బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ మార్చొద్దు | - | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ మార్చొద్దు

Aug 18 2026 8:04 AM | Updated on Aug 18 2026 8:04 AM

సూర్యాపేట : జాతీయ రహదారి 65 వెంట మంజూరైన బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ను మార్చొద్దని చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం నాలుగో రోజు చేరింది. అఖిలపక్షాల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణం వాణిజ్య భవన్‌ సెంటర్లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పీఓడబ్ల్యూ మహిళా నాయకులు కూర్చున్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన నేతలు ప్రజా సంక్షేమాన్ని మరిస్తే ఊరుకునేది లేదని మహిళలు హెచ్చరించారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఈరోజు నాలుగవ రోజు పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక ఆధ్వర్యంలో దీక్షలో మరసాని చంద్రకళ, కట్టా కల్పన, సూరం రేణుక, ఐతరాజు పద్మ ,భీమనపల్లి పద్మ, శెట్టిపల్లి గౌరమ్మ, గుండగాని రేణుక, చందనబోయిన లక్ష్మి, వేమనూరు పావని, సిరికొండ శ్యామల, ఎస్‌కే.ఫర్వీన్‌, చెరుకు అరుణ దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలకు నాయకులు కుంట్ల ధర్మార్జున్‌, రమణాచారి, చల్లమల్ల నర్సింహ, కొత్తపల్లి శివకుమార్‌, వజ్జే వీరయ్య, సట్టు నాగయ్య, చామకూరి నరసయ్య, బూర వెంకటేశ్వర్లు తదితరులు సంఘీభావం తెలిపారు.

నాలుగో రోజు రిలే నిరాహార

దీక్షలో మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement