హైడ్రాపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు | Serilingampally MLA Arekapudi Gandhi Sensational Comments On HYDRA | Sakshi
Sakshi News home page

హైడ్రాపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Jun 30 2025 2:19 PM | Updated on Jun 30 2025 3:18 PM

Serilingampally MLA Arekapudi Gandhi Sensational Comments On HYDRA

హైడ్రాపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరిస్తోందని.. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

హైదరాబాద్‌, సాక్షి: మాదాపూర్‌ సున్నం చెరువు దగ్గర హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సోమవారం గరం అయ్యారు. చెరువును బఫర్‌ జోన్‌ చేయకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ హైడ్రా అధికారులపై మండిపడ్డారాయన. 

‘‘చెరువులు కబ్జాకు గురికాకుండా అభివృద్ధి చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన. కానీ, హైడ్రా తీరు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా ఉంది. హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సున్నం చెరువు బఫర్‌ జోన్‌ చేయకుండా కూల్చివేతలు చేపట్టారు‌. ఈ అంశంపై సీఎం రేవంత్‌ను కలుస్తా’’ అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. 

ఇదిలా ఉంటే.. సున్నం చెరువు హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పలువురు ప్రొక్లెయిన్‌కు అడ్డం పడి హైడ్రా డౌన్‌ డౌన్‌.. హైడ్రా కమిషనర్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా తమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement