తగ్గేదేలే అంటున్న ధనుష్‌ | - | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే అంటున్న ధనుష్‌

Oct 14 2024 2:34 AM | Updated on Oct 14 2024 5:59 PM

నటుడు ధనుష్‌

నటుడు ధనుష్‌

తమిళ సినిమా: నటుడు ధనుష్‌ తగ్గేదేలే అంటున్నారు. ఏ విషయంలో తెలుసా? ఈయనకు హీరోగా కోలీవుడ్‌ లోనే కాకుండా టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ స్థాయిలో మంచి మార్కెట్‌ ఉంది. ఈ నాలుగు భాషల్లోనూ ధనుష్‌ కథానాయకుడిగా నటించి సక్సెస్‌ అవుతున్నారు.

తెలుగులో ఈయన కథానాయకుడిగా నటిస్తున్న కుబేర చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. పా.పాండీ చిత్రం ద్వారా మెగా ఫోన్‌ పట్టిన ధనుష్‌ ఆ చిత్రంతో మంచి ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని ఇటీవల రాయన్‌ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కథానాయకుడిగా కూడా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. 

కాగా ప్రస్తుతం ధనుష్‌ రెండు చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. అందులో ఒకటి నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడీ కోపం.. యూత్‌ ఫుల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో నటి అనికా సురేందర్‌, మ్యాథ్యూ థామస్‌ ప్రియా వారియర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రం విడుదల కాకుండానే ధనుష్‌ మరో చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి తెరకెక్కిస్తున్నారు. దీనికి ఇడ్లీ కడై అంటూ ఆసక్తికరమైన టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నటి నిత్య మీనన్‌ నాయకిగా నటిస్తున్నారు. 

కాగా దీని తర్వాత మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు ప్రకాష్‌ రాజ్‌ ముఖ్యపాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రంలో కథానాయకిగా నటి కీర్తి సురేష్‌ నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రమా, లేక నటుడు ధనుష్‌ హీరోగా నటిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. అలాగే భారీ అంచనాలు నెలకొన్నాయి.

నటి కీర్తి సురేష్‌1
1/1

నటి కీర్తి సురేష్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement