మం‍త్రులు పొంగులేటి, జూపల్లి పర్యటనలో అపశృతి | Fire Accident Over Telangana Ministers Visit AT Nagarkurnool | Sakshi
Sakshi News home page

మం‍త్రులు పొంగులేటి, జూపల్లి పర్యటనలో అపశృతి

Apr 19 2025 1:42 PM | Updated on Apr 19 2025 1:42 PM

Fire Accident Over Telangana Ministers Visit AT Nagarkurnool

సాక్షి, నాగర్ కర్నూల్: తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. వారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది.

వివరాల ప్రకారం.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి శనివారం నాగర్‌ కర్నూలు జిల్లాలో పర్యటించారు. భూ భారతిపై రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు వచ్చారు.  ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో హెలిపాడ్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. మంటలను ఆర్పి వేశారు. అయితే, హెలికాప్టర్ ల్యాండ్‌ కోసం ఇచ్చిన సిగ్నల్ బుల్లెట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement