తమిళ హాకీ లీగ్‌ –2026కి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

తమిళ హాకీ లీగ్‌ –2026కి సర్వం సిద్ధం

Aug 9 2026 12:23 AM | Updated on Aug 9 2026 12:23 AM

● నేటి నుంచి ఆరంభం ● 35 రోజులు పాటు సాగనున్న లీగ్‌

కొరుక్కుపేట: తమిళనాడులో హాకీ క్రీడా ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, అలాగే వర్ధమాన ప్రతిభకు వృత్తిపరమైన వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రముఖ రాష్ట్ర స్థాయి ఫీల్డ్‌ హాకీ ఛాంపియన్‌షిప్‌ అయిన తమిళ హాకీ లీగ్‌ (టి హెచ్‌ ఎల్‌) 2026ను ప్రారంభించడానికి హాకీ తిరువళ్లూరు సిద్ధంగా ఉందని లీగ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రకాష్‌ అయ్యదురై తెలిపారు. ఈ మేరకు శనివారం జరిగిన కార్యక్రమంలో తమిళ హాకీ లీగ్‌ టోర్నమెంట్‌ 2026 ఈ నెల 9 నుండి సెప్టెంబర్‌ 12 వరకు చైన్నెలోని ఎగ్మోర్‌ లోని మేయర్‌ రాధాకృష్ణన్‌ హాకీ స్టేడియంలో జరగనుందన్నారు. 35 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో 16 జట్లు పాల్గొంటాయి. ఇందులో 12 పురుషుల జట్లు , తొలిసారిగా నాలుగు జట్లతో కూడిన మహిళల మినీ లీగ్‌ పాల్గొంటున్నాయని తెలిపారు. ఇందులో జట్లను ఆరు చొప్పున రెండు పూల్స్‌గా విభజిస్తారు. ప్రతి పూల్‌ నుండి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ సిక్స్‌ రౌండ్‌ రాబిన్‌కు అర్హత సాధించగా, అందులో మొదటి నాలుగు జట్లు తదుపరి రౌండ్‌కు చేరుకుంటాయి. ప్రముఖ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, క్రీడా సంస్థల నుండి ఎంపిక చేయబడిన పన్నెండు జట్లు , ఆరు జట్లు చొప్పున రెండు పూల్స్‌గా విభజించబడి పురుషుల ఛాంపియన్‌షిప్‌లో పోటీపడతాయని పేర్కొన్నారుకొత్తగా ప్రవేశపెట్టిన మహిళల మినీ లీగ్‌లో నాలుగు జట్లు లీగ్‌ ఫార్మాట్‌లో పోటీపడతాయి, ఇది రాష్ట్రంలో మహిళల హాకీని బలోపేతం చేయాలనే హాకీ తిరువళ్లూరు నిబద్ధతతో ఉందన్నారు తమిళ హాకీ లీగ్‌ అంటే అవకాశాలను సృష్టించడం అన్నారు. యువ క్రీడాకారులను ప్రేరేపించే, క్లబ్‌లను బలోపేతం చేసే, తమిళనాడు ప్రతిఒక్కరూ గర్వపడగలిగే ఒక టోర్నమెంట్‌ను అందించే లీగ్‌ను నిర్మించడమే మా దార్శనికత అని , ఆ ప్రయాణంలో మహిళల లీగ్‌ను చేర్చడం మరో ముఖ్యమైన ముందడుగు అని అన్నారు. లీగ్‌ డైరెక్టర్‌, పద్మశ్రీ వి. భాస్కరన్‌ మాట్లాడుతూ తమిళనాడులో అపారమైన హాకీ ప్రతిభ ఉందని టీహెచ్‌ఎల్‌ వంటి వ్యవస్థీకృత లీగ్‌, ఆటగాళ్లకు ఎదగడానికి అవసరమైన పోటీ వాతావరణాన్ని అందించి, వారిని ఆటలోని ఉన్నత స్థాయిలకు సిద్ధం చేస్తుందని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement