8న హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ | Distribution of Fish Prasad in Hyderabad on 8th | Sakshi
Sakshi News home page

8న హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ

May 18 2024 5:00 AM | Updated on May 18 2024 5:01 AM

Distribution of Fish Prasad in Hyderabad on 8th

చార్మినార్‌/దూద్‌బౌలి (హైదరాబాద్‌): మృగశిర కార్తె సందర్భంగా ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశం రోజైన జూన్‌ 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని శుక్రవారం బత్తిన అనురీత్‌గౌడ్, గౌరీ శంకర్‌గౌడ్‌లు మీడియాకు తెలిపారు.

చేప ప్రసాదం తయారీలో భాగంగా జూన్‌ 7వ తేదీన ఉదయం 11 గంటలకు దూద్‌బౌలీలోని స్వగృహంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. అనంతరం 8వ తేదీన ఉదయం ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులందరూ చేప ప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు తరలించి ప్రసాదం పంపిణీ చేస్తామని వివరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement