లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

Feb 10 2026 8:10 AM | Updated on Feb 10 2026 8:10 AM

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కార్మికుల మెడకు ఉరితాళ్లు వంటి నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న తలపెట్టిన సమ్మె విజయవంతం చేయాలని కోరుతూ ఆల్‌ ట్రేడ్‌ యూనియనన్లు, ఎస్‌.కె.ఎం, రైతు, కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి రామలక్ష్మణ, సూర్యమహాల్‌ మీదుగా ఏడురోడ్ల జంక్షన్‌ వరకు మోటార్‌ బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి మోదీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి వేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు పి.తేజేశ్వరరావు, టి.తిరుపతిరావు, ఎస్‌.కష్ణవేణి, జి.సింహాచలం, పి.ప్రసాదరావు, ఎన్‌.బలరాం, ఎం.గోవర్దనరావు, కొత్తకోట అప్పారావు, ఎం.ఆదినారాయణమూర్తి, ఎస్‌.జ్యోతిశ్వరరావు, టి.సత్యాచారిరామ్‌, ఆర్‌.ప్రకాశరావు, అల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement