ప్రాణం తీసిన అనుమానం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అనుమానం

Jul 2 2023 7:34 AM | Updated on Jul 2 2023 7:34 AM

- - Sakshi

తమిళనాడు: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తిరుత్తణి నరసింహస్వామి ఆలయం వీధికి చెందిన వినాయకం(42), గిరిజ(38) దంపతులు ఏడేళ్ల నుంచి బెంగళూరులో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ అక్కడే కాపురం వుంటున్నారు. వీరి కొడుకు (9) అరక్కోణం సమీపంలోని ఉలియమంగళంలోని అమ్మమ్మ ఇంట్లో వుంటున్నాడు.

గిరిజ 15 రోజుల కిందట ఉలియమంగళంలోని పుట్టింటికి వచ్చింది. వారం కిందట తిరుత్తణిలోని వినాయకం తల్లి వద్దకు వెళ్లింది. వారం రోజులుగా దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహం చెందిన వినాయకం కత్తితో గిరిజను నరికాడు. తీవ్రంగా గాయపడిన గిరిజ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. ఇంటి తలుపులు మూసివుండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. .

డీఎస్పీ విఘ్నేష్‌తో పాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోపల చూడగా గిరిజ రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. అక్కడే వున్న వినాయకంను అదుపులోకి తీసకున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతోనే హత్య చేసినట్టు అంగీకరించాడు.

Advertisement
 
Advertisement
Advertisement