ఆటో డ్రైవర్‌ @ హిందీ పండిట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ @ హిందీ పండిట్‌

Aug 12 2026 1:04 AM | Updated on Aug 12 2026 1:04 AM

పాలమూరు: ఆటో డ్రైవర్‌గా కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ వ్యక్తి హిందీ పండిట్‌ గానూ బాధ్యతలు నిర్వరి స్తూ విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. నగరంలో ని బండమీదిపల్లికి చెందిన గాలెన్న వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌. చదువుపై ఆసక్తితో ఆటో నడుపుకుంటూ నే హిందీ పండిట్‌ పూర్తి చేశారు. మొదట్లో ఆరు నెలల పాటు గాంధీ రోడ్‌ స్కూల్‌ లో విధులు నిర్వర్తించగా.. రెండేళ్ల నుంచి పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కొనసాగుతున్న మార్కెట్‌ రోడ్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హిందీ తరగతులు బోధిస్తున్నాడు. ఉద యం 7 గంటల నుంచి 9గంటల వరకు ఆటో నడుపుతూ.. 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాస్‌ లు చెబుతున్నాడు. అనంతరం మళ్లీ రాత్రి వరకు ఆటో నడుపుతూ జీవ నం సాగిస్తున్నానని గాలె న్న చెబుతున్నారు. ప్రతి రోజు ఆటో నడపడం ద్వారా రూ.300 నుంచి రూ.400 వరకు సంపాదిస్తానని, భార్య, ముగ్గురు పిల్లలు సంతోషంగా జీవిస్తున్నామని వెల్లడించారు. పాఠశాలలో తరగుతులు బోధిస్తున్నందుకు ప్రధాన ఉపాధ్యాయురాలు నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు గౌరవ వేతనం అందిస్తున్నారని పేర్కొ న్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాలనే ఆసక్తితో ఇక్కడ పని చేస్తున్నానని, నెలకు రూ.15వేల వరకు జీతం వచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చొరవ చూపాలి కోరారు.

గాలెన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement