యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వైటీడీ పాలకమండలి కృషి చేయనుంది. 2014కు ముందు యాదగిరిగుట్ట ఆలయ దక్షిణ భాగంలో విద్యుత్‌కాంతులతో భారీ శంఖు, చక్రనామాలు ఉండేవి. ఆలయ అభివృద్ధి, విస్తరణలో భాగంగా వాటిని తొలగించారు. కాగా.. నూతనంగా ఏర్పాటైన వైటీడీ పాలకమండలి ఆధ్వర్యంలో మళ్లీ భారీ శంఖు, చక్ర నామాలను రూ.79లక్షలతో ఏర్పాటు చేయనున్నారు. వీటికి విద్యుత్ దీపాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ శంకు, చక్ర నామాలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసేందుకు వైటీడీ పాలకమండలి సభ్యురాలు కొణిదెల సురేఖ ముందుకొచ్చారు.


