● బైక్‌పై నుంచి పడి వ్యక్తి దుర్మరణం
యాదగిరిగుట్ట రూరల్ : బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామ శివారులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండలం దిలావర్‌పూర్ గ్రామానికి చెందిన నమిలె ఐలయ్య(61) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం బైక్‌పై తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యలో యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామం వద్దకు రాగానే నియంత్రణ కోల్పోయి బైక్‌పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు.


