ఉస్మానియా యూనివర్సిటీ: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో జరిగిన ఓయూ విద్యార్థి నాయకుడు రెడ్డి శ్రీనివాస్, మమత వివాహానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. విద్యార్థి నేతగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ సీఎం రేవంత్‌రెడ్డికి 15 సంవత్సరాలుగా అనుచరుడిగా కొనసాగుతున్నారు. వివాహానికి రేవంత్‌రెడ్డి విచ్చేసి ఆశీర్వదించినందుకు నూతన దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
సమగ్ర కులగణనతోనే సామాజిక న్యాయం
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో సమగ్ర కులగణన జరిగితేనే దేశంలో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే చేపట్టే జనగణనలో అన్ని కులాల సామాజిక, ఆర్థిక, విద్య స్థాయిలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం ఆయన ప్రజాభవన్‌లో ‘క్యాస్ట్ సెన్సెస్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.


