తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదల | Telangana Intermediate Results 2026 Released | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదల

Apr 12 2026 10:41 AM | Updated on Apr 12 2026 11:17 AM

Telangana Intermediate Results 2026 Released

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఇంటర్‌ విద్యా బోర్డు ఆవరణలో ఈ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విడుదల చేశారు. https://tgbie.cgg.gov.in,  https:// results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఫలితాలను https://education.sakshi.com/ కూడా చెక్‌ చేసుకోవచ్చు. 

ఈసారి ఇంటర్‌ పరీక్షలకు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్‌ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 66.20 శాతం ఉత్తీర్ణత రాగా, బాలికల-74.4 శాతం, బాలురు-57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్‌ ఇయర్‌లో 70.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. 

వాట్సాప్‌లో కూడా.. 
ఇంటర్మిడియట్‌ ఫలితాలను మీ సేవ వాట్సాప్‌ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ సర్వీసును శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో ఆవిష్కరించారు. ఇప్పటికే ఇంటర్మీడియట్, టెన్త్‌ హాల్‌టికెట్లను వాట్సాప్‌ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మిడియట్‌ ఎడ్యుకేషన్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 12, 2026 నుంచి పరీక్షా ఫలితాలను కూడా నేరుగా వాట్సాప్‌లో అందించనుంది. విద్యార్థులు 8096958096 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్‌ అని మెసేజ్‌ పంపి మీ సేవ చాట్‌బోట్‌ ద్వారా తమ రోల్‌ నంబర్, ఇయర్, స్ట్రీమ్‌ వివరాలు నమోదు చేసి ఫలితాలను వెంటనే పొందవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement