ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య

Aug 12 2026 1:04 AM | Updated on Aug 12 2026 1:04 AM

వనపర్తి రూరల్‌: ఆర్థిక స మస్యల నేపథ్యంలో మనస్తాపం చెందిన వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన శ్రీరంగాపురం మండలంలోని తాటిపాములలో జరిగింది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన అనకొండ అబ్దుల్లా (45) వ్యవసాయం చేసేవాడు. ఆర్థిక సమస్యలతో మానసికంగా ఇబ్బందులు పడుతూ మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు సాయికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హిమబిందు తెలిపారు.

పొట్టకూటి కోసం పని.. వేరొకరి అజాగ్రత్తకు బలి

కారు ఢీకొని యువకూలీ మృతి

కొత్తకోట రూరల్‌: కూలి పనుల కోసం రాష్ట్రాలు దాటి వచ్చాడు.. పొట్ట కూటి కోసం మండుటెండలో పనులు చేస్తుండగా.. అతివేగం, అజాగ్రత్త తో వచ్చిన కారు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన పెద్దమందడి మండలం మోజర్ల స్టేజి సమీపంలోని మంగళవారం చోటు చేసుకుంది. పెద్దమందడి ఎస్‌ఐ జలేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు కూలీలు ఓ కాంట్రాక్టర్‌ వద్ద కూలి పనులకు వచ్చారు. పనిలో భాగంగా ఉదయం జాతీయ రహదారి– 44పై మరమ్మతు పనులు చేస్తుండగా హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు అతివేగంగా పనులు చేస్తున్న రాజేశ్‌ (20)ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రాజేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ బ్రిడ్జిపై నుంచి కింద పడింది. కారు డ్రైవర్‌ ఉపేందర్‌నాయుడుతో పాటు రమేశ్‌ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికుల సమా చారంతో ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి, మృతదేహాన్ని వనపర్తి మార్చూరికి తరలించారు. మృతుడి కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

దొంగతనం ఆరోపణలతో

యువకుడు ఆత్మహత్య

లింగాల: మండలంలోని దారారం గ్రామానికి చెందిన రాత్లావత్‌ ఉదయ్‌కిరణ్‌ (27) ఆత్మహ త్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యు లు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని అంబట్‌పల్లిలో మద్యం షా పులో ఉదయ్‌కిరణ్‌ సేల్స్‌మెన్‌గా పనిచేస్తు న్నాడు. ఈ క్రమంలో షాపుకు సంబంధించి రూ.16 లక్షలు స్వాహా చేశాడని షాపు యజ మాని అతడిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఉదయ్‌ రూ. 4లక్షలు చెల్లించినట్లు తెలిసింది. మిగతా రూ.12 లక్షలు చెల్లించాలని యజ మాని ఒత్తిడి తీసుకు రావడంతో పాటు సో మవారం మృతుడి తల్లి శాంతిని షాపు వద్ద కూర్చోబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయ్‌కిరణ్‌ భయాందోళనలకు గురై తల్లి, భార్య కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇంటిలోనే ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఘటనపై మృతుడి భార్య రాత్లావత్‌ తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement