కుమారుడి కన్నుల్లో ఆనందం కోసం.. | - | Sakshi
Sakshi News home page

కుమారుడి కన్నుల్లో ఆనందం కోసం..

Jun 2 2025 1:40 AM | Updated on Jun 2 2025 2:27 PM

కుమార

కుమారుడి కన్నుల్లో ఆనందం కోసం..

తమిళసినిమా: నటుడు ధనుష్‌ జీవితం తెరిచిన పుస్తకమే. దర్శకుడు కస్తూరిరాజా వారసుడైన ఈయన తుళ్లువదో ఇళమై చిత్రంలో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం అనూహ్య విజయంతో కెరీర్‌ పరంగా ధనుష్‌కు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. ఆ తరువాత పవర్‌ పాండి చిత్రంతో దర్శకుడిగానూ పరిచయం అయ్యారు. అలా నిర్మాతగానూ మారిన ధనుష్‌ వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌, ధనుష్‌లో వివాహం గత 2004లో జరిగింది. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాంటిది గత ఏడాది మనస్పర్థల కారణంగా ధనుష్‌ ఐశ్వర్య రజనీకాంత్‌ విడిపోయారు. సమీపకాలంలో చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టు విడాకులను కూడా మంజూరు చేసింది. అయితే ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ పిల్లలపై మాత్రం ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. కాగా వివాహ రద్దు తరువాత ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ ఎప్పుడూ ఎదురు పడలేదు. అలాంటి కుమారుడు రాత్రి ఒకే వేదికపైకి తీసుకొచ్చాడు. కొడుకు కన్నుల్లో ఆనందం కోసం వీరిద్దరూ కలిశారు. కొడుకు యాత్రను ఒకేసారి కౌగిలించుకుని అభినందించారు. అసలు విషయం ఏమిటంటే ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ పెద్ద కుమారుడు యాత్ర ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు. దీని కాన్వకేషన్‌ కార్యక్రమం శనివారం సాయంత్రం చైన్నెలో జరిగింది. కార్యక్రమంలో ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ పాల్గొనేలా చేశాడు వారి కొడుకు రాత్రి. ఆ కార్యక్రమంలో ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ ఓకేసారి వేదికపై వచ్చి యాత్రను ప్రేమతో ఆలింగనం చేసుకుని అభినందించారు.ఆ ఫొటోలను ధనుష్‌ తన ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement