హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసిన సీపీ
హైదరాబాద్: ఓ కేసు విషయమై ఫిర్యాదుదారును మద్యం బాటిళ్లు అడిగిన మీర్‌పేట సబ్ ఇన్‌స్పెక్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. నగర సీపీ సజ్జనర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐని ఆదివారం హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ శంకర్‌నాయక్, ఫిర్యాదుదారు కథనం ప్రకారం వివరాలు.. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధి లెనిన్‌నగర్‌కు చెందిన తిరుపతయ్య గతంలో వెంకటేశ్ అనే వ్యక్తి వద్ద 11.05 గజాల స్థలంలోని షెటర్‌ను కొనుగోలు చేశారు.
ఇటీవల అమ్మిన వ్యక్తి కుటుంబ సభ్యులు షెటర్‌పై నిర్మాణం చేపట్టడంతో 2 గజాల స్థలాన్ని ఆక్రమించారంటూ తిరుపతయ్య ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 10న ఎస్‌ఐ నాగభూషణం.. తిరుపతయ్యకు ఫో న్ చేసి రెండు మద్యం బాటిళ్లు కావాలని అడిగా రు. న్యాయం చేయకపోగా మద్యం బాటిళ్లు అడగటంతో తిరుపతయ్య.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ ఆదేశాల మేర కు ఎస్‌ఐ నాగభూషణాన్ని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్టు ఇన్‌స్పెక్టర్ శంకర్‌నాయక్ తెలిపారు.


