష్ణా వంటి భారీ నదుల వరదకే కాకుండా... బుడమేరు, మానేరు వంటి వాగులు, ఉపనదులకూ వచ్చే వరదలూ; నగరాలను ఆనుకుని ప్రవహించే నదుల కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వాధినేతలు ఆ నదులను బాగుచేయడం ద్వారా ఆ యా ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని సాధించి ఆదాయం పొందడం తప్పు కాదు. అయితే ఈ అభివృద్ధి పేరుతో నిరుపేదలను బజారుపాలు చేసి కన్నీళ్ల సముద్రంలో ముంచడం సమంజసం కాదు.చదవండి: అకస్మాత్తుగా ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని నగర రూపకల్పనలో లండన్, సింగపూర్ వంటి నమూనాల ప్రస్తావన ఉంది. తెలంగాణ మూసీ రివర్ ఫ్రంట్‌లో సబర్మతిని గుర్తు చేసే ‘బాపు ఘాట్’ ప్రస్తావన ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని అపురూప అత్యున్నత గాంధీజీ శిలా విగ్రహం నెలకొల్పే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు... ఇబ్బడిముబ్బడి సుస్థిర పర్యాటక రంగ ఆదాయాన్ని ఆశిస్తోంది. ఏది ఏమైనా ప్రతి రోజూ సుమారు 200 కోట్ల లీటర్ల నగరాల మురికినీరు, అంతకంటే ప్రమాద భరితమైన పారిశ్రామిక రసాయన వ్యర్థాల కాలుష్య జలాలతో లక్షలాది జనానికి మృత్యు స్పర్శ అందించే మూసీ కాలుష్యాన్ని నిర్మూలించే పునరుజ్జీవ సత్సంకల్పం సాధ్యం చేయగలిగితే, జన జీవన సౌభాగ్యానికి కంకణం ధరించినట్టే!- జయసూర్యసీనియర్ జర్నలిస్ట్ -
ఉద్రిక్తతల నడుమే.. ఒరిగిన బిల్డింగ్ కూల్చివేత ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి సిద్ధిఖ్ నగర్లో గత రాత్రి ప్రమాదకర స్థాయిలో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేత ప్రారంభమైంది. బుధవారం ఉదయమే హైడ్రాలిక్ ‘బాహుబలి’క్రేన్‌తో అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఉద్రిక్త వాతావరణంలోనే తమ పనిని ప్రారంభించారు. సదరు భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉండడంతో.. చుట్టుపక్కల మరే నష్టం జరగకుండా కూల్చివేస్తున్నారు.ఈ ఉదయం ఆ భవనం పక్కన ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు.. బిల్డింగ్ కుంగడానికి ప్రధాన కారణమైన పిల్లర్లను పూడ్చేశారు. డీఆర్ఎఫ్ సిబ్బంది కూల్చివేతలో పాల్గొంటున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఆంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. గుంతలు తవ్విన భవన యాజమానిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక..ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా గుంతలు తవ్వడం వల్లే పక్కన ఉన్న భవనం కుంగిందని, అలాగే కుంగిన ఆ భవనాన్ని కూడా నిబంధనలకు లోబడి కట్టలేదని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఒరిగిన బిల్డింగ్ యాజమాని మాత్రం తమ వెర్షన్ వినిపిస్తున్నారు. ‘‘ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తవ్వకాలు చేపట్టారు. సెల్లార్ గుంతలు తవ్వడం వల్లే మా బిల్డింగ్ కుంగిపోయింది. మాకు ఆ ఓనర్‌తో నష్టపరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు.వసుకుల లక్ష్మణ్ అనే పేరిట ఈ ప్లాట్ ఉంది. జీప్లస్ ఫోర్లో రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. చుట్టుపక్కల ఐటీ కారిడార్‌లో పని చేసేవాళ్లంతా. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలోనే గోడ కూలినట్లు శబ్దం వచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8.30 గంటల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోందని అరుపులు వినిపించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆదరాబాదరాగా కిందకు వచ్చేశారు. ఇంతలోనే మూడో అంతస్తులో ఉండే సాదిక్ హుస్సేన్ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు.. మూసీ సుందరీకరణ లక్ష్యం ఏమిటి?
