హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కఠినంగా స్పందించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ కూల్చివేతలు చేపట్టినందుకు హైడ్రా అధికారులపై పలు ప్రశ్నలు సంధించింది.
సంధ్య కన్వెన్షన్‌లో చేపట్టిన కూల్చివేతలు ఎవరి అనుమతి తీసుకుని చేశారు? ఎవరు చెప్పారని ఆ చర్యలు తీసుకున్నారు? అంటూ కోర్టు హైడ్రా అధికారులను హైకోర్టు నిలదీసింది. కోర్టు ముందస్తు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా వ్యవహరించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
కాగా కూల్చివేతలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోర్టు అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి (గురువారం) వాయిదా వేసింది.


