ఇటు సూర్యవంశీ.. అటు సూర్యరశ్మి.. | Rajasthan Royals vs Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

ఇటు సూర్యవంశీ.. అటు సూర్యరశ్మి..

Apr 13 2026 7:29 AM | Updated on Apr 13 2026 7:29 AM

Rajasthan Royals vs Sunrisers Hyderabad

హైదరాబాద్‌: ఐపీఎల్‌– 19లో సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఇక్కడ రాజస్థాన్‌ రాయల్స్‌ క్రీడాకారులుప్రాక్టీస్‌ చేశారు. ఇటీవల బ్యాటింగ్‌తో చెలరేగుతున్న వైభవ్‌ సూర్యవంశీ స్టేడియమంతా కలియతిరుగుతూ జట్టు సభ్యుల్ని ఉత్సాహపరిచారు.

‘సన్‌’డే.. సూరీడు చెలరేగిపోయాడు. నగరంలో ప్ర‘తాపం’ చూపించాడు. ఎండ తీవ్రతతో సిటీజనులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆదివారం సెలవురోజు అయినా బయటికి రాలేకపోయారు. సాయంత్రం కూడా వేడి సెగలతో ఉక్కపోతకు గురయ్యారు. షాపుల్లోంచి పలువురు ఏసీలు, కూలర్లు కొనుక్కువెళ్లారు. వాహనాల సంచారం లేక రహదారులు బోసిపోయాయి.  




 

Advertisement
 
Advertisement
Advertisement