రాజకీయ రంగస్థలంపై మూసీ ప్రక్షాళన, పారదర్శకత లోపించి తీవ్ర వివాదాస్పద మవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్ల కూల్చివేతకు సంబంధించి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అగ్రహం ప్రకటించింది. ‘రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏమిటని, ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడుతారని, రాజకీయ భాష్యాలు చెప్పినట్లు చేస్తే జైళ్లకు పంపు తామ’ని హెచ్చరించింది. పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారనీ, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారనీ. ప్రభుత్వంపై, కమిషనర్ రంగనాథ్‌పై, అమీన్పూర్ తహసిల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ ఆక్రమణల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్.టి.ఎల్. నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్.టి.ఎల్ బయట ఇల్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించింది.‘అసలు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట జరుగుతున్న సుందరీకరణ లక్ష్యం ఏమిటి? మూసీ నదిని, ఆ నదిలో కలిసే వాగులను (గృహ, హోటల్, వ్యాపార, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, మురుగునీటిని) పూర్తి (ఐరోపా ప్రమాణాల) స్థాయిలో ప్రక్షాళన (శుద్ధి) చేసి స్వచ్ఛమైన జలాలు (నది)గా మార్చే లక్ష్యం ఏమైనా ఉందా? ప్రాజెక్టు పూర్తి అయితే, అంటే ఆ మురుగు నీటిని మూసీ నదిలో కలిసే నాటికి పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే ప్రక్రియ ఇందులో ఉందా? లేదా హైదరాబాద్ జంట నగరాలలోని మురుగు నీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదిలేసి ఆ మురుగు నీటి ప్రవాహంపైనే, సుందరీకరణ చేపడతారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. సమగ్రమైన ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్)ను ప్రజల ముందు ఉంచాలి. ప్రజల నివాసాలకు నష్టం కలిగే ఏ ప్రాజెక్టులో నైనా ముందు పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తయిన తరువాతనే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వారి నివాసాలను చివరలో ఖాళీ చేయించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. కానీ, అందుకు భిన్నంగా సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు జీవితమంతా కష్టించి నిర్మించుకున్న ఇండ్లను ప్రాజెక్టు ప్రారంభంలోనే ఎందుకు కూల్చుతున్నారు? ఇదేనా కేసీఆర్ విధానాలకు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యం?సామాన్య, మధ్యతరగతి వారికి ఒక ఇల్లు అనేది వారి మొత్తం జీవితపు కల. ఆ కల నిజం చేసుకోవడానికి జీవితంలో చాలా మూల్యం చెల్లిస్తారు. పట్టణంలో ఇల్లనే కల సాకారం కోసం సొంత ఊళ్ళలో ఉన్న పొలాలను, ఇతర ఆస్తులను అమ్ముతారు. అప్పులు తెస్తారు. అనేక కష్టాలతో వారి స్తోమతకు తగ్గ ఇల్లు నిర్మించుకుంటారు. ప్రాజెక్టు పేరుతో, పునరావాసం, ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ప్రభుత్వాల, పెద్దల రియల్ ఎస్టేట్ దందాతో 10, 20 గజాల నేలపై ఇల్లు కట్టుకోవడం సామాన్య మధ్య తరగతికి ఒక గగన కుసుమంగా మారింది. అందుకే వీరు మురికి వాడలకు, దుర్గంధ నదుల పరివాహ ప్రాంతాలకు తరలు తున్నారు. చౌకగా వస్తుందని దుర్గంధపూరిత నది అంచునే స్థలం కొని, భారీ డబ్బుతో క్రమబద్ధీకరణ చేసుకొని, ఇండ్లు నిర్మించుకున్నారు. కూల్చివేతల భయంతో గుండె పోటు చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. 8 నెలల నిండు గర్భిణీ అనే కనికరం లేకుండా ఆమె ఇల్లు కూల్చడం దుర్మార్గం. ఒక బాధిత కుటుంబం 25 ఏళ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటూ నలుగురు కొడు కులకు పెళ్లి చేసింది. నిర్వాసితులైన వీరందరికీ ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లభించింది. ఒక్క ఇంట్లో ఇన్ని కుటుంబాలు ఎలా నివసించాలని వేదనకు గురవుతున్నారు వారు. హైడ్రాతో ప్రభుత్వానికి వచ్చిన కీర్తి, మూసి పేదల ఇళ్ల కూల్చివేతతో పాతాళంలోకి పోయింది.జల వనరులను, ప్రభుత్వ స్థలాలను, పార్కులను రక్షించవలసిందే. కానీ వాటిని ఆక్రమించి భారీ ఆస్తులుగా చేసుకున్నది సామాన్య పౌరులు కాదు. అధికారంలో ఉన్న బడాబాబులు, పెద్దలే. మూసీ నదీ గర్భంలో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపినా, మరికొందరు ఇండ్లను వదిలిపెట్టడానికి ససేమిరా సిద్ధంగా లేరు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆశించిన స్థానిక ప్రజలు వాటిని తమకే కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. మూసి నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ సమీప ప్రజల మధ్య ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించి దాదాపు 15 వేల కుటుంబ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని 2022లోనే నిర్ణయించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంలో పది వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. ఆ నిర్వాసి తులందరికీ వారి నివాసానికి, ఉపాధికి అనువైన చోట అన్ని మౌలిక వసతులతో కూడిన పునరావాస సౌకర్యాలను ప్రభుత్వం నిర్వాసితులకు కల్పించాలి. దౌర్జన్యంతో కాకుండా నిర్వాసితులను అన్ని విధాల ఒప్పించి మెప్పించి పునరావస కాలనీకి తరలించాలి.చదవండి: రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చాలి!శుద్ధీకరణ అంటే, మురుగు నీటిలో ఉన్న అశుద్ధ మూలకాలను, కాలుష్యాన్ని తొలగించడం. శుద్ధి చేసిన తర్వాత ఆ నీరు త్రాగడానికి అనువైన విధంగా 100% సురక్షితంగా ఉండాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజె క్టులో నేటి ప్రభుత్వం ఆ నది మురుగు జలాలను అలా స్వచ్ఛమైన తాగునీరుగా మారుస్తుందా? దేశంలోని చాలా నగరాల్లో మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఎక్కడా మురుగు నీటిని స్వచ్ఛ జలాలుగా మార్చిన చరిత్ర నేటికీ లేనేలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో అంగీకరించారు. సీవరేస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ల ద్వారా మురుగునీటి శుద్ధీకరణ 30–35% కంటే మించదనీ, తెలంగాణలోలోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ పథకానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టనీ, మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అనీ రకరకాల పేర్లతో మంత్రులు, అధికారులే గందరగోళం చేస్తున్నారు. మూíసీ నదిని పూర్తి స్థాయిలో ఒక ఎకలాజికల్ ప్రాజెక్టు (ఒక స్వచ్ఛమైన నది)గా తీర్చి దిద్దాలనే లక్ష్యం ఏమైనా ప్రభుత్వానికి ఉందా?చదవండి: ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ఒక మేన్యువల్‌ను 1997లో ప్రకటించింది. ‘డిజైన్ మేన్యువల్ ఫర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఇన్ ఇండియా’ (దేశంలోని వ్యర్థాల స్థిరీకరణ చెరువుల కోసం డిజైన్ మాన్యువల్). ఇది ప్రకటించి 27 ఏళ్ల అయింది. దీని అర్థం ఏమిటంటే... మురుగు నీటిని శుద్ధి చేయలేమని చేతులెత్తేసి, ఆ నీటిని తాగునీరులో కలవకుండా మురుగునీటిని కుంటలుగా స్థిరపరుస్తామని చెప్పడం. కోటిమంది హైదరాబాద్ నగర వాసులు వాడిన మురికి నీరు, వ్యాపార సముదాయాల వ్యర్థాలు, పరిశ్ర మలు వెదజల్లే విష పదార్థాలు మూసీ ద్వారా కృష్ణా నదిలో యధేచ్ఛగా కలుస్తున్నాయి. ఆ కలుషిత నీటినే ప్రజలు జీవజలంగా సేవిస్తున్నారు. మురుగు నీటి శుద్ధీకరణ పథ కాలకు ఎంత అందమైన పేర్లు పెట్టినా శుద్ధీకరణ వట్టిదే నని 75 ఏళ్ల దేశ చరిత్ర రుజువు చేస్తోంది. ఇది కఠిన వాస్తవం. మరి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ లిమిటెడ్ ప్రక్షాళన ఏ రకమైనదో... డీపీఆర్‌ను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి.- నైనాల గోవర్ధన్ తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ -
మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడో నెలలోనూ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో ఏకంగా రూ. 140 కోట్ల ఆదాయం తగ్గిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే గతేడాదితో పోలిస్తే ఆదాయం విషయంలో రూ. 1,000 కోట్లకుపైగా వెనుకబడి ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. గత 3 నెలలుగా తగ్గుతున్న ఆదాయంతో తల పట్టుకుంటోంది. వరుసగా రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు మందగించడంపై ఆందోళన చెందుతోంది. అన్ని జిల్లాల్లోనూ అదే వరుస.. అక్టోబర్ నెలలో పరిస్థితిని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మందగించాయి. ఆదిలాబాద్ మొదలు హైదరాబాద్ (సౌత్) వరకు 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో లావాదేవీల సంఖ్య, రాబడి తగ్గింది. గతేడాది అక్టోబర్ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాపు 12 వేల లావాదేవీలు తగ్గిపోయాయి. అంటే సగటున రోజుకు 400 లావాదేవీలు తగ్గాయన్న మాట. గతేడాది అక్టోబర్‌లో మొత్తం 91,619 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగ్గా ఈ ఏడాది 79,562 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ కావడం గమనార్హం. ఇక జిల్లాలవారీగా పరిశీలిస్తే రంగారెడ్డిలో గతేడాది అక్టోబర్ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 94 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ఈ జిల్లాలో సుమారు 1,600 లావాదేవీలు కూడా తగ్గాయి. హైదరాబాద్, హైదరాబాద్ (సౌత్), మేడ్చల్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ లాంటి జిల్లాల్లోనూ లావాదేవీల గణాంకాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో ‘హైడ్రా’అక్రమ కట్టడాల కూల్చివేతల కారణంగా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు, ఆస్తుల కొనుగోళ్లు మందగించాయని అంటున్నారు. దీనికితోడు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం గడ్డుకాలం ఎదుర్కొంటోందని.. ఈ నేపథ్యంలోనే ఇతర జిల్లాల్లోనూ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. -
HYDRAA: హైడ్రా ఫోకస్ ఇక అక్కడ కూడా!
హైదరాబాద్, సాక్షి: హైడ్రా.. ఈ పేరు వినబడగానే ఓ ఉలిక్కిపాటు కనిపిస్తోంది తెలంగాణ అంతటా. ఎక్కడ తమ ఇళ్లు, బిల్డింగులపై బుల్డోజర్లు దూసుకొస్తాయో అని బెంబేలెత్తిపోతున్నారు కొందరు. అయితే..హైడ్రా విధులు కేవలం కట్టడాల కూల్చివేత మాత్రమే కాదు. ఇంకా చాలానే ఉన్నాయి. చెరువుల సుందరీకరణతో విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణలో సహకారం వంటి కార్యక్రమాల్లో భాగం కానుంది. ఈ క్రమంలో ఇప్పుడు హైడ్రా వలంటీర్లు తెరపైకి వచ్చారు.హైడ్రా వలంటీర్లు ఇకపై హైదరాబాద్‌లోని ముఖ్యమైన జంక్షన్లలో, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించనున్నారు. ట్రాఫిక్ పోలీసులకు వీళ్లు సహాయకులుగా పని చేయనున్నారు. ఇప్పటికే గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ 50 మంది హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. త్వరలో హైడ్రా రేడియం జాకెట్లతో వీళ్లు సిగ్నల్స్ దగ్గర కనిపించనున్నారు.హైడ్రా ట్రాఫిక్ వలంటీర్ల పేరిట ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలందించనున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఇది వరకే ప్రకటించారు. ఇదీ చదవండి: రండి బాబూ రండి..హైడ్రా అప్రూవ్డ్ ఇళ్లు కొనండి!