ఇందిరా, రాజీవ్‌ గాంధీ పథకాలపై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay Key Comments On BJP Mahajan Sampark Abhiyan Program - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ల కాలం పూర్తైంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాలపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ క్రమంలో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రజల్లోకి వెళుతున్నాం. ఎన్నికల వరకు రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధే మోదీ లక్ష్యం. గత పాలనలోని మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ప్రధాని మోదీదే. గతంలో ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావో నినాదం మంచిదే. ఆ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో తెలుసుకుని.. మంచి ఉద్దేశ్యంతో టాయిలెట్ల నిర్మాణం, రేషన్‌ బియ్యం అందించడం సహా పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. 

గతంలో కేంద్ర పథకాల విషయంలో రూపాయి పేదవాడికి పంపిస్తే 15 పైసలు మాత్రమే అందుతున్నాయని రాజీవ్‌ గాంధీ చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డీబీటీ విధానంతో లబ్ధిదారుడికి నేరుగా ప్రధాని మోదీ ప్రయోజనం చేకూరుస్తున్నారు’ అని కామెంట్స్‌ చేశారు. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ‘మానవత్వం లేని కేసీఆర్‌ ప్రభుత్వం’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top