హైదరాబాద్: లైంగిక సేవల కోసం ట్రాన్స్‌జెండర్‌ను ఇంటికి తీసుకువెళ్తే బెదిరింపులకు పాల్పడి రూ.1.50 లక్షలు వసూలు చేసిన సంఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. జూబ్లీహిల్స్ పరిధిలో నివసించే ఒక వ్యక్తి (44) మార్చి 28న టాస్ పబ్ సమీపంలో గాయత్రీ అనే ట్రాన్స్‌జెండర్‌ను కలిశాడు. లైంగిక సేవలు అందించేందుకు రూ.3,500కు ఒప్పందం చేసుకుని అతని ఇంటికి తీసుకువెళ్లాడు.
డబ్బు తీసుకుని తిరిగి వచ్చే సమయంలో ట్రాన్స్‌జెండర్ బెదిరింపులకు దిగింది. తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇంటి వద్ద గొడవ వద్దనే ఉద్దేశ్యంతో అతను రూ.1.40 లక్షలతో పాటు బంగారు గాజులు ఇచ్చాడు. ట్రాన్స్‌జెండర్ పలుమార్లు బెదిరింపులకు పాల్పడడటంతో విషయం కుటుంబ సభ్యులకు తెలుస్తుందని భయపడ్డాడు. ఈ క్రమంలోశనివారం ట్రాన్స్‌జెండర్ మరోసారి అపార్ట్‌మెంట్ వద్దకు రావడంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ కోసం గాలిస్తున్నారు.


